గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Monday, December 24, 2012

Dr.Sujata's article on _ Dialogue on Telangana

Dear all, Please read Dr.Sujata's above article in today's AJ questioning Intellectuals on Telangana with reference to Dialogue on Telangana @ CPR Delhi on 14th. Earlier ,we have circulated the AJ article of Chalasani Srinivas of Andhra Intellectual Forum too . తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీకి, ఒక నాయకునికి పరిమితం చేసి, ఇది ఒక రాజకీయ నిర్ణయం ద్వారానే సాధ్యం అన్న ధోరణిపై అందరూ పునరాలోచించుకోవలసిన తరుణమిది. తెలంగాణ అంశాన్ని రాజకీయ పార్టీలకు వదిలేసి చోద్యం చూస్తున్న ఆంధ్ర ప్రాంత పెద్దమనుషులు, మేధావి వర్గాలు అదే సమయంలో ఎక్కడో మెల్లిగా, చాటుగా తెలంగాణకి మద్దతు తెలుపుతున్న ప్రజాస్వామికవాదులు ఆత్మావలోకనం చేసుకోవలసిన సందర్భం ఇది... నిజానికి ఏమాత్రం చరిత్ర తెలిసినా, అన్యాయం, అసమానతలపై ఏ కొద్ది అవగాహన ఉన్నా, పోరాటాలకు, ఉద్యమాలకు విలువలపై నమ్మకం ఉంటే తెలంగాణ ఈ రోజు ఆత్మహత్యలకి కేంద్రంగా నిలిచి ఉండేది కాదు. శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలను చూసుకున్నా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క రంగంలో అన్యాయం జరిగిందని కళ్లకు కట్టినట్టు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉన్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి, బలవంతంగా హైదరాబాద్ సంస్థానంపై సర్దార్ వల్లభాయి పటేల్ (1948-56), ఉక్కు మనిషి ఆధ్వర్యంలో సైన్యాలతో, బలగాలతో, గూండాలతో వేలాదిమందిని ఉక్కు పాదంతో నిర్దాక్షిణ్యంగా అణచివేసి ఈ ప్రాంతాన్ని ఈ పవిత్ర భారతదేశంలో విలీనం చేయక ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. ఇది దక్కనీ ప్రాంతం. ఇక్కడ నిజాం రాజుల పాలన, ఉర్దూ భాష, హిందూ ముస్లింల కలయికతో కూడిన సంస్కృతి, వ్యవసాయ ఆధారిత జీవన విధానం ఒక ప్రత్యేకత. ఇదే ఆంధ్ర ప్రాంతం నుంచి వేరుగా ఉండడానికి కారణం కూడా. ఒక భాష ఒక రాష్ట్రం అనే సాకుతో మద్రాసు నుంచి వేరుపడిన తరువాత సంపన్న ప్రాంతంగా పేరుగాంచిన హైదరాబాద్‌ను ఆక్రమించుకోవడానికి చూపిన అతి అందమైన అన్యాయం. 1918లోనే హైదరాబాద్ సంస్థానం ముల్కీ ఫర్మానాను జారీచేసింది. 1954-56 ఉద్యమం ఉధృతంగా నడిచింది. అంతకంటే ముందుగానే 'ఇడ్లీ సాంబార్ గోబ్యాక్' నుంచి వ్యతిరేకతను వివిధ రూపాల్లో ప్రకటిస్తూనే ఉంది. ఇవికాక పెద్దమనుషుల ఒప్పందం, ప్రాంతీయ ప్రత్యేక మండళ్లు, గిర్‌గ్లానీ కమిషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చారిత్రక ఘట్టాలు తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి ఉన్న నేపథ్యాన్ని, అనుభవాన్ని చెబుతాయి. ఇదే పరాకాష్ఠకి చేరి 1969 విద్యార్థులపై కాల్పులకి దారితీసి 369 ప్రాణాలు నేలరాలాయి. నెత్తురోడిన హైదరాబాద్ నగరం సాక్షిగా ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. 2009 నుంచి జరుగుతున్న ఉద్యమంలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. చనిపోయిన వాళ్ళు పిరికివాళ్ళే కావొచ్చు, అవగాహన లోపం ఉండొచ్చు కానీ వారి చావులను అవమానపరిచి ఉద్యమంలో వారిగురించి మాట్లాడకుండా ఉండడం అమానవీయమే అవుతుంది. ఒక ప్రాంత ఆకాంక్షను, ఉద్యమాన్ని చిన్నచూపు చూడడంతో నిరాశా, నిస్పృహలకి గురై ప్రాణాలు పోగొట్టుకున్న వారి చావుకు ఎవరు కారణం అనేది విశ్లేషించాలి. ఐదు సంవత్సరాల ఎన్నికల పండుగకు ప్రజల క్షేమాన్ని కుదించి, డబ్బు, కుల, స్వార్థ రాజకీయ నాయకులకు జీవితాలను అంకితం చేస్తున్న పరిస్థితులను చూసి మౌనంగా ఉన్న మేధావులు, ప్రజాసంఘాలను ఎలా అర్థం చేసుకోవాలి. ఉద్యమ నేపథ్యం చూస్తే తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ జనసభ, మహాసభ తర్వాత వచ్చినదే తెలంగాణ రాష్ట్ర సమితి (2001). కేవలం రాజకీయ నిర్ణయం ద్వారానే తెలంగాణ సాధ్యం అని గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంది. ఈ మలుపులు అన్నీ తెలంగాణ ఉద్యమంలో అనేక పార్శ్వాలను అంటే కులం, వర్గం, రాజకీయ అవగాహనను బయటపెట్టాయి. జై తెలంగాణ అన్నప్పుడల్లా జై ఆంధ్ర ఉద్యమం రావడం 1972 నుంచి మొదలైంది. అప్పుడు ముల్కీ విధానం రద్దు కావాలని జై ఆంధ్ర ఉద్యమం నడిచింది. ఇప్పుడు మళ్ళీ ఒక రాష్ట్రం, ఒక తల్లి పిల్లలం అని మరొక నినాదంతో కొంతమంది రాజకీయ నాయకుల కనుసన్నలలో, తప్పుడు తడకల ఆధిపత్య భావజాలంతో సీమాం ధ్ర ప్రజలను మోసం చేస్తూ సమైక్యాంధ్ర ప్రోగ్రాం నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంతా కేసీఆర్, అటు లగడపాటి, కావూరి లాంటి వాళ్ళు నడిపిస్తున్నారని చాలా మంది సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయంగా తెలుస్తుంది. మీడియా కూడా ఈ భావననే పెంచి పోషిస్తుంది. 1969 నుంచి ఉధృతంగా ఉద్యమం భావవ్యాప్తి దిశగా నడిచింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించాక రాజకీయ పార్టీల ద్వారా పరిష్కారమౌతుందని అనేక ప్రయత్నాలు 2001, 2004, 2009 ఎన్నికలలో నడిచాయి. ఏ పార్టీ కూడా తెలంగాణ అజెండా ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకుండా పోటీ చేయలేదు. గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తిరిగిన ప్రతి పార్టీ కూడా మేము తెలంగాణకి వ్యతిరేకం కాదు అని చెప్పే స్థితికి ఉద్యమం తీసుకొచ్చింది అన్న సత్యం మనముందున్నది. ఈ విషయం చెప్పడానికి కూడా మనకి పరకాల ప్రభాకర్, లగడపాటి, కావూరి, కేసీఆర్‌లు కావాలా? విధిలేని పరిస్థితిలో కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చోవడం, ఉద్యమం ఒక్కసారిగా పైకి లేవడం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన తిరిగి తెలంగాణ ప్రాంతానికి ఒక కొత్త ఊపిరిలూదింది కానీ ఆ ఆశలు నిలువక ముందే మళ్ళీ కపట రాజకీయ పార్టీలు బరిలోకి దిగి ప్రకటన వెనుకకుపడేట్టు చేశాయి. రాజీనామాలు, ఎన్నికలు, మిలియన్ మార్చ్‌లు, సకలజనుల సమ్మె, బం ద్‌లు, ఆత్మహత్యలు నిత్యకృత్యం అయ్యాయి. దీనికి బాధ్యత గల ప్రజాసంఘాలు, మేధావుల నిశ్శబ్దం కాలానికి ఒక మాయని మచ్చ గా మిగిలిపోనున్నది. ఈ మధ్యలో లవణం గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, కొద్దిమంది రచయితల 'కావడి కుండలు' వంటి రచన లు, బహుజన కెరటాలు, కుల నిర్మూలన వంటి కొద్ది విశిష్ట పత్రికలూ తప్పితే ఎక్కువ బాహాటంగా మద్దతు ఇచ్చిన వారు చాలా తక్కువ. ఒక ప్రాంతం అల్లకల్లోలమవుతుంటే, ఉద్యమాలనే ఊపిరిగా మలుచుకొని బతుకుతుంటే ఒక పరిష్కార మార్గాన్ని చూడడంలో, చూపడంలో సమైక్యాంధ్రలో బుద్ధిజీవులు కరువయ్యారు అని తెలంగాణ ప్రాంతం భావించదా? రాజకీయ పార్టీలంటేనే స్వార్థం, వాటి మనుగడ కోసం ఏమైనా చేస్తాయి అన్న విషయం తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కళ్లారా చూసారు. దీనికి తెలంగాణ రాజకీయ నాయకులు మినహాయింపు కాదు. సీమాంధ్ర పెద్దమనుషులు రెండు ప్రాంతాలకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ ఇక్కడ వివరిస్తాను. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో ఉన్న సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనే ప్రముఖ పరిశోధన సంస్థ ఢిల్లీలో ఇరు ప్రాంతాల నేతలను, పరిశోధన కారులను పిలిచి తెలంగాణ అంశంపై ఒక సానుకూల పరిష్కార మార్గం చూసే నేపథ్యంలో ఒక ప్రయత్నం చేసింది. దానికి 'డైలాగ్ ఆన్ తెలంగాణ' అని పేరు పెట్టి, రాజకీయాలతో సంబంధం లేని వారిని దాదాపుగా 50 మందిని ఎంపిక చేసి ఆహ్వానించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, జాహెద్ అలీ ఖాన్ (ఎడిటర్, సియాసత్), భిక్షం గుజ్జా, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బూర్గుల విజయ్, పాండు రంగారెడ్డి, డాక్టర్ సూరేపల్లి సుజాత, ఆంధ్ర ప్రాంతం నుంచి సి.వి. రాఘవులు, కె.ఎస్. చలం, డాక్టర్ చిన్నయ సూరి, కె.వి. రమణా రెడి, వీరితో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులని, పరిశోధనకారులని, కొద్దిమంది మీడియా మిత్రులని, శ్రీకృష్ణ కమిటీ వారిని కూడా పిలిచారు. తెలంగాణ రాష్ట్రంపై కనీసం మేధావులు అన్నా నోరు విప్పుతారని, నిజానిజాలు కోపాలు, ఉద్రేకాలు, ఆవేశకావేశాలకు లోనుకాకుండా మాట్లాడుకోవచ్చని ఎంతో ఆశపడ్డ మాకు చాలా నిరాశ ఎదురైంది. అంతే కాకుండా ఇంకా బాధ కలిగించిన అంశం యునైటెడ్ ఆంధ్రా జాక్ రెసిడెంట్ వై. నరసింహారావు, కన్వీనర్ వి.అంజిరెడ్డి నుంచి నిర్వాహకులకు అందిన లేఖ. దాని సారాంశం 'మీరుపంపిన ఆహ్వానంలో తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్ నోట్ తెలంగాణకు మద్దతు పలికేదిగా ఉందని, అందుకని మేము ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ఉంది. నిజానికి ఆ విధమైన అభిప్రాయముంటే అక్కడికొచ్చి నివృత్తి చేసుకోవచ్చు ఈ మేధావులు. కానీ ఆ విధంగా జరగకుండా చూసి ఏమి నిరూపించుకున్నారు? అక్కడ కనీసం 'చర్చ' అని కూడా అనలేదు కేవలం 'డైలాగ్' అని మాత్రమే అన్నారు. ఆ సమావేశానికి శ్రీకృష్ణ స్వామి అయ్యర్ వంటి నీటి నిపుణులు, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు దుగ్గల్, సంజయ్ బారు వంటి ప్రముఖులు హాజరయి వారి అభిప్రాయాలను తెలిపారు. ఒక చర్చకి, డైలాగ్‌కి సిద్ధంగా లేని పెద్ద మనుషులు రెండు రాష్ట్రాల మధ్య సుముఖంగా, సవ్యంగా ఒక పరిష్కారానికి వస్తారని అశలు లేవు. తెలంగాణపై వోట్లు, సీట్లు, నోట్లు అన్న సూత్రాలతో రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణ విషయం పట్టించుకోవడానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన సామాన్య ప్రజలు ముందుకు రావడం లేదు. రానివ్వట్లేదు అంటే బాగుంటుందేమో. ఒక ప్రాంతం అతలాకుతలమవుతుంటే ఇంకొక ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రేక్షకులుగా చూస్తూ ఊరుకోవడమేనా? గత 60 ఏళ్లుగా తమ వ్యాపారాల కోసం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి సొంత ప్రాం తాలని, వాటి అభివృద్ధిని మరిచిపోయిన సీమాంధ్ర నాయకులని అడిగే కనీస ప్రయత్నం చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం కాదా? నిజానికి అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్రకి, శ్రీకాకుళం వంటి జిల్లాలకి రాజధాని హైదారాబాద్ అంటే ఎంత దూరమో, అభివృద్ధిలో అంతే దూరంగా ఉంది. వారికి రేపు విజయవాడో, విశాఖపట్నమో రాజధాని అయితే లాభం చేకూరుతుంది అని ఆలోచించే సమయం ఇది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కొద్దిమంది అగ్రకుల పెట్టుబడిదారుల చేతిలో నలిగిపోతున్న సమైక్యాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన కులాల, వర్గాల వారికి న్యాయం చేకూరుతుంది అన్న వాస్తవాన్ని ప్రజల ముందుంచాలి. శ్రీకృష్ణ కమిటీలో కూడా స్పష్టంగా గ్రామీణులు, కిందిస్థాయి వారు రెండు ప్రాంతాలను కోరుకుంటున్నారని తెలియజేశారు. వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం రాష్ట్రాల విభజనతో అభివృద్ధికి నోచుకోదా? ఇప్పటివరకు ఏర్పడ్డ ఛత్తీస్్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మానవాభివృద్ధి సూచికలు జాతీయస్థాయి కంటే మెరుగ్గా ఉన్నాయన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1956, మార్చ్ 5 బహిరంగ సభలో చెప్పారు. 'విశాలాంధ్ర' అనే భావనే సామ్రాజ్యవాద విస్తరణకు తోడ్పడేదిగా ఉందని 1953, అక్టోబర్ 17లో చెప్పారు. ఆయన అపోహలు, ఫజల్ అలీ ఖాన్ భయాలు నిజమయ్యాయి అని వేరే చెప్పక్కర్లేదు. తెలంగాణ అనగానే ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొడతారని, నీళ్ళు ఇవ్వరని, హైదరాబాద్ పోవాలంటే వీసా కావాలని, ముస్లింలకు చేటని, మావోయిస్టుల సమస్య వస్తుందని పుకార్లు, వదంతులు పుట్టిస్తున్న వారి వార్తలను నమ్మి మోసపోతున్నది సామాన్య ప్రజలే. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అని అమెరికా వంటి దేశాలు నిరూపిస్తున్నాయి. ఈ రాష్ట్రాల ద్వారా భాష, సంస్కృతి, వనరుల వినియోగం, నిధుల పంపకం సక్రమంగా అన్ని ప్రాంతాలకు అందుతాయని చరిత్ర చెబుతుంది. ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు, మేధావులు, విద్యార్థులు అ అవగాహనను ప్రచారం చేయవలసిన బాధ్యత భుజాన వేసుకోవాలి. స్వేచ్ఛ, స్వతంత్ర సమానత్వ పునాదుల మీద న్యాయాన్యాయాల నిర్ణయం జరగాలి. లేకపోతే ఈ ప్రజాస్వామ్యం నిరంకుశ రాచరిక పాలన వైపు, పెట్టుబడిదారుల కబంధ హస్తాల చేతిలో చిక్కుకుని ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే వైపుకు తీసుకుపోతాయి. ఇవే పెట్టుబడిదారీ శక్తులు నేడు ప్రభుత్వాలను శాసిస్తున్నాయి, ఉద్యమాల నోర్లు మూయిస్తున్నాయి అన్న విషయం తెలుసుకొని కూడా మౌనంగా ఉండడం సమాజానికి చేసే ద్రోహమే. - సుజాత సూరేపల్లి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రచయితల వేదిక Regards D.P.Reddy From: D.P.Reddy To: telangana utsav ; TELANGANA DEVELOPMENT FORUM INDIA ; TDF CHARCHA ; TIT ; KODANDRAM REDDY Sent: Friday, December 21, 2012 7:50 PM Subject: [tdf-india] లెక్కలు తేల్చాలి, అపోహలు పోవాలి - చలసాని శ్రీనివాస్ : Today's AJ Edit page Dear all, With Separate Telangana ,Andhra Intellectulas Forum Chairman Chalasani Srinivas is expressing apprehensions & doubts mainly on Hyderabad,Irrigation issues & Employment to Seemandhra youth etc., in AJ edit article of today 21st. Actually, Srinivas & other Intellectulas like Prof