గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Saturday, September 30, 2023

నమస్తే తెలంగాణ NEWS PAPER 01 అక్టోబర్ 2023

viral video |siri malli || flute music

సమర్థ పాలనతో సంక్షేమాభివృద్ధి…. సిరికొండ మధుసూదనాచారి

అలుపెరగని పోరాటంతోనే..సిరికొండ మధుసూదనాచారి

 నమస్తే తెలంగాణ

అలుపెరగని పోరాటంతోనే..

సిరికొండ మధుసూదనాచారి

(ఎమ్మెల్సీ, తెలంగాణ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు)

రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజలకు చేస్తున్న మోసాన్ని పొత్తుల ద్వారా బయటపెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసిన చాణక్యం కేసీఆర్ ది. కమిటీల పేరుతో, ప్రకటనల పేరుతో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాలయాపన చేసినా త్యాగాల పంథా వీడకుండా పోరాడిన సహనం ఆయన సొంతం. తన ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రజల సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక అపురూప ఘట్టంగా నిలిపారు.

గాంధీజీ ప్రవచించిన అహింసా పంథాలోనే

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉద్యమం హింసకు దారితీసి, ఏ ఒక్కరికి నష్టం కలిగించినా అది ఉద్యమ స్ఫూర్తికే విఘాతమని

కేసీఆర్ భావించారు. అందుకే నాయకులను, కార్యకర్తలను

శాంతియుత మార్గంలో ముందుకు నడిపించారు. 1969 ఉద్యమంలో తెలంగాణ వ్యతిరేకులు హింసకు పాల్పడి దానిని తెలంగాణవాదులపై మోపారు. అలాంటి ప్రమాదానికి ఆస్కారం లేకుండా జాగ్రత్తపడి, గాంధేయ మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని తీరానికి చేర్చారు కేసీఆర్. ఆ తరువాత 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. టీఆర్ఎస్ అనుకున్నన్ని స్థానాలు సాధించకపోవడంతో దాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను కనుమరుగు చేసే కుట్ర పన్నింది! ఆ సందర్భంగా నిరాశలో ఉన్న నేను ఆచార్య జయశంకర్ సార్ను కలిశాను. ఆందోళనతో 'తెలంగాణ సాధ్యమా?' అనే సంశయాన్ని వెలిబుచ్చాను.

'రాష్ట్ర సాధన పట్ల పూర్తి నిబద్ధత కలిగి, తెలంగాణ సమస్యల పట్ల, వనరుల పట్ల,

ప్రజల పట్ల సంపూర్ణమైన అవగాహన గల నాయకుడు కేసీఆర్. తెలియని విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలనే జిజ్ఞాస ఉన్న వ్యక్తి. తనకు తెలిసిన అంశాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో గుండెకు హత్తుకునేలా చెప్పడంలో దిట్ట. ప్రజలను సమీకరించడంలో, వారిని శక్తిగా మలచడంలో, ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే పసిగట్టి వాటికి పైఎత్తులు వేసి చిత్తు చేయగల రాజకీయ దురంధరుడు. నిధులు సమకూర్చడంలో, ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో, వ్యూహరచనలో అపారమైన ప్రజ్ఞాశాలి. తనవల్ల, తనతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమవుతుంది, కేసీఆర్ తో  సాధ్యం కాకుంటే తెలంగాణ 'రాష్ట్రం కల్ల' అని జయశంకర్ సార్ అన్నారు. కేసీఆర్ సామర్థ్యాన్ని ఆయన ప్రబలంగా విశ్వసించారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో త్యాగాల చరిత్రకు ఆద్యుడు ఆచార్య జయశంకర్ సార్. నూనూగు మీసాల ప్రాయంలోనే తెలంగాణను ఆంధ్రాతో కలిపితే నీళ్లు,నిధులు, నియామకాలు కొల్లగొట్టబడతాయని గ్రహించి జ్ఞాని. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ వాదమనే దీపాన్ని ఆరిపోకుండా కాపా డి, ఎందరిలోనో స్ఫూర్తిని నింపారు. కేసీఆర్కు మార్గదర్శి అయ్యారు. మహాకవి కాళోజీ నారాయణరావు అన్న 'పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది' మాటలు ఆచార్య జయశంకర్ సార్కు వర్తిస్తాయి. తెలంగాణ కోసం బ్రహ్మచారిగా ఉండి జీవితాన్ని తెలంగాణ వాదానికి అంకితం చేసిన ఆయన, రాష్ట్రం సాకారమవడానికి మూడేళ్ల ముందు మరణించారు.

2004లో కాంగ్రెస్, 2009లో తెలుగుదేశం తెలంగాణకు అనుకూలమని ప్రకటించి టీఆర్ఎస్ తో  పొత్తుపెట్టుకున్నాయి. ఎన్నికలలో గెలిచి కాంగ్రెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి తెలుగుదేశం ద్రోహం చేశాయి. రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని వారి ద్రోహ స్వరూపాన్ని బట్టబయలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నిఖార్సైన పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు గ్రహించేలా చేయడం కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం.

తన చివరి అస్త్రంగా 2009 నవంబర్ 29న తెలంగాణ జైత్రయాత్రో-కేసీఆర్ శవ యాత్రో' అనే కఠిన నిర్ణయంతో ఆమరణ నిరాహారదీక్షకు బయలుదేరిన కేసీఆర్ను అలుగునూరు వద్ద అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో భగ్గుమన్న తెలంగాణ ఉద్యమంతో అట్టుడికింది. ఈ క్రమంలో శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో తనను తాను కాల్చుకొని తొలి అమరుడయ్యాడు. సత్వరమే కేంద్రం తెలంగాణ ప్రకటన చేయాలనే డిమాండ్తో యువకులు అత్మబలిదానాలకు పాల్పడ్డారు. ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్ ఆరోగ్యం క్షణక్షణానికి క్షీణిస్తూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని గమనించిన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనను జీర్ణించుకోలేని తెలంగాణ వ్యతిరేకులు మరో కుట్రకు తెర లేపారు. నకిలీ ఉద్యమాలు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచి తెలంగాణపై యూటర్న్ తీసుకునేలా చేశారు. ఈ దుర్మార్గపు చర్యలతో తెలంగాణ ఉద్యమం మరో మారు తీవ్ర రూపం దాల్చింది. కేంద్రం ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి శ్రీకృష్ణకమిటీని నియమించి కాలయాపన చేసే కుట్ర చేసింది.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత కూడా కేంద్రం నిర్లిప్త వైఖరి ప్రదర్శించడంతో కేసీఆర్, ఇతర ఉద్యమ నాయకుల పిలుపుతో యావత్ తెలంగాణ జాతి ఏకమైంది. సంవత్సరాల తరబడి నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగాయి.

ఏక కాలంలో ఒక నిరసన దీక్షలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు భాగస్వామ్యం కావడం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో అపురూప ఘట్టం. మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, వంటా వార్పు, రాస్తారోకోలు, రైల్ రోకోలు, బతుకమ్మ, బోనాలు, ఆటపాటలు, ధూంధాం, జాతీయ రహదారుల దిగ్బంధం, సకల జనుల సమ్మె వంటి నిరంతర ఆందోళనలతో పల్లెలు, పట్టణాలు అట్టుడికాయి. వ్యక్తిగత లాభనష్టాలను పట్టించుకోకుండా తెలంగాణ సాధనే పరమార్థంగా యావత్ తెలంగాణ జాతి చైతన్యాన్ని ప్రదర్శించింది. ఉద్యమ తీవ్రతతో దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో మార్గం లేదని భావించిన కేంద్రం 2014లో పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టింది. చివరగా పార్లమెంటులో అతి హేయమైన పెప్పర్ స్ప్రే వంటి వెకిలి చేష్టలతో ఆ బిల్లును అడ్డుకునే కుట్రలు కూడా జరిగాయి. అటు ఢిల్లీ పాలకులు, ఇటు తెలంగాణ వ్యతిరేకులు ఎన్నెన్నో కుట్రలు పన్నినా వాటన్నింటినీ కేసీఆర్ వజ్ర సంకల్పంతో, త్యాగాల ఆయుధంతో, వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యంతో తుత్తునియలు చేసి, పట్టు వదలని విక్రమార్కుడై జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.

ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికి తెలంగాణను శిల్పంగా చెక్కింది మన కేసీఆర్. ప్రజలందరినీ సమైక్యపరచి ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిన నిజమైన ప్రజాఉద్యమ నాయకుడు ఆయన. యూపీఏ ప్రభుత్వం సజావుగా సాగడానికి నౌకాయాన పోర్ట్ ఫోలియోను తృణప్రాయంగా వదిలిపెట్టడంతో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేసీఆర్ ను  రాజకీయాల్లో కర్మయోగిగా అభివర్ణించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల కేసీఆర్ కనబర్చిన నిబద్దత, అకుంఠిత దీక్షా దక్షతలను ప్రశంసించారు. తెలంగాణ గత ఉద్యమాలు ఆవేశపూరితం. అందువల్ల ఫలితం సాధించలేక పోయాయి! కేసీఆర్

నాయకత్వంలో సాగిన ఉద్యమం శాంతియుతం, ఆలోచనాభరితం, వ్యూహాత్మకం, జన ప్రభంజనం. ఫలితంగా విజయం సాధించాయి.

Friday, September 29, 2023

నమస్తే తెలంగాణ NEWS PAPER 30 సెప్టెంబర్ 2023

SUNDARA CHAITANYANANDA - QUOTES & PPHOTOS - posted in blog link given in...

భక్తులకు, ఆత్మబంధువులకు తెలియజేయునది భజనల లింక్ ఇస్తున్నాము మీకు కావలసిన భజనలను view/download చేసికొనండి 
JAI GIRIDHARI : 
chaitanya bhagavadgita 

#నమస్తే_తెలంగాణ#పాలకుల_కుట్రలపై_త్యాగాల_విజయం#సిరికొండ_మధుసూదనాచారి

భక్తులకు, ఆత్మబంధువులకు తెలియజేయునది భజనల లింక్ ఇస్తున్నాము మీకు కావలసిన భజనలను view/download చేసికొనండి 
JAI GIRIDHARI : 
chaitanya bhagavadgita 

Thursday, September 28, 2023

నమస్తే తెలంగాణ NEWS PAPER 29 సెప్టెంబర్ 2023

#తిగుళ్ల_కృష్ణమూర్తి#నమస్తే_తెలంగాణ#ఆరు_నూరైనా_అదే_ఖరారు#LyricalAudioVideo

నమస్తే తెలంగాణ: 'ఆరు' నూరైనా అదే ఖరారు...తిగుళ్ల కృష్ణమూర్తి #VIDEO

నమస్తే తెలంగాణ
'ఆరు' నూరైనా అదే ఖరారు...తిగుళ్ల కృష్ణమూర్తి
అది రాజకీయ యుగం. ఎన్నికల సీజన్. అధికార సౌధాన్ని చేర్చే
దారి. దానిపక్కన ఒక పులి కూర్చొని ఉంది. ముసలిది! ఒళ్లు డస్సి
పోయి, సత్తువ సడలిపోయి, పళ్లు ఊగిపోయి, గోళ్లు ఊసిపోయి,
కళ్లు మాడిపోయి, వేటాడే చేవ చచ్చినా ఆ పులిలో డాబుకు తక్కువ
లేదు. ఆ పులి చేతిలో ఆరు బంగారు కంకణాలున్నాయి. ఆ దారి
పక్కనే దండిగ నీళ్లతో నిండైన చెరువు. ఆ చెరువులో స్నానం చేసేం
దుకు ఒక బాటసారి వచ్చిండు. పులిని చూసి బెదిరిపోయిండు.
అంతలో పులి అత్యంత వినయంతో, 'ఓయీ, బాటసారీ.
దయచేసి నన్ను చూసి భయపడవద్దు. నేను నిన్నేమీ చేయను'
అన్నది. దీంతో ఆ బాటసారి బెరుకు బెరుగానే ఆగిండు. అతడికి
ఇంకా భయం పోలేదని గ్రహించిన పులి... 'ఇదిగో, నీలాంటి
అమాయకుడైన పుణ్యాత్ముడి కోసమే నేను ఇన్నాళ్లుగా
ఎదురుచూస్తున్న. రా.. ఈ బంగారు కంకణం తీసుకో.
నీ దరిద్రాన్ని పోగొట్టుకో! అయితే...' పులి నమ్మబలికింది.
బాటసారికి విషయం అర్థమైంది. ఎందుకంటే అతడు అప్పటికి 70 ఏండ్ల నుంచీ పంచతంత్రంలో 'పులి- పేరాశ బాటసారి' కథ చదు
వుతూనే ఉన్నడు! 'సరే నువ్వన్నట్టే చేస్తాలే!” అంటూ అతడు చెరువులో స్నానానికి దిగిండు. అది కాళేశ్వర జలంతో నింపిన చెరువు.
అందులో దిగగానే ఆ బాటసారికి ఆ పులి 60 ఏండ్లుగా చేసిన పాపాలన్నీ సినిమా రీల్ తిరిగినట్టుగా కండ్లముందు తిరిగినయి. తాను
పడ్డ కష్టాలన్నీ కనిపించి కన్నీళ్లు కారినయి. తమ జాతి పెద్ద చెప్పిన మాటలన్నీ స్ఫురణకు వచ్చినయి. కాళేశ్వర జల ప్రభావంతో ఆ బాట
సారి శరీరంలోకి అమితమైన శక్తి ప్రసారమైంది. చెరువు నుంచి బయటికి వచ్చిన బాటసారి, నిబ్బరంగా పులి దగ్గరికి చేరుకున్నడు.
చూపుడు వేలితో, కుడిచేతి ఒక్క చూపుడు వేలితో పులి గుండెల్లో గుచ్చిండు. ఆ దెబ్బతో పులి మళ్లీ లేవ లేకుండా చచ్చి ఊరుకుంది.
‘ఆ.. అయితే?” అనుమానంగా ప్రశ్నించిండు బాటసారి.
'నేను బాగా వయసులో ఉన్నప్పుడు మనుషులను చంపి తిని
బోలెడంత పాపం మూటగట్టుకున్న. ఆ చెరువులో స్నానం చేసి
వచ్చిన బాటసారికి ఆరు బంగారు కంకణాలు దానం చేసుకుంటే,
మా 60 తరాల పాపాలు పోతాయని ఒక మునీశ్వరుడు నాకు
చెప్పిండు. అందుకే నీలాంటి మంచివాడు ఎప్పుడు వస్తడా ?
అని చూస్తున్న' అన్నది పులి!
చూపుడు వేలుపై అంటిన పులి రక్తం, అచ్చం ఎన్నికల రోజు పోలింగ్
కేంద్రంలో పెట్టిన సిరా చుక్కలాగే ఉన్నది!
'పంచతంత్రంలో పులి చూపిన బంగారు కంకణాలకు ఆశపడి, చెరువు
ఊబిలో దిగి, ప్రాణాలు పోగొట్టుకున్న పేరాశ బాటసారిని అనుకుంది
పిచ్చి పులి నన్ను. కాలం మారిన సంగతి దానికి తెల్వదు పాపం! తనలో
తానే అనుకుంటూ ప్రగతి భవిష్యత్తులోకి సాగిపోయిండు బాటసారి!
రైతులు, పారిశ్రామికులు, కార్మికులు, కూలీలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు భుజం భుజం కలిపి,కష్టపడి అభివృద్ధి చేసుకుంటున్న తెలంగాణను అర్రాస్ పాటకు పెట్టాలన్నది ఆలోచన. అట్లనే ఉన్నది కాంగ్రెస్!అయినా 80 ఏండ్లలో పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ముల్కీ నిబంధనలను, ఆరు సూత్రాల పథకాన్ని, గిర్ గ్లానీ నివేదికను, తెలంగాణ అభివృద్ధి బోర్డును, ఉప ముఖ్యమంత్రి పదవిని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను, ప్రజల బలిదానాలను...
దేన్నీ గౌరవించని పార్టీ.. ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు కట్టుబడి ఉంటుందంటే నమ్మొచ్చా?

రైతులు, పారిశ్రామికులు, కార్మికులు, కూలీలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు భుజం భుజం కలిపికష్టపడి అభివృద్ధి చేసుకుంటున్న తెలంగాణను అర్రాస్ పాటకు పెట్టాలన్నది ఆలోచన. అట్లనే ఉన్నది కాంగ్రెస్!

అయినా 80 ఏండ్లలో పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ముల్కీ నిబంధనలను, ఆరు సూత్రాల పథకాన్ని, గిర్ గ్లానీ నివేదికను, తెలంగాణ అభివృద్ధి బోర్డును, ఉప ముఖ్యమంత్రి పదవిని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను, ప్రజల బలిదానాలను...దేన్నీ గౌరవించని పార్టీ.. ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు కట్టుబడి ఉంటుందంటే నమ్మొచ్చా?

 ప్రతి జీవికీ జాతి లక్షణాలు కొన్ని ఉంటాయి. వద్దనుకున్నా 'అవి పోవు. తెచ్చుకుందామనుకున్నా కొత్తవి అబ్బవు.కొన్నిసార్లు నక్క పులిచారలు పెట్టుకోవచ్చు. కుడితి గోలెంలో పడ్డప్పుడో, తోటి జంబూకాలు ఊలపెట్టి ఊగినప్పుడో, అసలు రంగు బయటపడొచ్చు, అధికారమనే ఆకలితో నకనకలాడితే, క్రూరమైన ఫులే కొన్నిసార్లు నక్క వేషము వేయవచ్చు. నయవంచక సాధుత్వమూ నటించవచ్చు. పంచతంత్రంలోనే ఇలాంటివి జరిగినప్పుడు ఇక రాజకీయ ప్ర పంచతంత్రం గురించి చెప్పాల్నా! క్రూరమైన పులి ఆరు బంగారు కంకణాల కథ వింటుంటే తెలంగాణ కాంగ్రెస్ గ్యారెంటీల కథ గుర్తుకు వస్తున్నదా!? అయితే ఆ తప్పు నాది కాదు. అది చరిత్రది. ఎందుకంటే ఆరు అంకెకు, కాంగ్రెస్కు ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది! ఆరు అనగానే ఆరు సూత్రాల పథకం గుర్తుకు వచ్చిందా? హతవిధీ! నన్నేమి చేయమందురు! అది చరిత్ర పొల్లుపోకుండా. రాసిన వారి పాపం! తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటం కోసం వచ్చిన ముల్కీ రూల్స్ను మూలకు పెట్టడానికి 1973లో కాంగ్రెస్ ఆరు సూత్రాలనే కదా ప్రయోగించింది. తెలంగాణ వాడు తెలంగాణ వాడు కాకుండాపోవడానికి, ఈ ప్రాంతవాసి పరాయిగా మారి, స్థానిక హక్కులు కోల్పోవడానికి కారణం కాంగ్రెసే కదా! వద్దు వద్దని మొత్తుకుంటున్నా వినకుండా, ఆరు దశాబ్దాల కిందట తెలంగాణను ఆంధ్రాతో కలిపి, దాదాపు ఆరు పదుల ఏండ్లు ఉమ్మడి పాలన పేరుతో అరిగోస పెట్టి, ఆరేడు పదవుల కోసం వలస నేతలకు ఊడిగం చేసి, ఆరున్నొక్క రాగం తీసిన కాంగ్రెస్, ఇప్పుడు సరిగ్గా ఆరంకెనే ఎంచుకొని, హామీల ఆశజూపి ప్రజల ముందుకురావడం కాకతాళీయమే కాదు; చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదానికి సంకేతం. కాంగ్రెస్ మొదట ఐదు హామీలే ఇద్దామనుకున్నదట. చివరాఖరి క్షణంలో ఆరో హామీని జత చేశారట! అదేమిటోగానీ కాంగ్రెస్ కు ప్రజల్ని మోసం చేయాలనుకున్నప్పుడల్లా అరంకే గుర్తుకు వస్తుంది ఎందుకో! 'ఆరు హామీలు అమలుచేస్తం. కాంగ్రెస్ పెద్ద మనుషులుగా మేం మీకు గ్యారెంటీ ఇస్తున్నం' అని పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు సంతకాలు పెట్టి ఇంటింటికీ లేఖలు పంపుతారట! 'పెద్ద మనుషులు' అన్న పదం వినగానే, ఆరు దశానాటి మరో దురాగతం గుర్తుకువచ్చిందా? రాక తప్పదు.1956లో ఇలాంటి ఆరుగురు 'పెద్ద మనుషులు' కలిసే కదా, సుసంపన్న తెలంగాణ నుదుటిపై నల్ల రాత రాసి, చీకటి సంతకంచేసి, పరాధీనం చేసింది! ప్రజల నుంచి ఏ అధికారమూ పొందకుండా, ప్రజల నుంచి ఏ ఆమోదమూ అడగకుండా, తెలంగాణలో ప్రజలంటూ కొందరున్నారన్న సోయే లేకుండా, తెలంగాణ అంటే మనుషులు కాదు; మట్టి అన్నట్టు, అదేదో కాంగ్రెస్ సొంత సొత్తయినట్టు, ఆరేడుగురు కాంగ్రెస్ నేతల జాగీరైనట్టు, 'పెద్దమనుషులు' ఆంధ్రాకు రాసివ్వలేదా! కాంగ్రెస్ కొట్టిన ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి తెలంగాణకు ఆరు దశాబ్దాలు పట్టింది. సాయుధ పోరాటంలో, తొలి, మలిదశ ఉద్యమాల్లో, నక్సల్బరీ ఉద్యమంలో కలిపితే ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ బిడ్డలు ఎందరు? 6 వందలా? 6 వేలా? ఎవరు లెక్కతేల్చాలి! పాపం ఎవరిది? తెలంగాణను కాంగ్రెస్ పరాస్త్రం చేయడం వల్ల 80 ఏండ్లలో ఈ ప్రాంతానికి కలిగిన నష్టం 6 లక్షల కోట్లా? 60 లక్షల కోట్లా? అటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఆరు గ్యారెంటీలంటూ ముందుకు వస్తున్నది. ఎందుకో ఆ పథకాల పేర్లు వింటే భవిష్యత్తు మీద భయమే కాదు: గతం గుర్తుకువచ్చి ఒళ్లు జలదరిస్తున్నది.

