Kallem Naveen Reddy is with Shankar Suraram.
పదాల్లో లోతు… భావాల్లో జీవితం… ఆలోచనల్లో మనిషితనం నింపిన ఆయన రచనలు ఎన్నో హృదయాలను తాకుతాయి.
ఎలాంటి ఆర్భాటం లేకుండా, నిశ్శబ్దంగా తన సాహిత్య ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆయనలో నాకు కనిపించేది ఒక గొప్ప కవి మాత్రమే కాదు… ఒక మంచి మనిషి, ఒక మార్గదర్శి, ఒక తండ్రి సమానమైన ఆత్మీయుడు.
నువ్వు చేస్తున్న ప్రయాణంలో నీకు అంతా మంచే జరగాలని నా మంచిని కోరుకునే అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయనతో ఏర్పడిన పరిచయం నా జీవితంలో ఒక అదృష్టంగా భావిస్తాను. ఎవరైతే పరిచయం అవుతారో ఆ పరిచయం గొప్పదిగా అనిపించాలి. అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉండటం చాలా అరుదే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో వ్యక్తిత్వం కంటే ప్రదర్శన ఎక్కువైన సమయంలో… సూరారం శంకర్ గారి సరళత, ఆలోచనల గాంభీర్యం, మనుషులపై ప్రేమ ప్రత్యేకంగా నిలుస్తాయి.
ఆయన కలం ఇంకా ఎన్నో తాత్విక సత్యాలను సమాజానికి అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
జన్మదిన శుభాకాంక్షలు Shankar Suraram సా
No comments:
Post a Comment