ChinnayaSuri from Seemandhra had not attended the Seminar on the " Dialogue on Telangana " initiated & invited by Center for Policy Research [CPR] ,NewDelhi on 14th Dec'12. From Telangana ,Prof Kodandaram ,Prof Madabhushi Sridhar,Prof Sujata, ZaheerAli Khan,Bhiksham G ,Vijay B,Vishweshwar Konda, Sriram Vedire , D.Ramakrishna Reddy [TJAC Delhi] ,Dr Hyder & myslef attended & participated in the Dialogue on Telangana.Other dignatories from Delhi who participated in this dialogue are : Pratap Bhanu Mehta & Shivarama Krishnan --- CPR Delhi Sanjay Baru --P.M's Media adviser Vinod K Duggal --SKC Member Yogendra Yadav -- Amm Admi Party Ramaswamy Iyyer --Irrigation Expert etc., ----------------------------------------------------------------------------------- AJ may publish Sujata's article on "Dialogue on Telangana" in 1-2 days.Please READ the Article of Srinivas beklow & respoond : =========================================================================== లెక్కలు తేల్చాలి, అపోహలు పోవాలి - చలసాని శ్రీనివాస్ 1972లో ఆంధ్ర ఉద్యమాన్ని అణిచివేస్తూ డిసెంబరు 21న ప్రధాని ఇందిర అధికారికంగా రాష్ట్రాన్ని విడగొట్టేది లేదని ఆంధ్రులు శాశ్వతమని నమ్మారు. అదే రోజు విడిపోయి వుంటే తీర సీమాంధ్రలు దేశంలోనే నెంబర్ 1గా ఉండేవి. పోయి మీ ప్రాంతాలలో స్వాభిమానంతో పాటు బతకండని, తెలంగాణ వస్తే లక్షల మంది ఉద్యోగాలు లాక్కుని తీరుతామని బెదిరిస్తుంటే అక్కడ స్థిరపడ్డ మిగతా ప్రాంతవాసులు ఎక్కడికి పోవాలి.. చావాలా అంటూ ఆవేదన చెందే వారి ఇబ్బందులను పట్టించుకోవాలి కదా? ఆంధ్రులూ ఆలోచించాలని లవణం, రమణ, రాంప్రసాద్‌లు రాసిన వ్యాసాల తీరు వేరుగా ఉన్నా మూడూ ఆంధ్రుల ఆవేదనను వెలిబుచ్చాయి. తీర సీమాంధ్రులు అన్ని విధాలుగా త్యాగంచేసినా ఎంతకాలమీ గొడవని విసుగు చెందే లవణం గారు ప్రత్యేక రాష్ట్రం కోరి ఉండవచ్చు. కోస్తా అభివృద్ధిని అడగక ఫక్తు రాజకీయ స్వార్థం కోసం జై ఆంధ్ర వాదులని విమర్శించే కొందరు సమైక్య వాదులు ఉన్నారు. అదే విధంగా కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లో లేదా కొందరు ప్రత్యేక తెలంగాణ నాయకుల కాల్మొక్కి వారి దయతోనో నీళ్ళెవడికీ అక్కర్లేదంటూ హైదరాబాద్ కె సిఆర్ గారి సొత్తనే జై ఆంధ్రవాదులూ ఉన్నారు. వాస్తవానికి నీటి పారుదల, హైదరాబాద్‌లో స్థ్థిరపడ్డ వారి భవిష్యత్తు , తీర సీమాం ధ్ర యువత ఉపాధి -ఉద్యోగాల సమస్యలని విభజనకు 'ముందే' పరిష్కరించకుండా విభజనకి ఎవరు అంగీకరించినా అది కోస్తా , రాయలసీమ ప్రాంతాల వాసులకు ఖచ్చితంగా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. నిజంగానే అలా హక్కులని తాకట్టు పెడితే ఇప్పుడు పెరిగిన రేట్లు నీటిపై రాసిన మాటలై గాలి బుడగలై నీరు, నిధులు, ఉద్యోగాలు ఏమీ దక్కవు; ఆ తరువాత కోస్తా , సీమ ప్రజలు బోరున విలపించినా లాభం ఉండదు. మోసపోవడం ఆంధ్రులకి కొత్త కాదు . ఏనాడో చెన్నపనాయుడి చెన్నై పట్నాన్ని కోల్పోగా మొదటి ఎస్సార్సీ ఏకగ్రీవంగా ఆంధ్రరాష్ట్రానికి సిరిగుప్ప, బళ్లారి, మల్లాపురం, హంపీ, విజయనగరం మొదలైన వాటిని కలపమంది; అయినా వాటితో పాటు, విశాలాంధ్ర ఉద్వేగంలో నాయకులు సిరోంచ, కోలారు, బళ్ళారి , ధర్మపురి, ఆర్కాటు , బస్తర్ , కోరాపుట్ , బరంపురం లాంటి ప్రాంతాలను పరభాషా రాష్ట్రాలకు చేతులారా కోల్పోయారు. తరువాత అభివృద్ధిని హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు దఖలు చేశారు. అయితే ఆనాడు ఆంధ్ర నాయకులు పోగొట్టుకున్నవి తిరిగి కలపాలనుకోవడం మంచిదే కాని , నేడు ఏదో చిరాకుతో ఉన్న హక్కులే కోల్పోతే తరతరాలు ఈ ద్రోహాన్ని క్షమించవు. ఓ 30 టియంసిల నీటికోసమే మన తెలుగు ప్రజలు ఒక ప్రక్క కటకటకటలాడుతుంటే అల్మట్టి ( 300 టియంసిలు వాడుకోవచ్చు) ఎత్తును కర్ణాటక పెంచుకోవాలనే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల డిమాండ్/ ప్రగాఢ ఆకాంక్ష మన ఖర్మకొద్దీ నెరవేరేటట్లే ఉంది. ఇక వచ్చే తరతరాలు తెలుగు జాతి నోటిన మట్టేనేమో? నిన్ననే టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే , మరి వారి ఆస్థాన నిపుణుడు శ్రీశ్రైలంలో కనీస మట్టం లేకుండా క్రిందికి నీరు విడుదల చెయ్యకూడదని తెలంగాణకు కూడా అన్యాయం చేస్తూ నాగార్జునసాగర్‌కే నీరురాకుండా స్టే తీసుకు వచ్చింది విద్వేషాల పెంపుకేనా? రాష్ట్ర విభజన అయితే 700 కిలో మీటర్ల మన రాష్ట్ర సరిహద్దులు నదుల ప్రవాహాలతో పాటు వాటి మధ్యలోనే చీలి వెళుతూ ఉండటమే కాక , 8 అంతరాష్ట్రీయ ప్రాజెక్టులు ఉంటాయి. కావేరీనది క్యాచ్‌మెంట్ ఆ రాష్ట్రం మొత్తంలో 18 శాతం లేకపోయినా , నదీ జలాలపై ట్రిబ్యునల్ , సుప్రీం కోర్టు , కేంద్రం ఆదేశాలు ఉన్నా కర్ణాటకలో జరిగిన మారణకాండ - ఇవన్నీ పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత నీటి సమస్యలు ముందుగా పరిష్కరించుకునే విడిపోవాలని ఏ మాత్రం విజ్ఞత ఉన్న వారైనా కోరుకుంటారు. కేటాయింపుల కంటే ఒక్క చుక్క నీరు ఎవ్వరికీ ఎక్కువ అక్కరలేదు. ఇక హైదరాబాద్. 1589లో ఆ నగర పునాది నిర్మాణం మొదలుపెట్టినప్పటినుంచి 432 సంవత్సరాలపాటు సాగిన నగర అభివృద్ధిలో తెలంగాణ సామాన్య ప్రజలతో పాటు అత్యధిక కాలం తీర సీమాంధ్రుల రక్తం స్వేదం కూడా ఉందనే నిజాన్ని ఎందుకు దాచి పెడుతున్నారు? పైగా హైదారబాద్ సంస్థాన ప్రజల రక్షణార్థం నిజాంలు బలిమేకలాగా రాయలసీమని బ్రిటిష్ వారికి అప్పగించారు. 1972లో హైదరాబాద్ వద్దని ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలని ఉద్యమిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి , తెలంగాణ నాయకులు ఇతరులు దారుణంగా ఆంధ్రులని పిట్టల్లా కాల్పించారు ( ఉద్యమంలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోగా / వేలాది మంది క్షతగాత్రులు అయ్యారు). అలా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని అణిచివేసి హైదరాబాద్‌ని అందరి నిధులతో అభివృద్ధిచేయాలని ఒప్పందం చేయించి వందలాది రాష్ట్ర సంస్థలు పరిశ్రమలే కాక వందల కేంద్ర సంస్థలు కూడా అక్కడే పెట్టించారు. మరల ఇప్పుడు నలభై సంవత్సరాల తరువాత హైదరాబాద్ మీద ఏ విధమైన హక్కూ లేదనటం సరైనదా? కోటిపై బడి ఆదాయం వస్తూ లోటులో ఉండే ఒకనాటి హైదరాబాద్ పరిస్థితిని నేటితో పోల్చలేము . 