ఉందిలే మంచికాలం ముందు ముందునా
Thursday, November 2, 2023
అతను ఈ మట్టి పరిమళం#Kallem_Naveen_Reddy
అతను ఈ మట్టి పరిమళం!
వర్షపు చుక్కలకు తడిసిన పల్లెలు
తన ఒడిలో ఎన్నో పరిమళాలను కప్పి పెట్టి
ఒక్కసారిగా ఆ పరిమళాలను కుమ్మరిస్తుంది...!
అవును అందంగా పల్లెలు తడుస్తాయి
నేలా తడుస్తుంది
పచ్చదనమై పరుచుకుంటుంది
మట్టి బువ్వ అవుతుంది
రైతు కళ్ళల్లో ఆనందం పూస్తుంది
బతుకు పాఠం అవుతుంది...!
ఆ అందమైన ప్రకృతిలో
ఎన్నో
అనంతమైన అంశాలు దాగి ఉన్నాయి
ఆ యోధుని ప్రేమకు
తెలంగాణ మీదున్న
బాధ్యతతో
ఈ మట్టి సంతకమై
భూమి పొరల్లో నుండి విచ్చుకుంటున్న
మొక్కే
అతని పాలనకు నిదర్శనం...!!
- Kallem Naveen Reddy
https://soundcloud.com/telangana/4-ooru-telangana?si=5779e0908b8d471f8be6b8d6deaaf1b1&utm_source=clipboard&utm_medium=text&utm_campaign=social_sharing
Wednesday, November 1, 2023
ఎవరు అడగకముందే కేసిఆర్ గారు ఇప్పటిదాకా చేశాడు#Kallem_Naveen_Reddy
ఎవరు అడగకముందే కేసిఆర్ గారు ఇప్పటిదాకా చేశాడు
అవును ఎవరు అడగలేదు అడగాల్సిన అవసరం రాకుండా చేశాడు ఇంకా ఎన్నో చేస్తూనే ఉంటాడు ఇప్పటిదాకా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను గమనిస్తే తెలుస్తుంది చేసిన అభివృద్ధిని చూస్తే కనిపిస్తుంది! అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదనీ అంటారు కానీ అడగముందే అన్నీ చేసిన వ్యక్తి మనతరంలో ఉండటం ఖచ్చితంగా మన అదృష్టమే! అతను ఒక చరిత్రను సృష్టించే ఆయుధం మన బతుకులను మార్చినా భరోసా అతను నిరంతరం ప్రవహించే నది అతను ఆలోచనల పరంపర! అతను శత్రువును కూడా తన పనితో ప్రభావితం చేయగలడు కాబట్టీ అతనితో నడవడం అంటే భవిష్యత్ తరాలకు మార్గాలను వేయడమే! - Kallem Naveen Reddy
Subscribe to:
Posts (Atom)