1. 'మహాలక్ష్మి' పథకం గురించి తర్వాత చూద్దాం. ఏ 'మహాతల్లి' వల్ల తెలంగాణ ప్రజలు, ప్రాణాలు బలిపెట్టి గెలిపించుకున్న ప్రజా సమితి కాంగ్రెస్లో కలిసిపోయిందో మనకు తెల్వదా?

2. రైతు భరోసా ఎట్లుంటదో తర్వాత చూద్దాం! ఈ కాంగ్రెస్ వల్లకాదా.. మన గోదావరి, కృష్ణా నీళ్లు పక్క రాష్ట్రానికి తరలిపోయి, మన రైతు భరోసా కోల్పోయి 'బోరు బోరున ఏడ్వాల్సి వచ్చింది!

3. యువ వికాసం ఎట్ల చేస్తరో తర్వాత చూద్దాం. ఈ కాంగ్రెస్ వల్ల కదా... మన స్థానికత మాయమై, మన ఉద్యోగాలు అన్యాయమై, తెలంగాణ వల్లకాడై, అటు పోలీసులుగా, ఇటు నక్సలైట్లుగా వేలాది యువకులు విగతజీవులుగా మారిపోయింది!

4. ఇందిరమ్మ ఇండ్లు లేచినప్పుడు చూద్దాం. ఈ కాంగ్రెస్ వల్లకదా.. తెలంగాణ పల్లె ఛిద్రమై, బతుకు శిథిల జీవనచిత్రమై, లక్షలాది మంది గూడు లేక గోడుగోడున ముంబాయి, దుబాయి, బొగ్గుబాయిలకు వలసపోయింది!

5. గృహజ్యోతి నింపే వెలుగులు తర్వాత చూద్దాం. ఈ కాంగ్రెస్ వల్ల కదా.. అపారమైన బొగ్గు నిల్వలు, రెండు జీవనదులున్న తెలంగాణ రెండు గంటల కరెంటుకు కూడా కటకటలాడి కన్నీళ్లు కార్చింది!

6. చేయూత ఎంత అందుతుందో తర్వాత చూద్దాం. ఈ కాంగ్రెస్ 'చెయ్యి' కదా... తెలంగాణ ప్రజల నెత్తిన భస్మాసుర హస్తమై 60 ఏండ్ల పాటు తెలంగాణను, 6 తరాల పాటు తెలంగాణ ప్రజల భవిష్యత్తును భస్మం చేసింది! ఆరు హామీలంటూ అందంగా చెప్పంగనే అన్నీ మర్చిపోతమా? మర్చిపోగలమా?

స్వతంత్ర దేశంగా పరిఢవిల్లిన తెలంగాణ మూడు ముక్కలై, మూడు చోట్లకు మారి, సర్వనాశనం కావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ కదా! తర్వాత స్వరాష్ట్రంగా వెలిగిన తెలంగాణ స్వయం ప్రతిపత్తి కోల్పోవడానికి కారకులెవరు? కాంగ్రెస్ కదా! ఎప్పటికప్పుడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న హక్కులను దొంగలకు సద్ది కట్టిందెవరు? కాంగ్రెస్ కదా! నా తెలంగాణ గడ్డ మీదే నన్ను పరాయివాడిని చేసిన పాపి ఎవరు?  కాంగ్రెస్ కదా! దొంగతనం చేసినవాడే బంగారాన్ని తెచ్చిర్చి 'నేను పత్తిత్తును, నిజాయతీపరుడిని, నన్ను నమ్మి మరొక్క చాన్స్ ఇవ్వండి' అన్నాడంటే, అది ఇంకెంత ఎత్తుకుపోయేందుకు వేసిన ఎత్తుగడ మాత్రమే!.

1956లో విలీనం నాటికి తెలంగాణ ఎంత బాగుండె? 2014లో కేసీఆర్ యూపీఏ ప్రభుత్వం నుంచి తెలంగాణ గుంజుకోచ్చిన్నాటికి తెలంగాణ ఎంతటి కష్టంలో ఉన్నది? మరి ఈ ఆరు దశాబ్దాల అన్యాయానికి, జీవన విధ్వంసానికి, బలైన బతుకులకు, కార్చిన కర్మీళ్లకు, గుండె గుండే భరించిన పరితాపానికి పరిహారం ఎవరు కట్టిస్తారు.. కాంగ్రెస్సా?! 80 ఏండ్ల పాపాలకు, బలి తీసుకున్న బతుకులకు ఆ పార్టీకి ఎన్నేండ్లు శిక్ష వేస్తే మాత్రం తీరుతుంది? ఆరు గ్యారెంటీల సంగతి తర్వాత. ముందు పాత వారెంటీ గురించి చెప్పండి! నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు, ఆరుదశాబ్దాల పాపాలను అరకే పేపర్ లో అందంగా చుట్టి, మంది పేర్లుపెట్టి, మాయమాటల మసాలాలద్ది, ఇంటింటికీ పంచి అబ్రకదబ్ర ఆంటే మోసపోయేది కాదు నేటి తెలంగాణ! ఇది కేసీఆర్ తెలంగాణ!! కొందర్ని కొన్నిసార్లే మోసం చేయవచ్చు. అందర్నీ అన్నిసార్లూ చేయలేం. ఇది కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాల్సిన సత్యం, పదేండ్ల కేసీఆర్ పాలన ఫలితం... తెలంగాణ ఇప్పుడు బంగారు కొండ! ఆ కొండకు ఎంటిక వేద్దాం. వస్తే కొండ వస్తది. పోతే ఎంటిక పోతది. ఇదీ కాంగ్రెస్ లెక్క. ఇచ్చే దుందా? చచ్చేదుందా? ముందు గెలవడం ముఖ్యం అన్నది దాని పాలసీ. 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి గ్యారెంటీలు ఇచ్చిన చరిత్రలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఇటువంటి గ్యారెంటీలు అమలుచేస్తున్న రికార్డు లేదు. రేపు తెలంగాణలో గ్యారెంటీలు అమలు చేయకపోతే ఏంటన్న కట్టుబాటూ లేదు ! ఆరు దశాబ్దాలుగా, పేద్ద 'పెద్ద మనుషులు' పంచెలు సవరించుకుంటూ పెట్టిన సంతకాలకే దిక్కులేకుండాపోయింది. ఇక రేవంతులూ, విక్రమార్కలు ఒక లెక్కా! రాష్ట్ర బడ్జెట్ మొత్తం కన్నా ఎక్కువ విలువైన హామీలు ఇచ్చారంటేనే, కాంగ్రెస్ చిత్తశుద్ది ఎంతో అర్థమవుతుంది. 'నా ము... కాకుంటే గోల్కొండ దాక దేకు' అని తెలంగాణలో ఒక ముతక సామెత ఉన్నది.

