Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer

Monday, October 19, 2020

★ *ధరణి ఇలా పని చేస్తుంది*

 

Dharani Portal launching on 25-10-2020

Namaste Telangana News Clip dated: 18-10-2020 page.6.

link:


https://epapercdn.ntnews.com/NT/2020/10/18/MAI/5_06/e80f4ffc_209504_1.jpg


 ✍️✍️✍️సేకరణ✍️✍️✍️


షేక్ ఖదీర్, M.Sc, SA


సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, Wyra


ఖమ్మం జిల్లా.. 9959124524


👆👆👆👆👆👆👆👆👆


★ *ధరణి ఇలా పని చేస్తుంది*


★ *సులభంగా స్లాట్‌ బుకింగ్‌..*  


★ *కూర్చున్న చోటే* 

     *అన్ని వివరాల* *నమోదు*


★ *వెరిఫికేషన్‌ నుంచి* 

     *రిజిస్ట్రేషన్‌ దాకా* *అంతా ఆన్‌లైన్‌..* 


★ *సామాన్యులకూ అర్థమయ్యేలా* 

     *వెబ్‌సైట్‌ రూపకల్పన*


★ *ఫొటోలు, బయోమెట్రిక్‌* 

     *వేలిముద్రలతో పక్కామార్పిడి..* 


★ *రాష్ట్రంలోని ప్రతి అంగుళం*

     *ధరణిలో నిక్షిప్తం*


యావత్తు రాష్ట్ర ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్‌ పారదర్శకత అనే అత్యున్నత లక్ష్యానికి అనుగుణంగా రూపుదిద్దుకున్నది. రాష్ట్ర చరిత్రలోనే విప్లవాత్మక అడుగు వేస్తూ ఈ నెల 25న దసరా పండుగనాడు ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సాంకేతికంగా ధరణి పోర్టల్‌ పూర్తిస్థాయిలో రెడీ అయ్యింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. వాటి ఫలితాలను బట్టి అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేసుకొని దసరా నుంచి ప్రజలకు ధరణి అందుబాటులోకి రానున్నది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో ఏమేం ఉంటాయి? స్లాట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలి? తాసిల్దార్‌ కార్యాలయంలో లావాదేవీలు ఎలా పూర్తవుతాయి? ఏయే పత్రాలు అవసరం అవుతాయి? వంటి పూర్తి వివరాలతో 


                            *****


*: పోర్టల్‌లో మూడు భాగాలు :*

1. డాటా పోర్టల్‌

2. పిటిషనర్‌ పోర్టల్‌

3. డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌

---------------------------------------------------------

1. డాటా పోర్టల్‌

ఇందులో రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలు ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయేతర, అటవీ భూముల సమగ్ర సమాచారం ఇందులో లభిస్తుంది. ఈ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తారని సమాచారం. తద్వారా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా భూమి వివరాలను తెలసుకొనే అవకాశం కలుగనున్నది.

2.  పిటిషనర్‌ పోర్టల్‌

భూ యజమాని లేదా అమ్మకందారు, కొనుగోలుదారులు, వారసులు భూ లావాదేవీకోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొత్తం ఈ పోర్టల్‌లో ఉంటుంది. ఈ విభాగంలో స్లాట్‌ బుకింగ్‌ నుంచి చలాన్‌ చెల్లించేవరకు ఆప్షన్లు ఉంటాయి. 

3. డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌

తాసిల్దార్లు, ధరణి ఆపరేటర్లు, ఇతర అధికారులకు మాత్రమే కనిపించే విభాగం ఇది. పిటిషన్‌దారు చలాన్‌ చెల్లించిన తర్వాత దరఖాస్తు తాసిల్దార్‌ కార్యాలయానికి చేరినప్పటి నుంచి హక్కు పత్రాలు కొనుగోలుదారు లేదా వారసుల చేతికి వచ్చే వరకు ప్రక్రియ అంతా డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌లో జరుగుతుంది.


*స్లాట్‌ బుక్‌ చేసుకోండిలా ...*

---------------------------------------------------------

ధరణి పోర్టల్‌ను ఓపెన్‌ చేయగానే అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ‘అగ్రికల్చర్‌'పై క్లిక్‌ చేయాలి.


తర్వాత వచ్చే పేజీలో ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదటి ఆప్షన్‌  ‘స్లాట్‌ బుకింగ్‌ ఫర్‌ సిటిజన్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.


సిటిజన్‌ లాగిన్‌ పేజీలో మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ఫోన్‌కు ఒక పాస్‌వర్డ్‌ వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి.  ఆ తర్వాత కింద గడుల్లో ఉన్న అంకెలు/అక్షరాలను (క్యాప్చా)ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ‘గెట్‌ ఓటీపీ’ బటన్‌ క్లిక్‌ చేయాలి. వచ్చిన ఓటీపీని కింద ఇచ్చిన గడిలో నమోదు చేయాలి. 


ఓటీపీని నమోదు చేయగానే ‘సిటిజన్‌ డ్యాష్‌బోర్డ్‌' పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో ఏడు ఆప్షన్లు కనిపిస్తాయి. రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారు మొదటి ఆప్షన్‌ ‘అప్లికేషన్‌ ఫర్‌ రిజిస్ట్రేషన్‌ (సేల్‌/గిఫ్ట్‌)’ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే పక్కన వచ్చే యువర్‌ అప్లికేషన్‌లో ‘ప్రీ రిజిస్ట్రేషన్‌'ను ఎంచుకోవాలి. 


