Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer

Monday, September 12, 2022

బీజేపీకి అధికారమిస్తే ఆగమైతం

 

బీజేపీకి అధికారమిస్తే ఆగమైతం

 

బీజేపీకి అధికారమిస్తే ఆగమైతం
  • విమోచన దినం పేరిట బీజేపీ నేతల డ్రామాలు
  • బండి యాత్ర ఎవరి కోసం?
  • సీపీఎం జాతీయ నేత రాఘవులు

కందుకూరు, సెప్టెంబర్‌ 12: పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో దేశాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని సీపీఎం పొలిబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. యావత్‌ దేశాన్ని కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అప్పగించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా తీసిన బైక్‌ ర్యాలీ సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చేరింది. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి అధికారం అప్పగిస్తే, ఆ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలకు తర్వా త ప్రజలంతా బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర ఎవరిని ఉద్ధరించడానికని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బీజేపీ నేతలు ఎవరూ పాల్గొనలేదని.. ఇప్పుడు అధికారం కోసం ఆ పార్టీ విమోచనం దినం పేరిట డ్రామాలు ఆడుతున్నదని ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment