ఉందిలే మంచికాలం ముందు ముందునా

Friday, January 27, 2023

NEWS CLIP NAMASTHE TELANGANA 28 JAN 2023

దేశంలో ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది

సంచలనం : దేశంలో ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది January 27, 2023జాతీయం, రాజకీయం దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చ. ఆ ఎమర్జెన్సీని ఇందిరా గాంధీ విధించింది. అయితే… ప్రధాని మోడీ పాలనలో అంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు న్యాయవాది, హక్కుల ఉద్యమకారుడు ప్రశాంత్‌ భూషణ్‌. “ది లీఫ్ లెట్” అనే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ భూషన్… కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టారు. బీజేపీ, మోడీ హయాంలో దేశ పౌరుల ప్రాథమిక హక్కులతో పాటు.. రాజ్యాంగబద్ధ సంస్థలైన ఈసీ, గవర్నర్ లాంటి వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. “ది లీఫ్ లెట్” ఇంటర్వ్యూ ఈ విధంగా మాట్లాడారు ప్రశాంత్ భూషన్… “గణతంత్ర భారత్‌లో గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. సెక్యులర్‌ రిపబ్లిక్‌ అనే భావన ఎక్కడా కనిపించడం లేదు. పౌరుల ప్రాథమిక హక్కులకు ముప్పు వాటిల్లుతున్నది. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థలు, మీడియా, ఎన్నికల సంఘం వంటి సంస్థల స్వతంత్రత ప్రశ్నార్థకమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీతో పోలిస్తే, దేశంలో ప్రస్తుతం అంతకంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో న్యాయవ్యవస్థ గొంతుకను కొంతవరకూ నొక్కిపెట్టారు. అయినప్పటికీ, పది హైకోర్టులు ప్రజల హక్కులకు అనుకూలంగా తీర్పును వెలువరించాయి. అయితే, ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు ఇప్పుడు దేశంలో నెలకొన్నాయి. మైనారిటీ వర్గాలను ఓ భూతంగా చూపిస్తూ మోడీ ప్రభుత్వం వారిని బలిపశువులను చేస్తుంది. దానికోసం మీడియాతో పాటు సోషల్‌మీడియాలో విష ప్రచారం చేస్తుంది. విద్వేష, తప్పుడు ప్రచారాలను ఒక క్రమపద్ధతిలో తెరమీదకు తెస్తుంది. అదే నిజమంటూ నమ్మిస్తుంది. వాస్తవాలు, ఉన్నది ఉన్నట్టు చెప్పే మీడియా గొంతునొక్కుతున్నారు. అలాంటి సోషల్ మీడియా అకౌంట్లపై ప్రభుత్వం ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌ విధిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి వాక్ స్వాతంత్రాన్ని కాలరాస్తూ.. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ లాంటి ద్వారా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎన్నికల కమిషన్ ను భ్రష్టు పట్టిస్తుంది. యూపీలోని రామ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్‌కు ముస్లింలను అనుమతించకపోవడమే దీనికి ఉదాహరణ. ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ (రెగ్యులేషన్‌) యాక్ట్‌కు సవరణల ద్వారా, ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా మూడింట రెండొంతుల విరాళాలను బీజేపీనే దక్కించుకొంటున్నది. ప్రధాని మోడీ, ఆయన పార్టీకి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ వర్తించని పరిస్థితి. ప్రభుత్వం నిర్ణయానుసారమే ఎన్నికలను ఈసీ నిర్వహిస్తున్నదని అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఏ పార్టీ ఓడించలేదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు.” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రశాంత్ భూషన్.

Tuesday, January 17, 2023

విపక్ష ప్రధాని అభ్యర్థిగా కేసీఆర్

 విపక్ష ప్రధాని అభ్యర్థిగా కేసీఆర్?

జాతీయ మీడియాలో ఆసక్తికర చర్చ ఖమ్మం సభకు ముగ్గురు సీఎంల రాకపై దృష్టి హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష పార్టీలు తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును ప్రకటించనున్నాయా? ప్రస్తుతం జాతీయ మీడియాలో ఇదే చర్చనీయాంశం. కంటివెలుగు కార్యక్రమానికి ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రులు వస్తుండటంతో జాతీయ మీడియా చూపు మొత్తం ఇప్పుడు తెలంగాణపై కేంద్రీకృతమైంది. వాస్తవానికి తనకు ఎదురులేరని విర్రవీగుతున్నఎవరూ ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఝలక్ ఇస్తూ సీఎం కేసీఆర్ ఎదురొడ్డి నిలబడినప్పటినుంచి.. జాతీయ మీడియా, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు కేసీఆర్ గురించి చర్చించడం మొదలుపెట్టారు. టీఆర్ఎస్  పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పుడు సైతం జాతీయ స్థాయిలో కొత్త పార్టీ రాబోతున్నదని పెద్దఎత్తున చర్చ నడిచింది. కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర వంటిరాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి ఆయారాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలతోఆయన భేటీ కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండటం హాట్టాపిక్గా మారింది. ఇటీవలే ఏపీలో బీఆర్ఎస్ శాఖను ఏర్పాటు చేయడంతో పార్టీ విస్తరణపై కథనాలు ఊపందుకున్నాయి. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మొదటినుంచీ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు. గుజరాత్ మాజీ సీఎం శంకర్సింగ్ వాఘేలా,ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ వచ్చి సీఎం కేసీఆర్ను కలవడం, మహారాష్ట్రమాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేసీఆర్ చర్చలు జరుపడం వంటి పరిణామాలపై జాతీయమీడియా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఓ వైపు రాజకీయంగా విపక్ష పార్టీలను ఏకంచేస్తూ, మరోవైపు తెలంగాణ మాడల్ను దేశానికి పరిచయం చేస్తుండటంతో ఇప్పుడుసీఎం కేసీఆర్ హాటాపిక్ గా మారారు. తాజాగా 'హిందుస్థాన్' అనే పత్రిక 2024లో విపక్ష పార్టీల ప్రధానమంత్రి అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నదని ఒక కథనాన్ని ప్రచురించింది.బీజేపీయేతర, కాంగ్రెసేతర విపక్ష నేత లను సీఎం కేసీఆర్ ఏకం చేస్తుండటాన్నిప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందుకోసం ప్రాంతీయ పార్టీలను సీఎం కేసీఆర్ కలుపుకొనిపోతున్నారని పేర్కొన్నది. కంటివెలుగు ప్రారంభోత్సవానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రివాల్ (ఢిల్లీ) భగవంత్ మాన్ (పంజాబ్), పినరాయి విజయన్ (కేరళ), యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వస్తుండటాన్ని గొప్ప వ్యూహంగాఆ పత్రిక ప్రశంసించింది. కలిసి వచ్చే పార్టీలను ఇలాగే కలుపుకొంటూ వెళ్తూ జాతీయస్థాయిలో కీలకనేతగా కేసీఆర్ మారుతున్నారని విశ్లేషించింది. అనేక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నదని, ముఖ్యంగా కర్ణాటకతో మొదటిఅడుగు పడబోతున్నదని తెలిపింది. కర్ణాటకలోని 30కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ తనహవా చూపే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో విపక్షపార్టీల ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ ఉంటారని ఆయన అభిమానులు చెప్పుకొంటున్నా.. ఢిల్లీలో ఆయన పరపతి తక్కువేనని స్పష్టంచేసింది. సొంత రాష్ట్రంలోనేసంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న నితీశ్కు జాతీయస్థాయిలో అవకాశాలు తక్కువేనని విశ్లేషించింది.