గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Saturday, June 4, 2022

అస్తిత్వమా.... బానిసత్వమా..... జై తెలంగాణ

 



https://youtu.be/L0Yqw7bkahw

అస్తిత్వమా ..... బానిసత్వమా ....

అనగనగా ఒక ఊరు. అది ఎడారికి మారు పేరు.
చుట్టూ నెర్రెలిచ్చిన నేల. కాలం కలసివచ్చి మొన్ననే
మొగులై చినుకురాలింది అక్కడ. నీరు పారింది. కర్రుకు
పదును పెట్టి రైతన్న నాగలి కట్టిండు. గడ్డి దున్నిండు.
దొడ్డి వేసిండు. చెట్టూ చేమ, కప్పా తుప్పా, పుట్టా పొద
పుట్టినయి. పొలం పచ్చబడ్డది.

పశువును, పాకను చూసిన పొరుగు అడివిలోని పులికి దానిపై కన్నుపడ్డది. దొడ్డిలో జొరబడి, ఎడ్లపైకి దుంకింది. ఎడ్లు కలసికట్టుగా ఎదురు తిరిగినయి. నాలుగు దిక్కులనుంచి నాలుగు తగులుకుని, బొక్కలిరిగేట్టు
తొక్కినయ్. కొమ్ములతో కుమ్మినయి. గిట్టలతో తన్నినయి. పులి ఎత్తు పారలేదు.
సత్తువ చాలలేదు. పారిపోయింది పులి.పొరక గోడ దుంకి వురికురికి తంగేళ్లలో
కలిసిపోయింది. కసితో కుమిలిపోయింది. కోపంతో రగిలిపోయింది.
అర్ధరాత్రి గుట్టల గుహలోకి నక్క బావను, మాంసంవిందుకు పిలిచి, అక్కసంతా వెళ్లగక్కింది. సాయంఅడిగింది. జిత్తుల మారి నక్క బావ సరేనంది. దొంగ
ఏడుపు ఏడుస్తూ దొడ్డిలోకి చేరింది. పగలు పులి దగ్గరతిన్న మాంసం అరగకున్నా, ఆకలంటూ దొడ్డిలో గడ్డితిన్నట్టు నటించింది. రోజుకో అబద్ధం చెప్తూ, దొడ్డిదూలానికి దొంగ దండాలు పెడుతూ, నేనూ ఈ దొడ్డి
బిడ్డనే అంటూ ఎడ్లకు దగ్గరైంది. మన నక్కే కదా అని నమ్మడం మొదలు పెట్టినయి ఎడ్లు. ఒక ఎద్దు .మీద మరొక ఎద్దుకు పితూరీలు చెప్పడం మొదలుపెట్టింది నక్క, సబూతులు, సాక్ష్యాలంటూ ఏవేవో బొమ్మలు
చూపించేది. ఊలలు వినిపించేది. నాలుగు నెలలుగడిచాయో లేదో.. ఎడ్ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత పగ. నాలుగెడ్లు.. నలభై ఆలోచనలు. ఎదురుపడ్డయా.. కాలుదువ్వుడే. కొమ్ములిరుగుడే!
ఇదే అదనుగా పులిని పిలిచింది నక్క!
ముందే తీసి ఉంచిన పనగడలోంచి
దొడ్డిలోకి దూరింది పులి! ఎడ్లు ఏకమై
ఎదిరించకుండా, దేని మానాన అది,
తలోదిక్కుకు చేరి, దిక్కులు చూసినయి!
తర్వాత ఏం జరిగిందో ఇంకా చెప్పాల్నా...!

2000 నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో ఏం
జరిగిందన్నది మన కళ్ల ముందున్నది. 13 ఏండ్ల ఉద్యమం
ఎలా సాగిందో, 8 ఏండ్ల స్వయంపాలన ఎట్లా ఉన్నదో
మనకు, మన మనసుకు తెలుసు. సైకిళ్లకు క్యాన్లు కట్టుకుని
రోజూ మంచినీళ్ల కోసం ఆర్వో కాడికి పోతున్నమా? పొలానికి నీళ్లు పెట్టేందుకు అర్ధరాత్రి బాయికాడికి పోతున్నమా ?అప్పుడు బోరెంత లోతేసినం? ఇప్పుడెంతేస్తున్నం? అప్పుడు కరెంటెట్లుండే?
ఇప్పుడెట్లున్నది? కాళేశ్వరం నీళ్లు కాల్వకొసదాక పారుతున్నయా లేదా?

ముసలవ్వ ఖాతాల ముందెంత పింఛన్ పడ్డది ?ఇప్పుడెంత పడుతున్నది? ఉద్యోగి జీతంఅప్పుడెంతున్నది? ఇప్పుడెంతున్నది?అప్పుడు ఊర్లెట్లుండె? చెట్లెట్లుండె? చెర్లెచెర్ల నీళ్లుండె? చేప కప్పలసవ్వడెట్లుండె? ఇప్పుడెట్లున్నది? ఇట్వంటివన్నీ చూడనోళ్లం కాదు; తెల్వనోళ్లమూ కాదు మనం. కానీ జరిగిన
వాటి గురించి కాదీ చర్చ. మనలోనే ఒకడు బయలెల్లి, జరిగిన వాటిని కూడా జరగలేదని, మన కళ్ల ముందున్నవాటిని లేవని చెప్తుంటే, మనమెట్ల వింటున్నం? ఎందుకువింటున్నం? మనం సచివాలయం కట్టుకుంటే మూఢనమ్మకం. మరి కొత్త పార్లమెంటు ఎందుకు కడుతున్నరు?
సైకిళ్లకు క్యాన్లు కట్టుకుని
రోజూ మంచినీళ్ల కోసం ఆర్వో
కాడికి పోతున్నమా? పొలా
నికి నీళ్లు పెట్టేందుకు అర్ధరాత్రి
బాయికాడికి పోతున్నమా?
అప్పుడు బోరెంత లో చేసినం?
ఇప్పుడెంతేస్తునం?

ఉద్యమ సమయంలో కనిపించినట్టు ఇప్పుడు కుట్రలన్నీ కళ్లముందు తారసపడవు.అది బహిరంగ యుద్ధం. అక్కడ వైరి పక్షాలు పరస్పరం మోహరించి ఉన్నయి. ఇది అంతర్యుద్ధం.ఇక్కడ మనోడే మనతో పోరాడుతుంటడు. కానీ ఆ పోరాటం మనది కాదు. మనకోసం కాదు.
ఎవరి గొంతో ఇక్కడ వినిపిస్తుంది. కానీ ఆ ధ్వని మన ప్రతిధ్వని కాదు.

మనం ఇల్లు కట్టుకుంటే వాస్తుకు కట్టుకుంటమా లేదా ?
తన ప్రజలు, తన ప్రాంతం పది కాలాల పాటు బాగుండాలని, సకల సౌకర్యాలతో సచివాలయం కడితే అది మూఢనమ్మకమా? అబద్దం అందంగ ఉంటదనీ, తొందరగా ఆకర్షిస్తదని మనందరికీ తెలుసు. అందరం ఎప్పుడో ఒక
ప్పుడు ఒకటో అరో అబద్ధాలు చెప్తనే ఉంటం. కానీ..

కాళేశ్వరంతో కొత్తగా ఎకరం కూడా పారలేదంటూ నిండిన చెరువుగట్టు మీద కూర్చుని చెప్తున్నారే... ఆ దుస్సాహసమెట్ల చేస్తున్నారు? దాన్ని
“6 మనమెట్ల సహించి చూస్తున్నాం? అబద్ధాలనువింటూ, వాట్సాప్ లో పంచుతూ, పెంచుతూమనం ఎంజాయ్ చేస్తున్నామే... ఈ నిర్లిప్తత
తెలంగాణకు ప్రమాదకరమైనది.

ఏం జరుగుతున్నదిప్పుడు? ఉద్యమమప్పుడు ఏం జరిగిందో అదే! రాష్ట్రం
కావాలని కొట్లాటకు దిగినప్పుడు కూడా.ఇట్లనే పదేండ్ల పాటు అత్తరబిత్తర చేసి
గత్తర లేపే ప్రయత్నం చేసిండ్రు. ఉన్నదిలేనట్టు, లేనిది ఉన్నట్టు! అయింది
కానట్టు, కానిది అయినట్టు! ఉద్యమమేలేదన్నరు. అన్యాయమే జరగలేదన్నరు.
అర్ధరాత్రి నిర్ణయమన్నరు. పేర్లెందుకుగాని... ఒక్కొక్క విదూషకుడు మహా
నాయకుడై ఒక్కొక్క మాట మాట్లాడిండు.అంతా గడబిడ, గజిబిజి, గందరగోళం! మనమేంచేసినం? ఒక నాయకుణ్ని నమ్ముకున్నం. అతను చెప్పింది.
విన్నం. చెయ్యిమన్నది చేసినం. అతడి మార్గంలో నడిచినం.
ఒక్కటిగ ఉన్నం. కుట్రలను తెగ్గొట్టినం. తెలంగాణ తెచ్చుకున్నం. అభివృద్ధి చేసుకున్నం. చేసుకుంటున్నం. మంచిగబతుకుతున్నం, దేశాన్ని బతికిస్తున్నం. ఉద్యమంలో మనల్నితిట్టినోళ్లంత ఇప్పుడు ఏడికిపోయిన్రో... యాడున్నరో
పాపం!

మనలోనే కొందరినిమంచి చేసుకుని, మన మీదికేపంపుతున్నారు. అందులో
ఒక మతం గురించిమాట్లాడుతడు.మరొకడు కులం గురించిమాట్లాడుతడు.

అయితే ఉద్యమమప్పుడు బరి గిరిగీసి ఉండె. మనోడెవడో, పరోడెవడో తేటగా తెలిసేది. మరిప్పుడేం జరుగుతున్నది? మనలోనే కొందరిని మంచి చేసుకుని,
మనమీదికే పంపుతున్నరు. అందులో ఒకడు మతంగురించి మాట్లాడుతడు. మరొకడు కులంగురించి మాట్లాడుతడు. తెలంగాణకు 'అత్యంత అన్యాయం
చేసిన వాళ్ల నాన్నవారసత్వం బహు గొప్పదని' రోజూ ఏడుస్తది ఒకామె. ప్రభుత్వం పిల్లలకు చేసినకృషిని తన ఘనతగా ప్రచారం చేసుకుంటడు ఇంకొకాయన. తానేం మాట్లాడుతున్నడో తనకే తెల్వని మరో కమేడియన్
కూడా లక్షల కోట్ల మహోపన్యాసాలుఇస్తుంటాడు. తన స్థానమేమిటో

తెలంగాణ ప్రజలు ఒకటికి రెండుసార్లు చెప్పినాతెలుసుకోలేని మేధావి మరొకరు.
సేమ్ టు సేమ్ అదే గడబిడ, గజిబిజి, గందరగోళం.
ఉద్యమమప్పుడు ఉన్నటువంటిదే! పేపర్లు, టీవీలు,ప్యాకేజీలు, కవరేజీలు సరేసరి!
ఎందుకు పెద్దపెద్ద లీడర్లంతా తెలంగాణకు బారులుతీరుతున్నరు? ఏదేదో మాట్లాడుతున్నరు. ఎన్నికలకోసమా? ఇంకా ఏడాదిన్నరదాంక లేవుకదా! అక్కడే
ఉంది అసలు లోగుట్టు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినర్యాంకుల సాక్షిగా ఇవాళ అభివృద్ధిలో, అవార్డుల్లో మనంముందున్నం. ప్రగతి కండ్ల ముందు కనిపిస్తున్నది.
అందువల్ల చర్చ వాటి మీద జరిగితే గెలవలేరు. మరేంచెయ్యాలె? రూటు మార్చాలె. మన మనసు మార్చాలె.చర్చను తప్పుదోవ పట్టించాలె. తెలంగాణ వాళ్లకుకొంచెం ఎమోషన్స్ ఎక్కువ. ఇప్పుడు దాంతో ఆడుకోవాలని, పబ్బం గడుపుకోవాలని చూస్తున్నరు. 'దేశంలోనిమసీదులన్నింటిలో శివ లింగాలు వెతుకుతమా ఏంది?అదేం పని! చరిత్రలో జరిగిందేదో జరిగిపోయింది.
హిందువులకో రెండు మూడు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలున్నాయి. వాటిని పరిష్కరించుకుంటే చాలు' అంటాడుఆరెస్సెస్ చీఫ్. ఇక్కడి బీజేపీ చీఫ్ మాత్రం... 'మసీదులన్నీ తవ్వాలె.. శవాలు దొరికితే మీవి. శివాలు దొరికితే

