Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer

Thursday, May 7, 2026

శ్రీ త్రికూటేశ్వర వీరభద్ర క్షేత్రం#NAGULAPAHAD TEMPLE#ఇది మరో త్రయంబకక్షేత్రం | 2 ఆలయాల్లో 4 బ్రహ్మసూత్ర లింగాలు | కాలగర్భంలో కలుస్తున్న ప్రాచీనక్షేత్రం

శ్రీ త్రికూటేశ్వర వీరభద్ర క్షేత్రం#NAGULAPAHAD TEMPLE
telugu wiki లింక్ : https://w.wiki/MrTD
నాగులపహాడ్ telugu wiki లింక్ : https://w.wiki/Mm8A
NAGULAPAHAD TEMPLE #ఇది మరో త్రయంబకక్షేత్రం | 2 ఆలయాల్లో 4 బ్రహ్మసూత్ర లింగాలు | కాలగర్భంలో కలుస్తున్న ప్రాచీనక్షేత్రం సూర్యాపేట జిల్లా నాగుల‌ప‌హాడ్‌లోని 800 యేళ్ల పురాత‌న శివాల‌యాల‌ను చూస్తే అలాగే అనిపిస్తుంది. మూడు బ్ర‌హ్మ‌సూత్రాలున్న త్రికూటాల‌యం ఒక‌వైపు కుప్ప‌కూలిన ప‌రిస్థితి నుంచి పున‌ర్వైభ‌వానికి నోచుకుని నిత్య ధూప‌దీప నైవేద్యాలు అందుకోవ‌డం చూసి మ‌న‌సు పొంగిపోతుంది. ఆ ప‌క్క‌నే అత్య‌ద్భుత శిల్ప‌క‌ళ‌తో నిండి తురుష్కుల దాడిలో దెబ్బ‌తిని నిధుల కోసం త‌వ్వ‌కాలతో చెదిరిపోయి శిథిలాల‌తో క‌నిపించే మ‌రో బ్ర‌హ్మ‌సూత్ర శివాల‌యాన్ని చూసి మ‌న ఆధ్యాత్మిక చారిత్ర‌క వైభ‌వం మ‌న క‌ళ్లెదుటే కాల‌గ‌ర్భంలో క‌లిసిపోతున్న దుస్థితి చూసి అంతు తెలియ‌ని ఆవేద‌న క‌లుగుతుంది. ఒక భారీ బ్ర‌హ్మ‌సూత్ర శివ‌లింగ‌మే పెకిలివేయ‌బ‌డి బ‌య‌ట ఆవ‌ర‌ణ‌లో ప‌డేసి ఉండ‌డం ఆల‌య దుస్థితికి అద్దం ప‌డుతుంది. అయితే ఈ క్షేత్రం మామూలుది కాదు. మ‌న‌ల్ని క‌ట్టిప‌డేసే శిల్ప‌క‌ళాచాతుర్యం అణువ‌ణువూ నిండిన క‌ళాత్మ‌క‌త అచ్చెరువొందిస్తుంది. భ‌విష్య‌త్తు చెప్పే మంత్ర‌ద‌ర్ఫ‌ణం వంటి ఎన్నో విశేషాలు నిండిఉన్నాయి. 








No comments:

Post a Comment