1972లో ఆంధ్ర ఉద్యమాన్ని అణిచివేస్తూ డిసెంబరు 21న 'అత్యధిక మెజారిటీ' ఉన్న ప్రధాని ఇందిరాగాంధి అధికారికంగా రాష్ట్రాన్ని విడగొట్టేది లేదు అని ప్రపంచానికి పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటనని తీరసీమాంధ్రులు శాశ్వతమని నమ్మారు. అదే రోజు విడిపోయి వుంటే తీర సీమాంధ్రలు దేశంలోనే నెంబర్ 1గా ఉండేవి. పరాయి పంచన ఎందుకు బతుకుతారు పోయి మీ ప్రాంతాలలో స్వాభిమానంతో పాటు బతకండని ఒకరూ, తెలంగాణ వస్తే లక్షల మంది ఉద్యోగాలు లాక్కుని తీరుతాం అని మరొకరు, తమ స్వంత రాజకీయ లబ్ధి కోసం రోజుకో విధంగా మరి కొందరు బెదిరిస్తుంటే అక్కడ స్థిరపడ్డ మిగతా ప్రాంతవాసులు ఎక్కడికి పోవాలి.. చావాలా అంటూ ఆవేదన చెందే రమణ లాంటి మధ్యతరగతి వారి ఇబ్బందులను పట్టించుకోవాలి కదా? లక్షలాది మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలకి ప్రాతినిధ్యం వహించే ఎపి ఎన్ జి ఓ సంఘం కూడా సమైక్యాంధ్ర అంటుంది. అందువల్ల మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల ప్రకారం ఖచ్చితంగా వారి సూచనల, పట్టికల , పటాల ప్రకారం ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగర ప్రాంతాన్ని దేశానికి రెండవ రాజధానిగా చేస్తే రక్షణలతో పాటు చుట్టు ప్రక్కల తెలంగాణ ప్రాంతాలు అనితర అభివృద్ధిని సాధిస్తాయి. పైగా తెలంగాణ రాజధాని కూడా సహజంగానే హైదరాబాద్‌లోనే ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు దీటుగా అభివృద్ధి జరపి కోస్తా సీమలకు ప్రత్యేక రాజధానులు ఏర్పాటు చేయవచ్చు . రాష్ట్రం రెండుగా విడిపోతే పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లు పాత కర్నూలునో లేదా రేణిగుంట / తిరుపతినో కోస్తావారు రాజధానిగా ఒప్పుకోరు. అలాగే బైరెడ్డి, రమణారెడ్డి లాంటి ప్రత్యేక సీమ వాసులు చేసే భీకర సింహనాదాలు విన్న తరువాత కలహాలు, సందేహాలు , బుజ్జగింపులతో మరో సీమ తీర ఉమ్మడి రాష్ట్ర ప్రయోగం నిస్సందేహంగా విఫలం అవుతుంది. ముందే మూడు లేదా నాలుగు రాష్ట్రాలు స్పష్టంగా ప్రకటించకపోతే తాంబూ లిచ్చాం తన్నుకు చావండి అన్నట్లుండే పరిస్థితి ఖాయం. అందువల్ల జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సూచించిన ప్రకారం నాలుగైదు తాలూకాలు కలిపి ( కోస్తా , సీమలకు భూసరిహద్దుతో ) హైదరాబాద్‌ను మెట్రోపొలిస్ చేస్తే మూడు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఏర్పరచవచ్చు. ఆయా రాష్ట్రాలలో రెండవ రాజధానులు ( కొంతకాలం తరువాత ముఖ్య రాజధానులుగా మార్చుకోవచ్చు) అనేక హైకోర్టు బెంచ్‌లు ఏర్పరచుకుని ఇప్పటినుంచే సేవారంగం, ప్రభుత్వ సంస్థల స్థాపన, వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధిచేసుకోవడం సూచించవచ్చు. కొందరు ప్రత్యేక తెలంగాణ నాయకులు భర్తీచేయాల్సిన లక్ష ఉద్యోగాలపై మాట్లాడకుండా రాజకీయం కోసం తెలంగాణేతర భారతీయులు వేల/ లక్షల ఉద్యోగాలు ఆక్రమించుకున్నారనే అభూతకల్పనలు చెప్పడం మంచిదికాదు. అసలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలెన్నో , వాటిల్లో స్థానికేతరులు ఉండాల్సిన ( 20-30 శాతం) సంఖ్య కంటే ఎన్ని వందల మంది ఎక్కువగా ఉన్నారో తేలాలి. 1956-2012 సంవత్సరాల మధ్యన విద్యుత్, వైద్య, ఆరోగ్యం , విద్య, ఉద్యోగ , ఉపాధి , నీటి పారుదల , పారిశ్రామిక, సేవా రంగాలలో ఏ ప్రాంతాలు ఎంత అభివృద్ధితో పయనించాయో తేల్చాలి. అసలు గోదావరి, కృష్ణానదుల్లో మొత్తం ఐదు రాష్ట్రాల నుంచి ఎంత నీరు వస్తుందో ప్రతి విషయంలోనూ లెక్కలు ఖచ్చితంగా తేలాల్సిందే . అపోహలు పోవాల్సిందే . ఎన్నో కమిటీలు ఆ ఆరోపణలు మోసం అని తేల్చినా ఆ కమిటీలపై కొందరు నమ్మకం లేదంటున్నారు కాబట్టి ఆరు నెలల సమయం తీసుకుని ఐక్యరాజ్యసమితి నుంచి