ఒక వ్యక్తిపై ఉన్నటువంటి ద్వేషం
నీ కళ్ళను మూసేసింది
వైఖరి నీ చేతనే చితికిపోయింది
పల్లకి ఎక్కాలని
పదవుల కోసం పరువు తీసుకున్నావు!
నీ చేత్తోనే కత్తిరించుకున్నావు
నీ శబ్దం, నీ నినాదం
ఒక వ్యక్తితో ఉన్నప్పుడు
గర్జనగా ఉండేది
ఇప్పుడు చులకన చప్పుళ్లే నీకు మిగిలాయి!
రాజకీయాల బజారులో
నీ ఆత్మను తాకట్టు పెట్టావు
నీ గౌరవం పదవుల కోసం
చిల్లర కాసులకే అమ్ముకున్నావు
మీరు కోల్పోయింది కుర్చీ కాదు
మీరు కోల్పోయింది మీ మనిషితనం!
ప్రజలు ఇక
నిన్ను నాయకుడిగా చూడరు
ప్రతీకారపు ముసుగులో
మీకు మీరే అవమానపు
మోసపూరిత విగ్రహమైపోయారు!
మీ కథ ఇక పాఠం కాదు
బజారులో చెట్టుపై వేలాడుతున్న
చినిగిన పాత బ్యానర్‌లా
నిన్ను చూసి వెళ్ళిపోతారు!
#Kallem_Naveen_Reddy
No comments:
Post a Comment