ప్రీ రిజిస్ట్రేషన్‌లో ‘నేచర్‌ ఆఫ్‌ డీడ్‌, నేచర్‌ ఆఫ్‌ సబ్‌డీడ్‌'లలో మన లావాదేవీ ఏ రకమో (సేల్‌/గిఫ్ట్‌/పార్టిషన్‌) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. చివరగా పట్టాదార్‌ పాస్‌బుక్‌ (పీపీబీ) నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ‘ఫెచ్‌' బటన్‌ క్లిక్‌ చేయాలి. 

పీపీబీ నంబర్‌పై ఉన్న ఆస్తి వివరాలు కనిపిస్తాయి. జిల్లా, మండలం, గ్రామం, ఖాతా నంబర్‌, యజమాని పేరు, తండ్రి పేరు వంటి వివరాలు వస్తాయి. ఆ తర్వాత సదరు సర్వే నంబర్‌లో ఉన్న సబ్‌ సర్వే నంబర్లు, వాటి కింద ఎంత విస్తీర్ణంలో భూములు ఉన్నాయో వివరాలు కనిపిస్తాయి. ఈ భూముల్లో ఎంతమేర బదలాయించాలనుకుంటున్నారో వివరాలు ఎంటర్‌ చేయాలి. ఒకేసారి ఒకటికి మించి సర్వే నంబర్లను ఎంపిక చేసుకోవచ్చు. చివరగా ‘ప్రొసీడ్‌'ను క్లిక్‌ చేయాలి.


తర్వాత వచ్చే ‘ఫోర్‌ బౌండరీ డీటెయిల్స్‌'లో అమ్మాల్సిన భూమికి నాలుగు దిక్కులా ఉన్న హద్దుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో విద్యాసంస్థ, అదర్స్‌, రైల్వే, రోడ్‌, సర్వే నంబర్‌, టెంపుల్‌ తదితర ఆప్షన్లు ఉంటాయి. ఒక్కో దిక్కు ఏ హద్దు ఉన్నదో వివరాలను చేర్చాలి.


సెల్లర్‌ డీటెయిల్స్‌ పేజీలో పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఆధారంగా అప్పటికే నమోదైన యజమాని ఆధార్‌ నంబర్‌, పేరు(తెలుగులో), లింగం, కులం వంటి వివరాలు కనిపిస్తాయి. అనంతరం ఆధార్‌కార్డులో ఉన్న పేరు (ఇంగ్లిష్‌లో), రిలేషన్‌ టైప్‌, వయసు, వృత్తి, ఫారం 60/61ను సబ్‌మిట్‌ చేశారా? అని అడుగుతుంది. ఒకవేళ చేయకపోతే పాన్‌కార్డు నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత భూ యజమాని ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి పూర్తి చిరునామాను నమోదు చేయాలి. చివరగా సేవ్‌ అండ్‌ కంటిన్యూ బటన్‌ను క్లిక్‌ చేయాలి. 


కొనుగోలు చేసే వ్యక్తి వివరాలను నింపాలి. ఇప్పటికే పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. దీంతో ఆ వ్యక్తి పూర్తి వివరాలు ప్రత్యక్షం అవుతాయి. ఆ తర్వాత అన్ని వివరాలు నింపాలి. ఒకవేళ పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేదని ఎంపిక చేసుకుంటే అక్కడ కనిపించే అన్ని రకాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 


పేమెంట్‌ అండ్‌ ట్రాన్సాక్షన్‌ సమ్మరీ పేజీలో ట్రాన్సాక్షన్‌ సమ్మరీ రిసిప్ట్‌ను క్లిక్‌ చేస్తే ఇప్పటి వరకు మనం నమోదు చేసిన అన్ని రకాల వివరాలు అందులో ప్రత్యక్షం అవుతాయి. భూ లావాదేవీకి సంబంధించి ఎంత చెల్లించాలో కూడా కనిపిస్తుంది. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత ‘యెస్‌' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ‘ప్రొసీడ్‌ టు పేమెంట్‌'ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ తప్పుగా నమోదైతే వెనక్కి వెళ్లి మరోసారి వివరాలు నమోదు చేయాలి. 


*చలాన్‌ పేజీలో డబ్బు ఎవరు కడుతున్నారు?* సెల్లర్‌, బయ్యర్‌, ఇతరులు ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే అప్పటికే మనం ఎంటర్‌ చేసిన సెల్లర్‌/బయ్యర్‌ వివరాలు కనిపిస్తాయి. ఎంత మొత్తం చెల్లించాలో అందులో వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకసారి సరిచూసుకొని జనరేట్‌ చలాన్‌ ఆప్షన్‌ ఎంపిక చేయాలి. 


*పేమెంట్‌ డీటెయిల్స్‌లో..* వివరాలన్నీ సరిచూసుకొని ‘ప్రొసీడ్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు పేమెంట్‌ ‘గేట్‌ వే’ తెరుచుకుంటుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో లేదా  చలాన్‌ ప్రింట్‌ తీసుకొని వెళ్లి ఎస్‌బీఐ బ్యాంకులో నేరుగా కట్టుకోవచ్చు. 