కమిటీని ఏర్పాటుచేసి తేల్చాల్సిందే . దొంగలు ద్రోహులనే ముద్రలు అవాంఛనీయంగా తరతరాలు వేయించుకుని విడిపోవాల్సిన అవసరం ఎవరికీ లేనేలేదు. కింకర్తవ్యమేమిటి? సొంత లబ్ధి, స్వార్థరాజకీయాల కోసం తీర సీమాంధ్ర ప్రజలని అత్యంత దారుణంగా దూషించని ప్రత్యేక తెలంగాణ కోరే మంచి నాయకత్వం ముందుకు వచ్చి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ , ఉత్తరాంచల్‌లో లాగా ఉద్యమించి ఉంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెలంగాణ, సీమ , అలాగే ఎన్ని రాష్ట్రాలుగానైనా సుహృద్భావంతో శాస్త్రీయంగా విడిపోయి ఉండేవి. ' ప్రాంతాలుగా విడిపోదాం-సోదరులుగా ఎప్పటికీ మెలుగుదాం' ఇదే స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ కోరింది. ఇప్పటికైనా ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం, గాలి వినోద్‌కుమార్ , పత్రికా సంపాదకులు లాంటి మేధావులు ముందుకు వచ్చి స్వార్థ రాజకీయ నాయకుల స్వార్థం కోసం విద్యార్థుల త్యాగాలు అవసరం లేదని రాష్ట్రం వచ్చిన తర్వాత పునర్నిర్మాణం కోసం వారి పోరాటాలు అవసరమని చెప్పాలి. తమ స్వార్థం కోసం విద్వేషాలు రెచ్చగొట్టే నాయకులని దూరంపెట్టి , వెంటనే ఇతర ప్రాంతాలలోని సోదరులతో చర్చలు జరిపి సుహృద్భావంతో విడిపోయేటట్లు ప్రయత్నించాలి. అది సాధ్యం. ఉత్తమం . అలా కాకుండా కొందరు నాయకుల రెచ్చగొట్టిన విద్వేషాల ఆధారంగానే రాష్ట్ర విభజన జరిగి విడిపోతే ఈ భూమి ఉన్నంత వరకూ పక్క పక్క సరిహద్దులు ఉండే మన రాష్ట్రాల ప్రజలూ ప్రశాంతంగా ఎప్పుడూ ఉండలేరు. ఉందామన్నా కొంత మంది స్వార్థ నాయకులు ఉండనివ్వరు. అఖిలపక్ష సమావేశ విషయానికి వస్తే తెలుగుదేశం , వై యస్ ఆర్ కాంగ్రెస్ , సిపి ఐ, భారతీయ జనతాపార్టీ లాంటి పక్షాలు కోస్తా, సీమ హక్కులు కూడా ముందుగా పరిష్కరించాలని కోరకుండా తెలంగాణ ఇచ్చేస్తే మేమడ్డురామని తెలివిగా చెప్పామనుకుంటే అది తీర సీమాంధ్రులకి శాశ్వతంగా చేసిన ఘోర ద్రోహం గానే పరిగణించాలి. కోస్తా సీమవాసుల సమస్యలన్నీ ముందుగా పరిష్కరించి ఆ వెంటనే మూడు నాలుగు రాష్ట్రాలుగా చీల్చమని చెపితే మంచిదే. కోస్తాంధ్ర నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేవలం 11 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. దశాబ్దాలుగా ఇతర ప్రాంతాల నుంచి ఎన్నికైన నాయకులని మోసీ మోసీ అసలు ముఖ్యంగా కోస్తా హక్కుల కోసం మాట్లాడే గట్టి ప్రతినిధే లేకుండా పోయారు. ఏకంగా ఉత్తర కోస్తాలో అయితే రెండు కోట్ల జనాభా ఉన్నా నేటివరకూ ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఏది ఏమైనా కోస్తా ప్రాంతానికి మంత్రులు , పెట్టుబడిదారులు, సినీ హీరోలు లాంటి వారు ఉన్నా ప్రస్తుతం దీటైన రాజకీయ నాయకత్వం కొరత చాలా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ కూడా ఒక పోరాట పటిమ కల బహుజన సామాజిక నాయకత్వం బయటికి వచ్చి తెలుగు వారి సౌభ్రాతృత్వాన్ని దృష్టిలో ఉంచుకునే ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం , హక్కుల కోసం ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టాల్సిన సమయం వచ్చింది. ఆ కోర్కె తొందరలోనే నెరవేరుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాము. - చలసాని శ్రీనివాస్ ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం Regards D.P.Reddy

No comments:

Post a Comment