మావి' అంటాడు. ఎవరు నిజం? మరొకాయనేమో తమ కులమే గొప్పదని తొడగొట్టివాదిస్తాడు. అయినా కులం, మతం లేనిదెవనికి? ఎవని మతం వానిది. ఎవని కులంవానిది. దాంతో తెలంగాణకు, రాజకీయాలకు, ప్రజలకు,పరిపాలనకు ఏం పని!అయినా వాటినే చర్చకు పెడుతున్నారంటే
కారణం... వాటితో అయితేనే వాళ్లకునాలుగు ఓట్లు వస్తాయని!

ఇప్పుడు జరుగుతున్నదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం.
కాంగ్రెస్ జాతీయ నేత తెలంగాణకు వస్తడు.బీజేపీని ఒక్క మాట అనడు. ప్రధానమంత్రి,హోంమంత్రి తెలంగాణకు వస్తరు. కాంగ్రెస్ ను ఒక్క మాట అనరు. బీజేపీ కార్యకర్తఒకరు ఆత్మహత్య చేసుకుంటడు. కాంగ్రెస్నేతలు వెళ్లి పరామర్శిస్తారు. కాంగ్రెస్ నేతఒకడు సందర్భం లేకుండా భాగ్యలక్ష్మి
గుడిని లేవనెత్తుతడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దాన్ని పెద్ద చర్చ చేస్తడు.
నేనూ హిందువునే! ఎన్కట దేశంలముస్లింల పాలన జరిగింది. గుళ్లు కూలగొ
ట్టిన్రు. మసీదులు కట్టిన్రు. అదంతా నిజమే!56 మరిప్పుడేం చేస్తం? బాగుపడే బతుకుతెరువు వెతుక్కుంటమా? కొట్లాటలా?ఈ ప్రశ్న మనకు మనం వేసుకోవాలె.మనకు ఎదురైనోళ్లకూ వేయాలె!

తల్లిని చంపి బిడ్డనుబతికించిన్రు అంటున్న వాళ్లుఅకస్మాత్తుగా అపర తెలంగాణ
ప్రేమికులు అయిపోయిన్రు.ఇంతకూ వాళ్ల అవసరంతెలంగాణ అభివృద్ధా?
లేక అధికారమా?

ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది యాదృచ్ఛికమేమీ కాదు. నా అంచనా నిజమైతే ఇది మూడంచెలవ్యూహం. అనేకమంది ఆడుతున్నట్టు కనిపిస్తున్నా... ఆడిస్తున్నది ఒక్కరే! తెలంగాణ తెర మీద ఇప్పుడు రసవత్తరమైన తోలుబొమ్మలాట సాగుతున్నది. ఒక్కడిని కొట్టడానికి అనేకమంది ఒక్కటై అనేక ఆయుధాలతో అన్నిదిక్కుల చుట్టుముడుతున్నరు. తొలి దశ... అబద్ధాల ఎంట
ర్టెయిన్మెంట్తో జనాన్ని ఎంగేజ్ చేయాలె. కులాన్నిలేపాలె. మతాన్ని మోయాలె. ఉద్వేగాలు రేపాలె. అన్నివర్గాల మధ్య అనైక్యత రెచ్చగొట్టాలె. పదేండ్ల తర్వాత ఏ
ప్రభుత్వం మీద అయినా ఎంతో కొంత ఉండే వ్యతిరేకతను భూతద్దంలో చూపెట్టి, మూడ్ క్రియేట్ చేయాలె.మనవాళ్లు గుంజుకోవాలె. రెండో దశ... తెలంగాణ ప్రజానేతకు ఒక ప్రతిద్వందిని ప్రతిపాదించే ఎత్తుగడ ఇది.
తర్వాత మాన్యుఫాక్చర్డ్ లీడర్స్ అందరూ ఆ ప్రతిద్వంద్వినితిడుతూ ఉంటారు. మన మతం కోసం ఒక్కడు కొట్లాడుతుంటే ఇంతమంది తిడుతున్నారే అని సానుభూతినిక్రియేట్ చేయడం ఇందులో అంతరార్థం. మూడో దశ...
ముఖాముఖి అయితే తప్ప టీఆర్ఎస్ను ఢీకొట్టి ఎన్నోకొన్ని సీట్లు గెలుచుకోలేమనే ఎత్తుగడతో, ఎన్నికల నాటికఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడం. 'నేను బలంగా ఉన్నచోట నువ్వుండకు.. నువ్వు బలంగా ఉన్నచోట నేనుఉండ'. ఇదీ లోగుట్టు! తెలంగాణ ఒక్కటిగా ఉంటే, తెలంగాణకు ఒక్క నాయకుడు ఉంటే గెలువలేమనే ఈకుమ్మక్కు వ్యూహం.ఇందులో భాగమే అర్రలో బంధించినట్టు సెల్ఫోన్లోబంధించి, స్కిట్లు, ఔట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ కట్ చేసినబైట్లు, కామెడీ యాక్టర్లతో జోడించిన బిట్లు, ఫేక్ ఫోటోలు,
నకిలీ వీడియోలు... మన మనస్సును తమ అధీనం చేసుకుని, ఆపరేట్ చేసే మాయా మశ్చీంద్ర సినిమా. మరిమనం దీనిలో పడిపోదామా? కళ్ల ముందు కనిపించేప్రగతా? లేకపోతే దాన్ని కోళ్ల గంప కింద కమ్మే కనికట్టు
ప్రచారమా? తల్లిని చంపి బిడ్డను బతికించిన్రు అంటున్నవాళ్లు అకస్మాత్తుగా అపర తెలంగాణ ప్రేమికులు అయిపోయి, ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపి, అక్కడ కూడా శాపనార్థాలు పెడితే, వాళ్లకు అవసరం తెలంగాణ అభివృద్ధా? లేక అధికారమా? వందల ఏండ్ల చరిత్రను తవ్వుతున్న వాళ్లకు 28 ఏండ్ల క్రితం దాకా తెలంగాణకు తామేం చేసామన్న చరిత్ర ఉండదా? 8 ఏండ్లల్ల మనం ఏం
తక్కువ చేసుకున్నం. మనకు ఏం తక్కువ జరిగింది? మరిమనం నిజ జీవిత సత్యాన్ని ఆస్వాదిద్దామా? అద్దాల అంగడిలో స్వప్నాలను చూద్దామా ?