ప్రతి జీవికీ ఒక జాతి లక్షణం ఉన్నట్టే, ప్రతి పార్టీకి ఒక స్వభావం ఉంటుంది. కాంగ్రెస్ కున్న జాతి లక్షణం మాట తప్పడం. తెలంగాణ విషయంలో ఎన్నిసార్లు మాట తప్పి, నాలుక మడతపెట్టిందో మనం చూడలేదా! అంతెందుకు.. మూడు నెలల కిందట కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయక, చేయలేక రోజుకో మాట మాట్లాడుతున్న చిత్రం కనిపించడం లేదా! దాదాపు 6 దశాబ్దాలు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించి కూడా మన కోసం ఆలోచించని కాంగ్రెస్, ఇప్పుడు ఆరు గ్యారెంటీలని ఒక పిచ్చికాగితం చూపిస్తే నమ్మాలా? మొన్నటి నిజామాబాద్ ఎన్నికల్లో ఒకాయన పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసివ్వలేదా? ఏమైంది? అయినా మాట మీద నిలకడ ఉంటే పత్రంతో పనేముంది? పార్టీ సక్కనిదైతే గ్యారెంటీల అవసరమేముంది? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తేనైనా నాలుగు సీట్లు వస్తాయనుకొని, తప్పని పరిస్థితిలో ఒప్పుకుంది కాంగ్రెస్, ఇప్పుడేమో తెలంగాణను గెలిస్తే దేశవ్యాప్తంగా ఊపు వస్తుందని గ్యారెంబీల ఎర వేస్తున్నది. దాని ప్రేమంతా కేంద్రంలో అధికారం మీదే తెలంగాణ మీద కాదు, తెలంగాణ ప్రజల మీద అంతకంటే కాదు! 24 గంటల కరెంటుతో, పచ్చని చేలతో, ఆకాశహర్మ్యాలతో, ఆగకుండా ఆడుతున్న కార్ఖానాలతో, కోట్లు పలుకుతున్న భూములతో మిలమిలలాడుతున్న తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్కు బంగారు బాతులా కనిపిస్తున్నది. జలయజ్ఞం కాలం నాటి 'మూటలు' గుర్తుకొచ్చి, కండ్లు, నోరూరుతున్నయి. అందుకే మాటిమాటికీ వచ్చి ఓటి మాటలు చెప్తున్నరు! ఆరు గ్యారెంటీల ముచ్చట తర్వాత! ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కదా? ఏరి? ఆఖరిదాకా అభ్యర్థులెవరో చెప్పలేని వారు, ఆరు గ్యారెంటీల అమలుకు హామీ ఎట్ల పడ్డారు? బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు? సీఎం ఎవరో తేల్చుకోలేని పార్టీ, పూచీకత్తు ఎట్లు పడ్డది? తేడా వస్తే రేపు ఎవరిని అడిగేది? 

ఉన్న తెలంగాణను ఊడగొట్టిన కాంగ్రెస్ అటువైపు. 13 ఏండ్లు కొట్లాడి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ ఇటువైపు... పదవుల కోసం తెలంగాణను తాకట్టు పెట్టిన కాంగ్రెస్ అటువైపు, తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచగా వదులుకున్న కేసీఆర్ ఇటు వైపు... యాభై ఏండ్ల పాలనలో తెలంగాణను సర్వనాశనం చేసిన కాంగ్రెస్ అటువైపు, పదేండ్ల పాలనతోనే తెలంగాణను తెరిపిన పడేసిన కేసీఆర్ ఇటువైపు... వెన్నెముక హైదరాబాద్ ను, విలువైన భూములు, ఆస్తులను అన్యాక్రాంతం చేసిన కాంగ్రెస్ అటువైపు, మన భాగ్యనగరాన్ని మనకే దక్కించి అభివృద్ధి చేసిన కేసీఆర్ ఇటువైపు... మన జీవనదుల్లో మందికి వాటాలు పంచిన కాంగ్రెస్ అటువైపు, మన గోదావరి, మన కృష్ణా నీళ్లు మనకే దక్కేలా ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ ఇటువైపు... మన జీవితాల్లో కన్నీళ్ల సుడిగుండాలు

సృష్టించిన కాంగ్రెస్ అటువైపు, మన బతుకు నిండేలా భారీ సాగరాలు నిర్మించిన కేసీఆర్ ఇటువైపు... మన బతుకులను గోస గోస పెట్టిన కాంగ్రెస్ అటువైపు, అసహాయులందరికీ ఆసరాగా నిలిచిన కేసీఆర్ ఇటువైపు! చేసిందేమిటో చెప్పుకోలేని కాంగ్రెస్ అటువైపు.. చేసింది చెప్పి ఓట్లడుగుతున్న కేసీఆర్ ఇటువైపు! మరి మనం ఎటువైపు? ఈ ప్రశ్నే అనవసరం. 'ఆరు' నూరైనా కేసీఆర్ గెలుపు ఖాయం. ఎందుకంటే కేసీఆర్ గెలుపు.. బీఆర్ఎస్ గెలుపు మాత్రమే కాదు; అది తెలంగాణ గెలుపు! అయినా ! కేసీఆర్ లక్కీనంబర్. అది కాంగ్రెస్కు అరిష్టం!!!

