గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం
Wednesday, July 10, 2024
మేధావులు మేల్కొండి ! మేడిపల్లి వెంకటేశ్వర్ రెడ్డి 96151 46666
మేధావులు మేల్కొండి !
మేడిపల్లి వెంకటేశ్వర్ రెడ్డి
96151 46666
'సిరా చుక్క మౌనం వహిస్తే
సారా చుక్క రాజ్యమేలుతుంది
మేధావులు మౌనం వహిస్తే
మూర్ఖులు రాజ్యమేలుతారు'
తెలంగాణ గడ్డ పోరాటాల అడ్డా.
'ఇక్కడి మట్టికి, గాలికి, నీటికి కూడా
అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉంటుంది.
దుర్మార్గంపై తిరుగుబాటు చేసే స్వభావం
ఉంటుంది. తెలంగాణ సాయుధ రైతాంగ
పోరాటం నుంచి తొలిదశ ప్రత్యేక తెలంగాణ
ఉద్యమం దాకా, సిరిసిల్ల, జగిత్యాల ప్రజా
ఉద్యమాల నుంచి మలిదశ ప్రత్యేక రాష్ట్ర
సాధన దాకా ఇలా ఎన్నెన్నో పోరాటాలను
నడిపిన చరిత్ర ఈ గడ్డకు ఉన్నది.
స్వరాష్ట్రం ఏర్పడ్డాక ప్రొఫెసర్ కోదండరాం
లాంటి కొందరు కుహనా మేధావులు తమ
స్వీయ అభివృద్ధి, స్వప్రయోజనాల కోసం కేసీఆర్ నాయకత్వంలో గత ప్రభుత్వం సాధించిన
విజయాలు, పునర్మిర్మాణంపై విషంచిమ్మారు.
నిశీధిలో ఉషోదయపు వెలుగులను, 2 కోట్ల ఎకరాల తెలంగాణ ఎవుసాన్ని,
చివరి ఆయకట్టుకు నీరందించిన నీటి వనరు
లను, కొండకోనలకు చేరిన భగీరథ నీళ్లను,
పారిశ్రామిక ప్రగతిని తక్కువ చేసి చూపించే
ప్రయత్నం చేశారు. అంతేకాదు, 'కేసీఆర్ ఆన
వాళ్లను చెరిపేస్తాం, విధ్వంసం సృష్టిస్తాం'
అంటున్న పదవి కాంక్ష తప్ప తెలంగాణ
ప్రయోజనాలే పట్టని పాలకులతోనూ చేతులు
కలిపారు. స్వప్రయోజనాల కోసం తెలంగాణ
ప్రయోజనాలను పణంగా పెడుతున్న
ఇలాంటి వారి గురించి ప్రజలు
తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల
మౌనం వల్లనే సమాజానికి ఎక్కువ నష్టం
జరుగుతుంది. మేధావుల ముసుగులో
కొందరు గత ప్రభుత్వంపై అసత్యాలను, అర్ధ
సత్యాలను ప్రచారం చేసి ప్రజల మనసులను
కలుషితం చేశారు. తత్ఫలితంగానే రాష్ట్రంలో
ఇప్పుడు విధ్వంస పాలన సాగుతున్నది.
ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు దాటినా ఏ
ఒక్క హామీ నెరవేరలేదు. పైగా రాష్ట్రంలో
శాంతిభద్రతలు లోపించాయి. ఒక్క కొత్త
పథకాన్ని కూడా అమలుచేయని కాంగ్రెస్లను,
2 కోట్ల ఎకరాల తెలంగాణ ఎవుసాన్ని,
చివరి ఆయకట్టుకు నీరందించిన నీటి వనరు
లను, కొండకోనలకు చేరిన భగీరథ నీళ్లను,
పారిశ్రామిక ప్రగతిని తక్కువ చేసి చూపించే
ప్రయత్నం చేశారు. అంతేకాదు, 'కేసీఆర్ ఆన
వాళ్లను చెరిపేస్తాం, విధ్వంసం సృష్టిస్తాం'
అంటున్న పదవి కాంక్ష తప్ప తెలంగాణ
ప్రయోజనాలే పట్టని పాలకులతోనూ చేతులు
కలిపారు. స్వప్రయోజనాల కోసం తెలంగాణ
ప్రయోజనాలను పణంగా పెడుతున్న
ఇలాంటి వారి గురించి ప్రజలు
తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల
మౌనం వల్లనే సమాజానికి ఎక్కువ నష్టం
జరుగుతుంది. మేధావుల ముసుగులో
కొందరు గత ప్రభుత్వంపై అసత్యాలను, అర్ధ
సత్యాలను ప్రచారం చేసి ప్రజల మనసులను
కలుషితం చేశారు. తత్ఫలితంగానే రాష్ట్రంలో
ఇప్పుడు విధ్వంస పాలన సాగుతున్నది.
ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు దాటినా ఏ
ఒక్క హామీ నెరవేరలేదు. పైగా రాష్ట్రంలో
శాంతిభద్రతలు లోపించాయి. ఒక్క కొత్త
పథకాన్ని కూడా అమలుచేయని కాంగ్రెస్
పాలకులు తమ విలాసాల కోసం రూ.30
వేల కోట్లకు పైగా అప్పు చేశారు.
తప్పులను ప్రశ్నించాల్సిన కొందరు మీ
డియా ప్రతినిధులు పాలకులతో కుమ్మక్కై
అవాస్తవాలను, అర్ధ సత్యాలను వల్లె వేస్తు
న్నారు. తెలంగాణపై వారికున్న కక్షకు వారు
రాస్తున్న కథనాలే నిదర్శనం. సిరా చుక్క విలు
వలకు తిలోదకాలిచ్చిన అలాంటివారిని ఉద్య
మ స్ఫూర్తితో ఉతికి ఆరవేయాలి. ఈ కుహనా
పత్రికలు, నాయకులను ప్రశ్నించి, తెలంగాణ
విధ్వంసాన్ని ఆపాల్సింది మేధావులే. లేదంటే
తెలంగాణలో మరోసారి చీకట్లు అలుముకోవడం
ఖాయం. పాలన గాడి తప్పినప్పుడు
నిస్సంకోచంగా వేలెత్తి చూపించాల్సిన
బాధ్యత మేధావి వర్గానిదే. ఉదాసీనతతోనో,
పదవుల ఆశతోనో మేధావులు మౌనం వహిస్తే
తెలంగాణ సమాజం వారిని క్షమించదు.
'మార్గం తెలిసిన వాడు మేధావి
చూపించినవాడు నాయకుడు
దాటినవాడు సమర్థుడు
కానీ, మార్గం తెలిసి చూపించక
దాటనివాడు అసమర్థుడు'
పాలకులు చేసే తప్పులను ప్రశ్నించే దాశ
రథి, కాళోజీ, జయశంకర్ సార్ తదితరులు
వారసులు తెలంగాణలో లేరా? మేధావు
లారా ఇప్పటికైనా మేల్కొనండి. ప్రాణాలకు
తెగించి సాధించుకొని, పునర్నిర్మాణం చేసు
కున్న తెలంగాణను మళ్లీ చీకటిపాలు చేయా
లనే కుట్రలు జరుగుతున్నాయి. పదవుల
కోసం పాకులాడుతూ మీ ధర్మాన్ని విస్మరించ
కండి. ఇప్పటికైనా తెలంగాణ మట్టికి, గాలికి
నీటికి ఉన్న ప్రత్యేకతను కాపాడండి. పోరా
టాల వారసత్వాన్ని కొనసాగించండి.
జై తెలంగాణ!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment