- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261
పూలకబ్బినంతగా
గీతాసారం మనిషికబ్బలే
వికసించినంత కాలం
ఏ కొమ్మ మీదో
ఏ ఇంతికొప్పుపైనో
దేవుని మెడలోనో
అధి నాయకుని ఎద మీదో
పరిమళిస్తూ పరవశింప చేస్తాయి.
అంతులేని వైభవాన్ని అనుభవిస్తాయి.
రాలిపోయే కాలం వచ్చినప్పుడు
గత కీర్తిని నెమరు వేసుకుంటూ
మనిషిలా బోరున దుఃఖించవు!
ఆయివును గాలిలో విసిరేసి
మట్టితో మమేకమవుతాయి
దుఃఖం అంటని పూలకు
జన్మ రాహిత్యం ఒకరివ్వాలా!
మోక్షం అంటూ ఒకటుంటే
అది బంగారు పల్లెం
తో వస్తుంది!
బతికినంత కాలం మనం
పూలతో కాదు
పూలనే
పూజించాలి.
జ్ఞానోదయానికి నేను గ్యారెంటీ!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261
No comments:
Post a Comment