వందల ఏండ్ల కింద జరిగిన చరిత్రనుతిరగరాసి సరిదిద్దాలంటున్నవాళ్లు,
అందుకోసం ప్రయత్నిస్తున్న వాళ్లు, రేపుతెలంగాణ రాష్ట్ర చరిత్రను కూడా తిరగ
రాసే ప్రయత్నం చేయరనే గ్యారెంటీఏముంది? ఎనిమిదేండ్ల కింద తెలంగాణ
ఏర్పాటు సరిగా జరగలేదని ప్రధాని నుంచికిందిదాకా పదేపదే చెప్తూనే ఉన్నారు కదా! చారిత్రక కట్టడాల ఆధారంగా ఉద్వేగాలురేకెత్తిస్తున్నవాళ్లు, రేపు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ ప్రక్రియను తిరగరాయరనే హామీ ఏమున్నది? దేశమంతా విద్వేషాలు రేకెత్తిస్తున్నవాళ్లు, ఇప్పుడు తెలం
గాణ-ఆంధ్ర ప్రజల మధ్య (లేని) విద్వేషాలు ఉన్నాయని అంటున్నారు. రేపటి
వ్యూహానికి ఇది ఇప్పటి ఎత్తుగడా?

తెలంగాణకు కొన్నాళ్లు కోర్టులు వ్యతిరేకం. కొన్నాళ్లు ఇరుగు పొరుగు వ్యతిరేకం.
కొన్నాళ్లు కేంద్రం వ్యతిరేకం. ఇప్పుడుతెలంగాణను అష్ట దిగ్బంధం చేసే ప్రయ
త్నం. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు సమస్యలు సహజం. సమ
స్యల్లేని సందర్భమే ఉండదు. కానీ సమస్యలకు పరిష్కారం వెతుకుతున్నమా లేదాఅన్నది ప్రశ్న. ఉత్తర బిత్తర పడితే గత్తరలేవడం ఖాయం. చెరువు మీద అలిగి ఏదోచేసినట్టు, మనం గందరగోళంలో పడితేఅస్తిత్వాన్ని కోల్పోతం. అప్పుడు మిగిలేదిబానిసత్వమే. ఉద్యమ సమయంలో కనిపించినట్టు ఇప్పుడు కుట్రలన్నీ కళ్లముందు తారసపడవు.
అది బహిరంగ యుద్ధం. అక్కడ వైరి పక్షాలు పరస్పరంమోహరించి ఉన్నయి. ఇది అంతర్యుద్ధం. ఇక్కడ మనోడేమనతో పోరాడుతుంటడు. కానీ ఆ పోరాటం మనదికాదు. మనకోసం కాదు. ఎవరి గొంతో ఇక్కడ వినిపిస్తుంది. కానీ ఆ ధ్వని మన ప్రతిధ్వని కాదు.
తల్లిని చంపి బిడ్డను బతికించిన్రు అంటున్న వాళ్లుఅకస్మాత్తుగా అపర తెలంగాణ
ప్రేమికులు అయిపోయిన్రు. ఇంతకూ వాళ్ల అవసరంతెలంగాణ అభివృద్ధా?
లేక అధికారమా?

ఇప్పుడు మనముందొక ప్రశ్న నిలబడి ఉన్నది.చర్చ కులం మీద జరగాల్నా? మతం మీదజరగాల్నా? ప్రాంతం మీద జరగాల్నా?ప్రాంతాన్ని తక్కువ చేసి కులాన్ని, మతాన్నిపెంచే ప్రయత్నమొకటి జరుగుతున్నది.
కులం మతం గతం! ప్రాంతం మన భవిష్యత్తు!! మనం గతంలోకి జారిపోవడమా?భవిష్యత్తును దర్శించడమా? వాళ్ల రచ్చలోకి
మనం వెళ్లడమా? మన చర్చలోకి వాళ్లనురప్పించడమా? మనమే తేల్చుకోవాలి.

ఏదో జరిగిపోతున్నది అనే ముందు,ఇదివరకు ఏం జరిగిందో మనం ఆలోచించుకోవాలె.ఎటు పోతున్నం అనుకునే ముందు,
ఎక్కడి నుంచి వచ్చినం అని మనం ఆలోచించుకోవాలె.
తప్పు జరిగిందనే నిర్ధారణకు వచ్చే ముందు,
జరిగిన ఒప్పుల్ని కూడా మనం లెక్క వేసుకోవాలె.
- తిగుళ్ల కృష్ణమూర్తి
kruthi1972@gmail.com

 

 


No comments:

Post a Comment