Tuesday, September 26, 2023

నమస్తే తెలంగాణ NEWS PAPER 27 సెప్టెంబర్ 2023

ఈ బ్లాగ్ లో న్యూస్ పేపర్ size చదువుకొనుటకు ఇబ్బందిగా వున్నది కావున ఈ లింక్ క్లిక్ చేసి clear గా big size readable గా చదువు కొనండి click చేయండి

మరపు రాదు నీ దయ ఓ దయామయా కలయైనా నిజమైనా కలవరమైనా|| MUST WATCH

మరపు రాదు నీ దయ ఓ దయామయా కలయైనా నిజమైనా కలవరమైనా వేదము నీవే నాదము నీవే వేదాతీత జ్ఞానము నీవే పుణ్యము పండగ నీ దరి చేరితి కరుణించగా నీవు ధన్యుడనైతి నా అన్న వారు నా కెవ్వరు లేరు ఉన్నది నీవే నా కున్నది నీవే గుప్పెటి గుండెలో యెలా ఒదిగి నావో కరుణను కురిపించి కడతేర్చినావు నారు పోసావు నీరు పెట్టావు కంటికి రెప్పలా కాచుకున్నావు తేజము తిమిరము అంతర మెరుగక నీకై నిరతము పరితపించాను కలల మూటలన్నీ ఆరిపోయాయి ఆశల దీపాలు ఆరిపోయాయి కనికరించు స్వామీ కదలిపోయే వేళ కలసిపోతాను నీలో కలవరమేలేక

భక్తులకు, ఆత్మబంధువులకు తెలియజేయునది భజనల లింక్ ఇస్తున్నాము మీకు కావలసిన భజనలను view/download చేసికొనండి https://archive.org/details/@sudarshan_reddy330?query=%23swami_sundara_chaitanyananda&sort=-publicdate #chaitanya_vignanam #jai_giridhari #chaitanya_bhagavad_gita_swami_sundara_chaitanyananda #swami_sundara_chaitanyananda#Chaitanya_Bhagavad_Gita #pravachan,#om_sri_gurubyo_namaha, #స్వామి_సుందరచైతన్యానంద_భజనలు,#స్వామి_సుందరచైతన్యానంద_ప్రవచనములు,#స్వామి_సుందరచైతన్యానంద_కీర్తనలు,#స్వామి_సుందరచైతన్యానంద_భక్తిప్రవచనములు,#స్వామి_సుందరచైతన్యానంద_భక్తిగీతాలు,#స్వామి_సుందరచైతన్యానంద_భక్తిసంకీర్తనలు,#చైతన్యవిజ్ఞానం#భారతచైతన్యజ్యోతి,#సుందర_విజ్ఞాన_గ్రంధాలయం,#భక్తి_స్వరాంజలి, #భారత_చైతన్య_జ్యోతి,#Tnews #TnewsLive #TnewsTelugu #chaitanyananda_swamy_songs,#chaitanyananda_swami_speech,#sswamy#sundara_chaitanyananda_bhagavatam, #sundara_chaitanyananda_swamy_songs_mp3 #sundara_chaitanyananda_swami_bhagavad_gita,#sundara_chaitanyananda_swamy_speech_bhagavatam,#sundara_chaitanyananda_ramayanam #sundara_chaitanyananda_pravachanam, #sundara_chaitanyananda_swami_ramayanam #sundara_chaitanya_gnana_yogi_tv #sundara_chaitanyananda_swamy_birthday, #sundara_chaitanyam #sundara_chaitanya_annamayya_kirtanalu, #sundara_chaitanyananda_swami_speech, #sundara_chaitanyananda_swamy_songs,#sundara_chaitanyananda swamy, #sundara_chaitanyananda_swamy_birthday, #sundara_chaitanyam #sundara_chaitanya_annamayya_kirtanalu #swami_sundara_chaitanyananda_latest #swami_sundara_chaitanyananda_ramayanam, #swami_sundara_chaitanyananda_vishnu_sahasranamam' #swami_sundara_chaitanyananda_hanuman_chalisa #swami_sundara_chaitanyananda_jeevana_jyothi, #swami_sundara_chaitanyananda_upadesa_saram, #swami_sundara_chaitanyananda_melukolupu GITAMAKARANDAM https://www.youtube.com/channel/UC3DYg27nM2FSLxGUoFVU1Ag CHAITANYA SWARANJALI https://www.youtube.com/channel/UCbOjdEsM-ydRNPOkK8x3gxg BHARATH CHAITANYA JYOTHI https://www.youtube.com/channel/UChepWHMrkfiHpu-bOPtVN9Q JAI GIRIDHARI : https://www.youtube.com/channel/UCpo1UiGElSogY_CN0Oh4rhg HINDU BHAKTI DEVOTIONAL: https://www.youtube.com/channel/UCBScnPxbLKRf7DDgQ36HDwQ chaitanya bhagavadgita https://www.youtube.com/channel/UCshDcQig7mm8Glgf_RhVHVg https://sundaravignanagrandalayam.blogspot.com/2020/09/bhakti-links-all-links-given-in.html https://hindudevotionalswaranjali.blogspot.com/2020/08/bhakti-links-2.html https://gitamakarandam.blogspot.com/2020/08/bhakti-links-2.html https://chaitanyavignanam.blogspot.com/2022/04/our-blogs-and-youtube-channels.html https://telangana-gundechappudu.blogspot.com/2020/07/bhakti-links.html https://telugudevotionalswaranjali.blogspot.com/2020/12/bhakti-links-2.html https://archive.org/details/@sudarshan_reddy330

#చైతన్య_హృదయామృతం#01of14#02of14#swami_sundara_chaitanyananda||MUST WATCH

#దేశమంటే_మనదే#swami_sundara_chaitanyananda

దేశమంటే మనదేనన్నా జగతిలో యిదియే మిన్న *దేవుడెవరో తెలిపిన భూమి దయా గుణములో నిలిచిన భూమి ప్రేమమార్గము చూపిన భూమి జగతిలో మనదే అగ్రగామి *కండలిచ్చాడు శిబి ఆనాడు కానల కేగాడు రామచంద్రుడు బ్రతుకునే బలియిచ్చాడు బాపు వారి పేరును నీవు నిలుపు *అన్న మొక్కటే చాలదు నీకు కావలసిఉంది యెంతో కలదు మనిషికి కాంతి మనసుకు శాంతి యిచ్చేదే మన దేశసంస్కృతి *మాయలుతెలిసిన మానవమృగాలు మంటగలిపాయి మానవజాతిని వెలవెలపోతున్న జాతికీర్తిని నిలబెటాలి గ్రామ జీవనం *అవనియెంత గట్టిదైనా అంకురమెంత మెత్తనిదైనా పిరికిలిబిగించి రాదాపైకి అదియే స్ఫూర్తి నీమార్గానికి

భక్తులకు, ఆత్మబంధువులకు తెలియజేయునది భజనల లింక్ ఇస్తున్నాము మీకు కావలసిన భజనలను view/download చేసికొనండి https://archive.org/details/@sudarshan_reddy330?query=%23swami_sundara_chaitanyananda&sort=-publicdate #chaitanya_vignanam #jai_giridhari #chaitanya_bhagavad_gita_swami_sundara_chaitanyananda #swami_sundara_chaitanyananda#Chaitanya_Bhagavad_Gita #pravachan,#om_sri_gurubyo_namaha, #స్వామి_సుందరచైతన్యానంద_భజనలు,#స్వామి_సుందరచైతన్యానంద_ప్రవచనములు,#స్వామి_సుందరచైతన్యానంద_కీర్తనలు,#స్వామి_సుందరచైతన్యానంద_భక్తిప్రవచనములు,#స్వామి_సుందరచైతన్యానంద_భక్తిగీతాలు,#స్వామి_సుందరచైతన్యానంద_భక్తిసంకీర్తనలు,#చైతన్యవిజ్ఞానం#భారతచైతన్యజ్యోతి,#సుందర_విజ్ఞాన_గ్రంధాలయం,#భక్తి_స్వరాంజలి, #భారత_చైతన్య_జ్యోతి,#Tnews #TnewsLive #TnewsTelugu #chaitanyananda_swamy_songs,#chaitanyananda_swami_speech,#sswamy#sundara_chaitanyananda_bhagavatam, #sundara_chaitanyananda_swamy_songs_mp3 #sundara_chaitanyananda_swami_bhagavad_gita,#sundara_chaitanyananda_swamy_speech_bhagavatam,#sundara_chaitanyananda_ramayanam #sundara_chaitanyananda_pravachanam, #sundara_chaitanyananda_swami_ramayanam #sundara_chaitanya_gnana_yogi_tv #sundara_chaitanyananda_swamy_birthday, #sundara_chaitanyam #sundara_chaitanya_annamayya_kirtanalu, #sundara_chaitanyananda_swami_speech, #sundara_chaitanyananda_swamy_songs,#sundara_chaitanyananda swamy, #sundara_chaitanyananda_swamy_birthday, #sundara_chaitanyam #sundara_chaitanya_annamayya_kirtanalu #swami_sundara_chaitanyananda_latest #swami_sundara_chaitanyananda_ramayanam, #swami_sundara_chaitanyananda_vishnu_sahasranamam' #swami_sundara_chaitanyananda_hanuman_chalisa #swami_sundara_chaitanyananda_jeevana_jyothi, #swami_sundara_chaitanyananda_upadesa_saram, #swami_sundara_chaitanyananda_melukolupu GITAMAKARANDAM https://www.youtube.com/channel/UC3DYg27nM2FSLxGUoFVU1Ag CHAITANYA SWARANJALI https://www.youtube.com/channel/UCbOjdEsM-ydRNPOkK8x3gxg BHARATH CHAITANYA JYOTHI https://www.youtube.com/channel/UChepWHMrkfiHpu-bOPtVN9Q JAI GIRIDHARI : https://www.youtube.com/channel/UCpo1UiGElSogY_CN0Oh4rhg HINDU BHAKTI DEVOTIONAL: https://www.youtube.com/channel/UCBScnPxbLKRf7DDgQ36HDwQ chaitanya bhagavadgita https://www.youtube.com/channel/UCshDcQig7mm8Glgf_RhVHVg https://sundaravignanagrandalayam.blogspot.com/2020/09/bhakti-links-all-links-given-in.html https://hindudevotionalswaranjali.blogspot.com/2020/08/bhakti-links-2.html https://gitamakarandam.blogspot.com/2020/08/bhakti-links-2.html https://chaitanyavignanam.blogspot.com/2022/04/our-blogs-and-youtube-channels.html https://telangana-gundechappudu.blogspot.com/2020/07/bhakti-links.html https://telugudevotionalswaranjali.blogspot.com/2020/12/bhakti-links-2.html https://archive.org/details/@sudarshan_reddy330

Heart Touching story of friendship.||MUST WATCH

Swecha - Award Winning Indian Short Film|| MUST WATCH