పేమెంట్‌ అయిపోయిన తర్వాత మళ్లీ ‘ప్రీ రిజిస్ట్రేషన్‌' పేజీకి వెళ్లి అక్కడ ‘విట్‌నెస్‌ డీటెయిల్స్‌' (సాక్షుల వివరాలు) నమోదు చేయాలి. సాక్షి పేరు, ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌ ఎంటర్‌ చేయాలి. కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి.


ఆ తర్వాత డాక్యుమెంట్‌ డీటెయిల్స్‌లో అఫిడవిట్‌-1, అఫిడవిట్‌-2, ఫారం 60/61ను అప్‌లోడ్‌ చేయాలి. కావాలంటే నమూనా డాక్యుమెంట్లు పక్కనే ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని, నింపి, అప్‌లోడ్‌ చేయవచ్చు. తర్వాత కనిపించే ‘జనరేట్‌ డాక్యుమెంట్‌, కన్ఫర్మ్‌ డాక్యుమెంట్‌, ప్రొసీడ్‌ ఫర్‌ స్లాట్‌ బుకింగ్‌' ఆప్షన్లను వరుసగా ఎంపిక చేసుకోవాలి. ఈ సందర్భంగా కనిపించే వివరాలన్నింటినీ సరిచూసుకోవాలి.


చివరగా స్లాట్‌ బుకింగ్‌ ఆప్షన్‌కు వెళ్తుంది. ఇక్కడ అప్లికేషన్‌ టైప్‌, టీఎక్స్‌ఎన్‌ నంబర్‌, తాసిల్దార్‌ ఆఫీస్‌ వంటి వివరాలన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. పక్కన ఉన్న క్యాలెండర్‌లో ఏ తేదీన, ఏ సమయానికి స్లాట్‌ ఖాళీగా ఉన్నదో కనిపిస్తుంది. మనకు అనువైన సమయం ఎంపిక చేసుకొని ‘బుక్‌ స్లాట్‌' ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే స్లాట్‌ బుక్‌ అవుతుంది. కింద కనిపించే ‘ప్రింట్‌ రిసిప్ట్‌'ను క్లిక్‌ చేసి ప్రింటవుట్‌ తీసుకోవచ్చు.


 *ఏ డాక్యుమెంట్లు ఇస్తారు ?*

---------------------------------------------------------

అమ్మకందారుకు..

l అప్‌డేట్‌ అయిన పాస్‌ బుక్‌  (అమ్మిన భూమిని డిలీట్‌ చేసి) ఇస్తారు.

l మ్యుటేషన్‌ ఆర్డర్‌

l లావాదేవీ  సారాంశం రిజిస్ట్రేషన్‌  అండ్‌ మ్యుటేషన్‌ డాక్యుమెంట్‌


*కొనుగోలుదారుకు*

---------------------------------------------------------

l అప్‌డేట్‌ అయిన పాస్‌బుక్‌  (కొనుగోలు చేసిన భూమిని కలిపి) ఇస్తారు.

l కొన్నవ్యక్తికి ఆ గ్రామంలో పాస్‌బుక్‌  లేకపోతే  కొత్త పాస్‌బుక్‌ ప్రింట్‌ చేసి ఇస్తారు. దీనిని కొరియర్‌ ద్వారా కొనుగోలుదారుకు  పంపిస్తారు.

l రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌

l ఈ-పీపీబీ

l లావాదేవీ సారాంశం- రిజిస్ట్రేషన్‌ అండ్‌  మ్యుటేషన్‌ డాక్యుమెంట్‌ పాస్‌బుక్‌లో ఏముంటాయి? 


*అమ్మకందారు..* 

---------------------------------------------------------

లావాదేవీకి ముందు 

l ఏ సర్వేనంబరు భూమి..   అది ఎన్ని ఎకరాలు ఉంది

లావాదేవీ తరువాత 

l ఏ సర్వే నంబరు భూమి..  అది ఎన్ని  ఎకరాలు ఉంది

l ఏ తేదీన విక్రయించారు 

l ఇతర వివరాలు


 *కొనుగోలుదారు..* 

---------------------------------------------------------

లావాదేవీకి ముందు 

l పాస్‌ బుక్‌లో గతంలో ఉన్న భూమి సర్వే నంబరు, ఎన్ని ఎకరాలు ఉంది.

లావాదేవీ తరువాత 

l పాస్‌ బుక్‌లో గతంలో ఉన్న భూమి సర్వే నంబరు, ఎకరాలు

l ఇప్పుడు కొనుగోలు  చేసిన భూమి సర్వే నంబరు,  ఎకరాలు

l ఏ తేదీన కొనుగోలు చేశారు.


*భూముల వివరాలన్నీ ఒకేచోట*

---------------------------------------------------------

హోం పేజీలో అగ్రికల్చర్‌ ఆప్షన్‌ను ఎంచుకున్నాక మొత్తం ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మొదటి ఆప్షన్‌ స్లాట్‌ బుకింగ్‌ కాగా, మిగతావి రాష్ట్రంలోని భూముల వివరాలు తెలియజేస్తాయి.

