గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Wednesday, September 10, 2025

కీలుగుఱ్ఱం సినిమా టైటిల్ సాంగ్ పూర్వాపరాలు

 

కీలుగుఱ్ఱం సినిమా టైటిల్ సాంగ్ పూర్వాపరాలు

మీర్జాపురం రాజా గారి దర్శకత్వంలో వచ్చిన శోభనాచల వారి మహత్తర జానపద చిత్రం కీలుగుఱ్ఱం . ఈ చిత్రం టైటిల్స్ వస్తున్నప్పుడు కృష్ణవేణి గారు పాడిన “శోభనగిరి నిలయా దయామయ” అనే పాట వినబడుతుంది. ఈ పాట పూర్వాపరాల్లోకి వెళితే విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం ఆగిరిపల్లి. అక్కడ శోభనాద్రి మీద కొలువైన స్వామినే శోభనాచల స్వామిగా, శ్రీ లక్ష్మీ వ్యాఘ్ర నృసింహ స్వామిగా కొలుస్తారు. ఈ స్వామి పేరునే శోభనాచల స్టూడియో నెలకొల్పారు. ఈ పాట మధ్యలో “ఆగిరిపల్లి విహార” అని, పాట చివర్లో “సరస శోభనాచల చిత్రసభా సంఘ రక్షణ” అని వినవస్తుంది. ఈ పాట వివరాలు అక్కడ దేవాలయంలోని శిలాఫలకం మీద కానవస్తాయి. 















ఈ సినిమా గురించిన మరింత సమాచారం కొఱకు హిందూ లో వచ్చిన ఒక ఆర్టికల్ ఈ కింది లింకు ద్వారా చూడండి.

1927

1927

1927

1927

1927

1930

1930































No comments:

Post a Comment