గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం
Wednesday, December 3, 2025
Tuesday, December 2, 2025
ఆధ్యాత్మిక ఇంజనీర్ #టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) #cell: 9849443752#https://lordofsevenhills.com/
• తిరుమలేశుడి విశేషాలపై రచనలు న్యూస్టుడే, ఫిలింనగర్ పేరు: టి.వి.ఆర్.కె.మూర్తి కలం పేరు: విశ్వపతి వయస్సు: 53 ఏళ్లు విద్య: వరంగల్ ఆర్ ఈసీలో ఎంటెక్ గత వృత్తి: ఆల్విన్, ఎం.వి.ఎస్.ఆర్. కంపెనీలో ఇంజినీర్. ప్రస్తుతం: లోగోలు డిజైన్ చేయడం. ప్రవృత్తి: శ్రీనివాసుడిపై ఆధ్యాత్మిక పుస్తకాలు రచన, ఉచిత పంపిణీ. నగరంలోని మోతీనగర్కు చెందిన టి.వి.ఆర్.కె.మూర్తి... శ్రీనివాసుడిపై ఇప్పటికే పది పుస్తకాలు రచించారు. కావాల్సిన వారికి వాటిని ఉచితంగా పం చుతున్నారు. కోరితే సొంత ఖర్చుతో కొరియర్లోనే వాటిని చేరవేయడం ఆయన ఆధ్యాత్మిక ఉదారతకు నిద ర్శనం. 'విశ్వపతి' అనే కలం పేరుతో ప్రసిద్ధుడైన ఈయన... వరంగల్ రీజ నల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదివారు. తరువాత ఆల్విన్ కంపెనీ లోను, ఎం. వి. ఎస్. ఆర్. ఇంజినీరింగ్ కాలేజీలోనూ పలు హోదాల్లో పని చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో సమ్ ఫన్' అనే పేరుతో ప్యాకెట్ కార్టూన్లు వేసేవారు. 1993లో హాబీగా లోగోలు డిజైన్ చేయడం ప్రారంభించారు. 1998 నుంచి పూర్తి సమయాన్ని వాటి డిజైనింగ్ కే కేటాయిస్తున్నారు. తొలి నుంచి శ్రీనివాసుడిపై ఉన్న భక్తి ప్రపత్తులను ఆయన తన రచనల ద్వారా చాటుకుంటున్నారు. తానే స్వయంగా శ్రీశ్రీనివాస మహత్మ్యం, శ్రీ వెంక టేశ్వర వ్రతకల్పం రచించారు. విదేశీ భక్తుల కోసం ఈ పుస్తకాలను ఇంటర్నెట్లో https://lordofsevenhills.com/ వెబ్సైట్లో ఉంచారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పుస్తకం పూర్తి కాగానే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మొదటి ప్రతులను స్వామి హుండీలో సమర్పించడం ఈయన ఆనవాయితీ. ఎందరికైనా... ప్రతి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మూర్తికి దాదాపు రెండు వందలకుపైగా ఉత్తరాలు వస్తుంటాయి. అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఎప్పటికప్పుడు ఆ పుస్తకాలను ప్యాకింగ్ చేసి కొరియర్ ద్వారా ఉచితంగా పంపు తారు. ఎంతటి మారుమూల గ్రామాలకైనా ఈ పుస్తకాలను పంపిస్తారు. శ్రీవెంకటేశ్వర వ్రతకల్పం పుస్తకాలను ఇప్పటివరకు లక్షకు పైగా ఉచితంగా పంచిపెట్టారు. వాటిని పంపేందుకు అయ్యే పోస్టు ఖర్చులను కూడా ఆయనే భరిస్తారు. వీటి ముద్రణ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకొన్నారు. తిరుమలేశుడి విశేషాలు చాలా మందికి తెలియవు. అందుకే ఆ విశేషాలతో పుస్తకా లను రచిస్తున్నట్లు మూర్తి తెలిపారు. ఇవి కావాల్సిన వారు టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) ఫ్లాట్ 202, ప్లాట్ నెం. 32. రవి రెసిడెన్సీ, నలంద హైస్కూల్ పక్కన, మోతినగర్ క్రాస్ రోడ్, హైదరాబాద్-500018కు లేదా ఫోన్ : 9849443752 నెంబరులో సంప్రదించవచ్చు.ఆధ్యాత్మిక ఇంజనీర్
srimadbhagavadgita-sundarachaitanya arcive org links
Monday, December 1, 2025
LORD SHIVA mp3 SONGS FREE DOWNLOAD_500 SONGS
తిరుమల దర్శనంపై ఆర్టీసీ AP & TG ప్రకటన:
తిరుమల దర్శనంపై ఆర్టీసీ AP & TG ప్రకటన:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా మరియు తెలంగాణ ఆర్టీసీ TGRTC బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC & TGRTC బస్సుల్లో రోజుకు 1000 దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయబడ్డాయి.
ఏపిఎస్‌ఆర్‌టీసీ & తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ సువర్ణావకాశం కల్పించారు.
ఏపిఎస్‌ఆర్‌టీసీ & టీజీ ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే ఏపీ & తెలంగాణ ఆర్టీసీ లగ్జరీ & లహరి బస్లో దర్శనం టికెట్ పొందవచ్చు.
ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం 11.00 మరియు సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించబడుతుంది.
తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సూపర్‌వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు.
కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. APSRTC & TGSRTC తిరుపతికి రోజూ 650 బస్సులను నడుపుతోంది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది. బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
*చివరి అభ్యర్థన:*
ఈ పోస్ట్‌ను షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ మరెవరికైనా ఇది అవసరం, కాబట్టి దయచేసి షేర్ చేయండి.🙏🏻💐☺️