స్టేట్‌ ల్యాండ్స్‌ డీటెయిల్స్‌ రాష్ట్రంలోని మొత్తం భూముల విస్తీర్ణం వివరాలు ఉంటాయి. ఏయే రకం భూములు ఎంతమేర ఉన్నాయో కనిపిస్తుంది. 


*ల్యాండ్‌ డీటెయిల్స్‌ సెర్చ్‌* 

---------------------------------------------------------

పౌరులు రాష్ట్రంలోని ఏ భూమి వివరాలైనా ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్‌ ఆధారంగా ఆ భూమి ఎవరి పేరుపై ఉందో తెలుసుకోవచ్చు.


*ప్రొహిబిటెడ్‌ ల్యాండ్స్‌*

---------------------------------------------------------

రిజిస్ట్రేషన్లు నిషేధించిన భూములు అంటే.. దేవాదాయ, వక్ఫ్‌, అసైన్డ్‌, అటవీశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూముల వివరాలు ఇందులో ఉంటాయి.

ఎన్‌కంబరెన్స్‌ డీటెయిల్స్‌ ఆస్తులకు సంబంధించిన ఈసీ వివరాలు (భూమి లావా దేవీల చరిత్ర) ఉంటాయి.  


*మార్కెట్‌ వ్యాల్యూ*

---------------------------------------------------------

సర్వే నంబర్ల వారీగా నిర్దేశించిన మార్కెట్‌ వ్యాల్యూ, స్టాంప్‌డ్యూ టీ వివరాలు  కనిపిస్తాయి.


*స్లాట్‌ బుక్‌ కాగానే..* భూ యజమాని లేదా అమ్మకందారు ఫోన్‌నంబర్‌కు, కొనుగోలుదారు ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం వెళ్తుంది. ఏ సమయంలో ఎక్కడికి రావాలో స్పష్టంగా ఉంటుంది. కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేస్తే ఏయే డాక్యుమెంట్లు అవసరం అవుతాయో సమాచారం వస్తుంది. నిర్దేశిత తేదీన, ఆయా డాక్యుమెంట్లు, కొనుగోలుదారు, అమ్మకందారు, సాక్షులు కలిసి తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్తే వెంటనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుంది. హక్కు పత్రాలు చేతికి వస్తాయి. అమ్మకందారు ఖాతా నుంచి ఆ మేరకు విస్తీర్ణం తగ్గిపోయి, కొనుగోలుదారు పేరుమీదికి బదిలీ అవుతుంది. బయ్యర్‌కు అప్పటికే పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఉంటే తాజా కొనుగోలు భూమి వివరాలు అందులో నమోదవుతాయి. లేకుంటే కొత్త పాస్‌బుక్‌ వస్తుంది. 


*స్లాట్‌ బుక్‌ అయ్యాక ప్రక్రియ ఇలా..* 

---------------------------------------------------------

స్లాట్‌ బుక్‌ చేసుకున్నాక ఆ దరఖాస్తు ధరణి డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌కు వెళ్తుంది. ఇక్కడ తాసిల్దార్‌ కమ్‌ జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌, డీఈవో (ధరణి ఆపరేటర్‌) వివిధ దశల్లో ప్రక్రియను పూర్తి చేస్తారు.


రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ ఇచ్చిన సమయానికి తొలుత ధరణి ఆపరేటర్‌ (డీఈవో) దగ్గరకు వెళ్లాలి.  ఇక్కడ విట్‌నెస్‌ డీటెయిల్స్‌ (సాక్షి వివరాలు) నమోదు చేయడంతో పాటు విక్రయదారు, కొనుగోలుదారుల, సాక్షుల బయోమెట్రిక్‌ (వేలిముద్రలు), ఫొటోలు తీసుకుంటారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్‌/సక్సెషన్‌/పార్టిషన్‌ దేనికి ఉద్దేశించినదో పోర్టల్‌లో ఆప్షన్‌ను ఎంపిక చేసి అందులో విట్‌నెస్‌ వివరాలు నమోదు చేస్తారు. అనంతరం విక్రయదారు, కొనుగోలుదారుల బయోమెట్రిక్‌, ఫొటోను తీసుకుంటారు. ఫొటోలను అక్కడే వెబ్‌క్యామ్‌ ద్వారా తీసుకుంటారు.


అనంతరం తాసిల్దార్‌ దగ్గరకు వెళ్లాలి. ఇక్కడ బయోమెట్రిక్‌, ప్రాపర్టీ, స్టాంపుడ్యూటీ వివరాలను తనిఖీ చేసి, ఓ డాక్యుమెంట్‌ నెంబరు కేటాయించి రిజిస్ట్రేషన్‌ను అప్రూవ్‌ చేస్తారు. అనంతరం మ్యుటేషన్‌ అండ్‌ సైనింగ్‌ ఆఫ్‌ రికార్డు ప్రక్రియను పూర్తి చేస్తారు.


కొనుగోలుదారు, విక్రయదారు అక్కడి నుంచి తిరిగి డీఈవో దగ్గరకు వెళ్లాలి. ఇక్కడే కొనుగోలుదారు, విక్రయదారు ఇద్దరికి పాస్‌బుక్‌లు ప్రింట్‌ చేసి ఇవ్వడంతో పాటు రిజిస్ట్రార్‌ డాక్యుమెంట్‌ను ఇస్తారు. 


*సక్సెషన్‌ ప్రక్రియ ఇలా..* 

---------------------------------------------------------

సక్సెషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో సిటిజన్‌ డ్యాష్‌బోర్డులో ‘అప్లికేషన్‌ ఫర్‌ సక్సెషన్‌' ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని కుటుంబసభ్యుల అందరి వివరాలు నమోదు చేయాలి. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి ఉమ్మడిగా రాసుకున్న షేర్‌ డాక్యుమెంట్‌ (ఒప్పంద పత్రం)ను అప్‌లోడ్‌ చేయాలి. మిగతా స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలి.


స్లాట్‌ ఇచ్చిన సమయానికి కుటంబసభ్యులందరూ కలిసి కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ధరణి ఆపరేటర్‌ సంబంధిత వివరాలను తనిఖీ చేసి తాసిల్దార్‌ దగ్గరకు పంపిస్తారు. 


తాసిల్దార్‌ కుటుంబసభ్యుల బయోమెట్రిక్‌ (వేలిముద్రలు), ఫొటోలు తనిఖీ చేస్తారు.


ఒప్పందం ఆధారంగా కొత్త ఖాతాలు లేదా సర్వే నంబర్లను సృష్టిస్తారు. చివరగా మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి తాసిల్దార్‌ ఆ పత్రాలను డీఈవోకు పంపిస్తారు. అక్కడ మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి హక్కు పత్రాలను చేతికి ఇస్తారు.


✍️ మీ....ఖదీర్✍️✍️ 

Dharani Portal launching on 25-10-2020 Namaste Telangana News Clip dated: 18-10-2020 page.6. link:https://epapercdn.ntnews.com/NT/2020/10/18/MAI/5_06/e80f4ffc_209504_1.jpg


Thursday, October 15, 2020

కాలమహిమలో బందీలం! | దాసుని హృదయంలోనే దేవుడు | జీవన గమ్యాలు ఆశ్రమ ధర్మాలు!

 కాలమహిమలో బందీలం!

సర్వం కాలికమ్‌' అన్నట్లుగా కాలం జన్మతో మొదలై, జీవిలో భాగమై, మరణంతో ముగుస్తుంది. కాలం బలీయమైన ప్రవాహిని. అడ్డు అన్నది ఎరుగనిది. ఎత్తు పల్లాలు లేనిది. దీనికి ప్రయాణమే తెలుసు. ‘తన-పర’ భేదాలు లేనిది. అన్నిటినీ అనంతమైన ఆత్మతో కట్టి పడేసే పాశువు కాలం. ఆత్మ ఎప్పుడైతే ఒక పదార్థంగా మారుతుందో అప్పుడే కాలం పదార్థ గమనంలో భాగమైపోతుంది. విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాలకు అన్నిటికీ దేని కాలం దానికుంటుంది. పుట్టిన ప్రతి ఒక్కటీ మరణించేదే. ఈ జనన మరణాలన్నీ కాలాధీనమే. అందుకే, కాలాధిపతిగా కాలుడిని, అతని ఆయుధంగా పాశువును చూపుతున్నది మన సనాతన శాస్త్రం. సూర్యుని నుంచి విడిపడ్డప్పట్నించే కాలం భూమికి కళ్ళెమైంది. ఒక ఆకృతిని పొందటంతోనే భూమి కాలానికి లోబడిపోయింది. భూ ‘భ్రమణ, పరిభ్రమణాలే’ కాలాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ‘భ్రమణం’ (తన చుట్టూ తాను తిరగడం) వల్ల దివారాత్రులు, ‘పరిభ్రమణం’ (సూర్యుని చుట్టూ తిరగడం) వల్ల ఋతువులతో సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. తన అక్షం మీద ఇరవై మూడున్నర డిగ్రీల కోణంలో వంగి పరిభ్రమిస్తూండటం వల్లే ఈ భూమిపై జీవం విస్తృతమైంది.


కాలాలు మారుతున్నకొద్దీ ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఏర్పడుతాయి. సూర్యుని వేడి సముద్రనీటిని ఆవిరిగా మారుస్తుంది. భూభ్రమణం వల్ల వీచే గాలులు ఆ మేఘాలను భూమిపైకి తరలించి వర్షంగా చిలకరిస్తాయి. ఈ ‘కాలచక్రమే’ భూమిమీద జీవ పుట్టుక, మనుగడలకు కారణమవుతున్నది. సూర్యునిలోని నిప్పు, ఈ నక్షత్రకూటమిలోని భూమి, ధరణిని ఆశ్రయించిన నీరు, ఆవరించిన వాయువు, వీటికి స్థావరమైన ఆకాశం (పంచభూతాలు).. అన్నిటి చక్కని సమన్వయం, సహకారం, సానుకూలతలతో ఏర్పడే అద్భుత సంయోగమే భూమిపై జీవానికి ఒక అలంబన. ఇదంతా సైద్ధాంతికంగా నిజమే అయినా దీనిని మనం ప్రత్యక్షంగా దర్శించలేం. ఈ చర్యలన్నిటికీ కాలమే హేతువు. కాలానికి హేతువు ‘రూపాన్ని పొందడమే’. సర్వాంతర్యామి అయిన ఆత్మయే ఈ రూపానికి హేతువు అవుతున్నది. అంటే, కాలమే ఆత్మ, ఆత్మే కాలం. బ్రహ్మజ్ఞాని శ్రీకృష్ణుడు ‘విభూతియోగం’లో ఇదే చెప్పాడు. ‘నేనే కాలాన్ని. సృష్టిలో మొదలు, మధ్య, తుది నేనే. అన్నిటిలో ఉన్నది నేనే. హరించే మృత్యువును నేనే. కలిగేవారిలో భవిష్యత్తును నేనే. మాసాలు, ఋతువులు అన్నీ నేనే’ అన్నాడు. గీతద్వారా ‘విశ్వానికే పుట్టినిల్లు’ అయిన ఆత్మను ఎలాగైతే అర్థం చేసుకున్నామో అలాగే, ‘ఆత్మ అంతర్లీనంగా ప్రదర్శించే కాలానికి ఈ విశ్వమంతా బందీ అవడాన్ని’ కూడా అవగాహనపరచుకోవాలి. ఆత్మ ఎంత బలీయంగా, సాంద్రతతో విస్తరించిందో కాలమూ అంతే బలీయమైంది.


