T NEWS TV

Monday, April 24, 2017

దైవప్రార్ధనదైవప్రార్ధన
కరుణామూర్తియగు దేవా ! మా చిత్తము సర్వకాలసర్వావస్థలయందును నీ పాదారవిందములయందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడియుండునట్లు అనుగ్రహింపుము, 
పరమదయానిధీ ! ప్రాతఃకాలమున నిద్రలేచినది మొదలు మరల పరుండు వరుండువరకును మనోవాక్కాయ ములచే మా వలన ఎవరికిని అపకారము కలుగకుండు నట్లును, ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయు లాగునను సదుద్ధిని దయచేయుము. 
సచ్చిదానందమూర్తీ ! నిర్మలాత్మా ! మా యంతఃకరణమునందు ఎన్నడును ఏవిధమైన దుష్టసంకల్పముగాని, విషయ వాసనగాని, అజ్ఞానవృత్తిగాని, జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము ! 
వేదాంతవేద్యా ! అభయస్వరూపా | మా యందు భక్తి, జ్ఞాన, వైరాగ్య బీజము లంకురించి శీఘముగ ప్రవృద్ధము లగునట్లు ఆశీర్వదింపుము ! మరియు ఈ జన్మమునందే కడతేరి నీ సాన్నిధ్యమున కేతెంచుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో సొసంగుము. 
 దేవాI నీవు భక్తవతలుడవు! దీనుల పాలిటి కల్పవృక్షమువు ! నీవు తప్ప మాకింకెవరు దిక్కు? నిన్ను ఆశ్రయించితిమి. అసత్తునుండి సత్తునకు గొనిపామ్ము ! తమస్సు నుండి జ్యోతిలోనికి తీసికొనిపొమ్మ ! మృత్యువునుండి అమృతత్యమును పొందింప జేయుము. ఇదే మా వినతి. అనుగ్రహింపుము. నీ దరి జేర్చుకొనుము. పాహిమాం, పాహిమాం, పాహిమాం, పాహి. 
(ఈ ప్రార్థనను ఎవరు ప్రతిదినము నియమముతప్పక ఉదయము నిద్రలేచునపుడును, రాత్రి పరుండబోవునపడును పఠించుదురో, ఆట్టివారికి జీవితమునందేలాటి దోషములున్ను కలుగకుండుటయేగాక భగవంతునియొక్క అనుగ్రహమునకు వారు పాత్రులుకాగలరు.) (శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందుల వారి గీతామకరందము గ్రంథము నుండి )