‘నిత్యం సన్నిహితో మృత్యుః’ అంటున్నది భారతీయ సనాతనం. కాలమే ప్రాణం పోస్తుంది, పోషిస్తుంది, ఆయువు తీస్తుంది. ‘కాలం-ఆత్మ-ఆయువు’ల అద్వైత తత్త సారమే జ్ఞానం. దీనిని పొందిన జ్ఞానికి జన్మ, జీవనం, భౌతికావసరాలపట్ల ఆసక్తి ఎలాగైతే ఉండదో, అలాగే మృత్యువుపట్ల భయం కూడా ఉండదు. భారతావనిలోని ఎందరో ఋషులు దీనిని నిరూపించారు. ఆత్మకున్న ఒక లక్షణమైన కాలం పదార్థంగా పుట్టినప్పటి నుంచే మొదలవుతుంది కాబట్టి, కాలం పదార్థాన్నే బంధించగలుగుతుంది. కానీ, ఆత్మను కాదు. ఆత్మ అన్నిటికీ అతీతమవడమేకాక నిత్యమై, సత్యమై, సర్వాంతర్యామియై ఒప్పారుతున్నది. ఈ ఆత్మ నిరంతరతలో కాలమొక భాగం మాత్రమే. కాలం తన ధర్మాన్ని వదలక, చరాచర సృష్టి ఏకత్వాన్ని ఇలా నిర్విరామంగా పట్టి ఉంచుతూనే ఉంటుంది. ‘కాలమహిమ’ అంటే ఇదే మరి!.


రావుల నిరంజనాచారి




దాసుని హృదయంలోనే దేవుడు


దాసభక్తి లోకోపకారకమేకాక మోక్షసాధనమనీ ఆంజనేయస్వామి మొదలు ఎందరో రామభక్తులు లోకానికి చాటి చెప్పారు. ‘నాకు దాసమారుతిగా వుండటమే ఎంతో ఇష్ట’మని హనుమంతుడు వెల్లడించాడు. భగవత్సేవ చేసే అవకాశం దొరకకుంటేనే మారుతి బాధపడతాడు. అసాధారణ వినయ విధేయతలతోనే తాను నిరంతరం శ్రీరామునికి సేవ చేశాడు. ‘పరాక్రమానికి మూలం, బుద్ధికి పునాది, వివేచనా శక్తికి బీజాంకురం దాస్యభావమే’ అన్నది ఆయన భక్తితత్త్వం. మంచి నడవడి, జ్ఞానం, పవిత్రత, నిర్భయత్వం వంటి సద్గుణాలు లేకపోతే ‘దాస్యభక్తి’ కుదరదు. ఇవన్నీ కలిగిన ఆంజనేయుడు శ్రీరామునికి ఒక దాసునిలా సేవ చేయటమే తప్ప ప్రతిఫలం కోరలేదు. సూర్యుని వద్ద నవ వ్యాకరణాలు నేర్చినా ఒద్దికగా వుండేవాడు. రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం చేరే వేళ, బ్రాహ్మణ వేషంలో హనుమంతుడు తొలిసారిగా పరిచయమైన తరుణంలో శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. కారణం, అతని వినయం, పలుకులలో స్పష్టత, మృదుత్వం, నిశ్చలత! ‘పెద్ద పండితుడై ఉంటాడు’ అని రాముడు భావించాడు. 


రామునికేకాదు, సీతమ్మ వారికికూడా అత్యంత ప్రేమపాత్రుడైన దాసానుదాసుడు పవన సుతుడు. పట్టాభిషేకం తర్వాత రాముడు అందరికీ కానుకలు ఇస్తుంటాడు. హనుమంతునికి ఏం ఇవ్వాలని సీతమ్మ ఆలోచిస్తుంది. తన మెడలోని నవరత్నాల హారాన్ని రామునితో మారుతికి ఇప్పిస్తుంది. ఆంజనేయుడు కన్నీరు పెట్టుకొంటాడు. అందులోని ఒక్కొక్క పూసనూ కొరికి పారేస్తుంటాడు. సభికులంతా ఆశ్చర్యంతో అలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తారు. ‘ఈ పూసల్లో నా రాముడు కనిపిస్తాడేమోనని చూస్తున్నాను’ అని సమాధానమిచ్చాడు. ఆఖరుకు గోర్లతో ఛాతినే నిలువునా చీల్చుకొని తన హృదయంలో సీతారాములు ఉండటాన్ని అందరికీ చూపించి ఆనందిస్తాడు. ‘ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ వాయుపుత్రుడు చెమ్మగిల్లిన కండ్లతో దాసుడై’ ఉంటాడు. ‘ఏ భృత్యుడైతే యజమాని కోసం ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, కష్టమైన పనినైనా కూడా ఇష్టంగా చేయగలుగుతాడో అతడే నిజమైన పురుషోత్తముడు, దాసుడు’ అంటున్నది రామాయణం. ‘బుద్ధిమతాం వరిష్టం’ అన్నట్లు మృదుమధుర భాషణతో సీతమ్మ బాధను తొలగించడానికై ఈ మహాబలుడు పడిన తిప్పలు ఇన్నీ అన్నీ కావు. అశోకవనంలో రావణాసురుని వేగులు అనేక రూపాలలో మాయాజాలం ప్రదర్శిస్తుంటారు. రావణాసురుడు బలగంతో వచ్చి సీతమ్మను బెదిరించి వెళ్ళటమూ చెట్టు పైనుండి ఆంజనేయుడు గమనించాడు. జానకి ఆత్మత్యాగానికి సిద్ధపడుతుంది. ఆమె ఎవ్వరినీ, ఎవ్వరి మాటలను నమ్మే పరిస్థితిలో లేదు. అప్పుడు ఓ మానసిక శాస్త్రవేత్తవలె ఆలోచించి, హనుమ అద్భుతంగా ‘రామనామం’ గానం చేశాడు. అతను సీతమ్మను తన పలుకులతో నమ్మించి, ఊరడించిన తీరు అనూహ్యం. 


రామదూతగా అతను ప్రదర్శించిన ‘కుశాగ్రబుద్ధి’ అనితర సాధ్యం. తన సమయోచిత ప్రజ్ఞకు సరిసమానం ఆయన దాసభక్తి. ‘దాసమారుతి’గా తాను ఎప్పుడూ సీతారాముల పాదాల చెంత వుంటూ వినయ విధేయతలనే ప్రకటించాడు. హనుమంతునిలో ఒక్కోసారి చిన్నపిల్లల చేష్టలే మనకు కనిపిస్తాయి. చూడామణిని తీసుకుని రాముడు ఆప్యాయంగా కౌగిలించుకొని, ‘నీకేం కావాలో కోరుకో’ అన్నాడు హనుమంతుడిని. ‘మీపట్ల అవ్యాజమైన ప్రేమ నాలో తగ్గకుండా చూడు స్వామీ. నాలో అన్యభావానికే చోటు వుండరాదు’ అంటాడు. మోక్షం కావాలనో, ధనం కావాలనో స్వార్థపరమైన కోరికలు హనుమ కోరనే లేదు. ఒకసారి సీతమ్మ తన పాపిటలో సింధూరం దిద్దుకోవటం చూశాడు. ‘ఇదెందుకు పెట్టుకున్నావు తల్లీ’ అని అడిగితే, ‘సింధూరమంటే రామునికి ఎంతో ప్రీతి’ అంటుంది. దాంతో తెల్లవారి తన ఒళ్ళంతా సింధూరం పూసుకుని సభకు వస్తాడు. భక్తి పారవశ్యత అంటే ఇదీ. ‘ఎవరైతే పూర్తి సమర్పిత భావం, శ్రద్ధాసక్తులతో భగవత్‌ ప్రేమతో సేవ చేస్తారో వారే దాసభక్తులని’ నిరూపించాడు మారుతి.


జీవన గమ్యాలు ఆశ్రమ ధర్మాలు!

     

జీవన గమ్యాలు ఆశ్రమ ధర్మాలు!

కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా


సర్వత్ర మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్ష్యతే॥


- యాజ్ఞ వల్క్యుడు


మానవులకు ‘బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాల’ వంటివే ‘బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసం’ అనే నాలుగు ఆశ్రమ ధర్మాలు. ప్రతి ఒక్కరూ వీటి విలువ తెలుసుకొని మసలుకోగలిగితే జీవన సార్థకత సిద్ధిస్తుంది. ఎవరికైనా బాల్యదశలో ఎలాంటి బరువు బాధ్యతలూ ఉండవు. ‘బ్రహ్మ చర్యాశ్రమం’ ప్రతి ఒక్కరికీ ఒక పరీక్షే. ఈ కాలంలో ‘మనసా వాచా కర్మణా’ ఎప్పుడూ స్త్రీ సంగమ అపేక్షలకు దూరంగా ఉండాలి. ఒక రకంగా ఈ దశ మానవుని భవిష్యత్తుకు బలమైన పునాది వంటిది. బ్రహ్మచారులు గురువుల మన్ననలను పొందేటట్లుగా నడచుకోవాలి. జీవన ప్రణాళికకు అవసరమయ్యే అనుకూలమైన విజ్ఞానాన్ని ఇప్పుడే సముపార్జించుకోవాలి. ఈ జ్ఞానమే బతుక్కు మంచిబాట వేస్తుంది. 


‘గృహస్థాశ్రమం’ జీవితంలో అన్నిటికంటే ప్రధానమైంది. మానవుని ‘భూత భవిష్యత్‌ వర్తమాన’ జీవనానికి ప్రధానమైన వారధిగా ఇదే నిలుస్తుంది. ఈ ఆశ్రమ ధర్మాన్ని నియమబధ్ధంగా పాటించే సజ్జనులు ఇహ-పరలోకాల సుఖాలను కూడా పొందుతారని శాస్ర్తాలు చెబుతున్నాయి. ‘తన సతీమణితో ధర్మబద్ధంగా జీవిస్తూ, కుటుంబ జీవితాన్ని గడిపే గృహస్థునికి తిరుగుండదు. అలాంటివారు ఎప్పటికీ తరిగిపోని ధాన్యసంపదను కలిగివుండే పక్షి, ఎలుకలవలె సుఖజీవనం సాగిస్తారు. వీరికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం సిధ్ధిస్తుంది. కష్టాలు ఎదురైనపుడు రోగగ్రస్థునికి ఔషధం లాగా సమస్యల నుండి గట్టెక్కడానికి ఆ ఇల్లాలు సహకరిస్తుంది (మహాభారతం, అరణ్యపర్వం: 2.74)’. ‘భర్తతో అన్యోన్యంగా కాపురం చేసే స్త్రీకి యజ్ఞదానతపో ఫలాలన్నింటి ఫలితమూ లభిస్తుంది’ అని కూడా ‘మహాభారతం’ (అరణ్యపర్వం: 5.07) నిర్దేశించింది. 



 

ప్రతీ కుటుంబీకుడు తన సంతానాన్నే గాకుండా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనూ తప్పనిసరిగా ఆదరించాలి. విధిగా వారి బాగోగులను చూస్తుండాలని మన సనాతన ధర్మం నిర్దేశించింది. మాతా పితరులకు చేసే సేవవల్ల పిల్లలకు సుఖసంపదలు కలుగుతాయి. కానీ, వారికి కీడు కలిగిస్తే తత్సంబంధ దుఃఖం అనుభవించక తప్పదు (ఆనుశాసనిక పర్వం: 4-279) అని మహాభారతం వెల్లడించింది. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే, ‘ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుందేమోగానీ, తల్లీ తండ్రీ, గురువులపట్ల చేసే పాపాలకు మాత్రం పరిహారం ఉండదు (ఆనుశాసనిక పర్వం: 4-260)’. తమ సంతానంపై ఎనలేని వ్యామోహాన్ని కలిగి ఉండటమనేది తల్లిదండ్రులకు సహజం. ఐనా, వారిని మంచి క్రమశిక్షణతో పెంచాలి. పిల్లలను పొరపాటునైనా కన్నవాళ్లు పొగడకూడదు. అందరికంటే పెద్దవారికి ‘కార్యజ్ఞాన శూరత్వం’ ఉండాలి. అప్పుడే తోబుట్టువులు, కుటుంబసభ్యులందరూ బాగుపడతారు. ‘తమకు ఆపదలొస్తే అండగా ఉండేవాళ్లే నిజమైన బంధువులు. ఎప్పుడూ కీడు చేస్తూ, తమ వంశానికి హాని చేయాలని చూసేవాళ్లను చుట్టాలుగా భావించరాదు (ఆదిపర్వం: 6-181)’. 


‘వృద్ధాప్యం’ (వానప్రస్థాశ్రమం) ప్రతి ఒక్కరికీ ‘అవసాన దశ’. ప్రాచీన కాలంలో కుటుంబ బాధ్యతలను తీర్చుకున్న పిమ్మట, సంసార బంధాలను వదిలిపెట్టి ‘సన్యాసాశ్రమం’ స్వీకరించి అడవుల్లోకి వెళ్లిపోయేవారు. అక్కడ ఏ పర్ణశాలలోనో నివసిస్తూ, ఇంద్రియ నిగ్రహంతో కాలం గడిపేవారు. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు కాయగూరలతోనే కడుపు నింపుకొనేవారు. ప్రతి మనిషీ ఈ జీవిత చరమాంకాన్ని దైవచింతనకే అంకితం చేయాలని సనాతన ధర్మం నిర్దేశించింది. ఈ రోజుల్లో అడవులకు వెళ్లకపోయినా, ఇంట్లో ఉంటూ అయినా మిగిలిన సలక్షణాలను విధిగా పాటించాలి. ‘భౌతిక సుఖాలు, కోర్కెలను ఆశించే వ్యాపారాలను వదిలి పెట్టి ఆధ్యాత్మిక చింతనతో జీవించడమే సన్యాసాశ్రమ ధర్మం’ అని ‘భగవద్గీత’ (18-2) కూడా ఉద్ఘాటించింది. ఈ ఆశ్రమధర్మాలన్నింటినీ బాధ్యతగా నెరవేర్చడమే మనందరి కర్తవ్యం.


డా॥ శాస్ర్తుల రఘుపతి


94937 10552



MATRU VANDANAM

TATVA GANA SUDHA_SWAMI SUNDR CHAITANYANANDA