గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం
Thursday, April 6, 2023
ఎట్లుండె బీజేపీ ఎట్లయింది..? వెల్జాల చంద్రశేఖర్ 98499 98092
ఎట్లుండె బీజేపీ ఎట్లయింది..?
బీజేపీదంతా గత వైభవమేనా? విలువల కోసం వాజపేయి, అద్వానీ వంటి నేతలు చేసిన త్యాగాలకు ఇప్పుడు విలువలేకుండా పోయిందా? అధికారమే పరమావధిగా ఎంతకైనా దిగజారే నేతల చేతుల్లో కమలం కమిలిపోతోందా? గత వైభవాన్నితలచుకుని ఎగిసిపడాలో? ప్రస్తుత పతనానికి కుమిలి పోవాలో? తెలియని అయోమయ పరిస్థితి ప్రస్తుతం ఆ పార్టీ నేతలది.ఇందిరకే ఓటమి తప్పలేదు: 'నిరంకుశంగా వ్యవహరిస్తే ఇందిరాగాంధీవంటి నాయకురాలినే గద్దె దింపి ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చరిత్ర భారత దేశ ప్రజానీకానిది. ఇందిరాగాంధీతో పోలిస్తే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న మోదీ, అమిత్ షాలు ఎంత?' అని బీజేపీ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు.
వెళాల చంద్రశేఖర్ 98499 98092
ఇదీ ఆదర్శం
1998లో అధికారానికి వచ్చి 13 నెలల పాటు వాజపేయి ప్రధానిగా కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వానికి భాగస్వామ్య పక్షమైన ఏఐడీఎంకే మద్దతు ఉపసంహరించుకున్నది. 1999 ఏప్రిల్ 17న విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయింది. అప్పటి బీజేపీ నాయకత్వం ఆ ఒక్క ఓటును కొనలేక కాదు దిగిపోయింది. నైతిక విలువలకు కట్టుబడి గద్దె దిగిన ఆదర్శవాది వాజపేయి.
ఇదీ నైతికత
తెహెల్కా జర్నలిస్ట్ స్టింగ్ ఆపరేషన్లో (2001లో) పార్టీకి విరాళంగా రూ.లక్ష తీసుకున్నందుకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి బంగారు లక్ష్మణ్ రాజీనామా చేశారు. ఆ విరాళం కూడా స్టింగ్ ఆపరేషన్లో భాగమే అయినా, విలువలకు కట్టుబడి ఆయన పదవి వదులుకున్నారు.
ఇదీ సైద్ధాంతిక నిబద్ధత
1996లో హవాలా కుంభకోణంలో ఒక నిందితుడి డైరీలో తన పేరున్నదన్న అపవాదును తీవ్రంగా పరిగణించి స్వీయ క్రమశిక్షణకు కట్టుబడి ఎల్కే అద్వానీ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ డిమాండ్ చేయకపోయినా నైతిక విలువలకు కట్టుబడి ఆయన రాజీనామా చేశారు. నిర్దోషిగా తేలేదాకా నేను పోటీ చేయనని ప్రకటించారు. దీంట్లో క్లీన్చిట్ వచ్చాక రెండేండ్ల తర్వాత 1998లో ఎంపీగా పోటీ చేశారు. అప్పటి విలువలు ఎక్కడ? బీజేపీలో వాజపేయి, అద్వానీల హయాంలో పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉండేది. పార్టీ నాయకులు విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. క్రమశిక్షణకు మారుపేరుగా పార్టీ నడచుకునేది. సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకించేవారు సైతం ఆ పార్టీని క్రమశిక్షణ కలిగిన పార్టీగా గౌరవించేవారు. ఓట్లు, సీట్ల రాజకీయాల కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కేపార్టీ కాదన్న అభిప్రాయం కూడా ప్రజల్లో బలంగా ఉండేది. సైద్ధాంతిక నిబద్ధత, నైతిక విలువలు, క్రమశిక్షణ విషయంలో రాజీపడని పార్టీగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నది. తమ సిద్ధాంతం నచ్చి, మెచ్చి ప్రజల ఆదరాభిమానాలతోనే ఓట్లు, సీట్లు పెంచుకోవాలన్నది అప్పుడు బీజేపీ అనుసరించిన విధానం. ఈ క్రమంలో సిద్ధాంతానికి, నైతిక విలువలకు, క్రమశిక్ష ఇక పార్టీ పెద్దపీట వేసింది. పార్టీకి తమ వల్ల చిన్న పాటి కళంకం, ఆరోపణలు వచ్చినా సంబంధిత నాయకులు నైతిక విలువలకు కట్టుబడి వెంటనే తమ పదవులను త్యజించేవారు. మరి ఆ పరిస్థితులు ప్రస్తుతం బీజేపీలో ఉన్నాయా? గతంలో పార్టీ నాయకులు పాటించిన విలువలు, కట్టుబాట్లలో నేటితరం నాయకులు వీసమెత్తు అయినా పాటిస్తున్నారా? అంటే లేదని సమాధానం వస్తున్నది.
అజాత శత్రువు.. శిఖర సమానుడు రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. మంచి పనులు చేస్తే పాలక పక్షాన్ని కూడా మెచ్చుకోగలిగిన విశాలత్వాన్ని ఆ తరం బీజేపీ నాయకులు ప్రదర్శించారు. పాకిస్థాన్తో యుద్ధం చేసి (1971లో) బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని 'దుర్గామాత'గా అభివర్ణించారు వాజపేయి. ప్రధాని పీవీ హయాంలో జెనీవాలో జరిగిన ఐరాస సమావేశానికి భారత్ తరపున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజపేయిని పంపించడమే అప్పట్లో బీజేపీ నాయకుల పట్ల పాలకులకున్న గౌరవ మర్యాదలకు నిదర్శనం. వాజపేయి కూడా ఏ మాత్రం భేషజానికి వెళ్లకుండా దేశ ఔన్నత్యాన్ని ఈ వేదికపై చాటారు. కానీ ఇప్పటి బీజేపీని చూస్తే...
రెండే రెండు మోదీ-షా నేతృత్వంలో బీజేపీ మణిపూర్ రెండే రెండు సీట్లు గెలుచుకొని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీ మొత్తాన్ని తమలో విలీనం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనులు వీరు. ఇప్పటివరకు 8 రాష్టాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చారు. మూడు సీట్లు మాత్రమే ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో అడ్డంగా దొరికిపోయి, ఇప్పుడు ప్రజాకోర్టులో బీజేపీ దోషిగా నిలబఉంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు దళారులను సీఎం కేసీఆర్ చాకచక్యంగా పద్మవ్యూహంలో బంధించటంతోనే మోదీ-షా ఎలాంటి ఆరాచకాలకు పాల్పడ్డారో పూసగుచ్చినట్టుగా ప్రపంచానికి తెలిసింది. అలాగే తన అనుంగు వ్యాపార మిత్రుడికి శ్రీలంకలో కాంట్రాక్టు ఇప్పించేందుకు భారత ప్రధాని ఒత్తిడి తెచ్చారని శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు చీఫ్ వ్యాఖ్యానించినా ప్రధాని మోదీ ఖండించలేదు. మౌనం అర్ధాంగీకారంగా ఉండిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేం.దుకు ప్రయత్నించిన దళారులు కాల్దటాలో బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ తో మంతనాలు, నంబర్ వన్, నంబర్ టూ అంటూ మోదీ, షాల పేర్ల ప్రస్తావన వచ్చినా.. ఆ ద్వయం నుంచి స్పందన లేదు. ఈ కుట్రలో తమ పాత్ర లేదని వారు ఖండించ లేదు. ఆరోపణలు వచ్చినందున, నిజాలు నిగ్గు తేలేవరకు రాజీనామా చేస్తామని ప్రకటించడమూలేదు. వాజపేయి కాలంతో పోలిస్తే, పార్టీ పతనావస్థకు నేటి రాజకీయమే నిదర్శనంగా నిలుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మోదీ-షా దురాక్రమణ, దురహంకార విధానాలతో రోజురోజుకు పార్టీప్రతిష్ఠ దిగజారిపోవడంతో ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని సీనియర్ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాడు అవినీతిపై పోరాటం.. నేడు రెడ్ కార్పెట్ వాజపేయి హయాంలో కుంభకోణాలపై అవినీతిపై రాజీలేని పోరాటం సాగించారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన విధానాలపై గళమెత్తారు. కానీ ప్రస్తుత బీజేపీ నాయకత్వం ఇందుకు విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీలను తన దారికి తెచ్చుకునేందుకు ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడం నిత్యకృత్యంగా మారింది. పార్టీ గెలువ లేని చోట ప్రభుత్వాలను కూలదోయడం, లొంగని ప్రభుత్వాలపై ఐటీ, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలతో దాడులు చేయించి దారికి తెచ్చుకోవడమే తన విధానంగా మార్చుకున్నది. ఇవేమి కుదరని పక్షంలో ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవుల ఎర చూపి అడ్డదారిలో గద్దె నెక్కిన ఉదంతాలు ఎన్నో. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా తదితర 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసిన విషయం తెలిసిందే. 'చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు... 'చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు...! ఎందరో మహానుభావులు స్థాపించిన బీజేపీలో అప్పటి విలువలు, ఆదర్శాలు మృగ్యమై నేతి బీరకాయలో నెయ్యిలా తయారైంది. బీజేపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైనా వాజపేయి, అద్వానీ వంటి అగ్రనేతల ఆదర్శప్రాయ వ్యక్తిత్వాలు పార్టీకే వన్నె తెచ్చిపెడితే, నేటితరం కాషాయ నేతలు ఆ పార్టీకి కళంకం తెచ్చి, ఉన్న పేరును చెడగొట్టడానికి పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి షా ద్వయం హయాంలో బీజేపీలో సంస్థాగతంగానూ,పాలనాపరంగానూ అరాచకత్వం మొదలైంది. ఈ పరిణామాలతో భవిష్యత్లో బీజేపీ పరిస్థితి ఏమైపోతుందోనని ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఈ ద్వయం నేతృత్వంలో బీజేపీ ప్రతిష్ఠ మసకబారుతున్నా అధికా రంలో కొనసాగడం ఒక్కటే పరమావధిగా అరాజకీయం నడుపుతున్నారని పార్టీలో సీనియర్లు వాపోతున్నారు. ఈ అవాంఛనీయ ధోరణుల పట్ల పార్టీలో అంతర్గతంగా ఆవేదన ఉన్నా, బయటపడితే తమకు కూడా అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్సిన్హా, సుబ్రహ్మణ్యస్వామి వంటి వారికి ఎదురైన అవమానాలు తప్పవని మానంగా కుమిలి పోతున్నారు. బీజేపీ అధినాయకత్వం వ్యవహారశైలితో విసిగికొందరు పార్టీకి ఇప్పటికే దూరమైతే, మరికొందరు పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పొమ్మనలేక పొగ పార్లమెంటులో రెండే రెండు స్థానాలతో బీజేపీ ప్రస్థానం ప్రారంభమైంది. ఎల్ కే అద్వానీ తన రథ యాత్రతో 80 స్థానాలకు తీసుకెళ్లారు. తర్వాత భాగస్వామ్య పక్షాలతో కలిసి వాజపేయి నేతృత్వంలో కేంద్రంలో రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. రెండు పర్యాయాలుగా కేంద్రంలో మోదీ అధికారపగ్గాలు చేపట్టడానికైనా అప్పట్లో ఎల్కే అద్వానీ, వాజపేయి వేసిన పునాదే కారణం. కానీ మోదీ, షా చేతికి బీజేపీ పగ్గాలు చిక్కాక.. అద్వానీతో పాటు, పార్టీ మ్యానిఫెస్టో రూపొందించిన యశ్వంత్సిన్హా వంటి పెద్ద నాయకులంతా పార్టీకి దూరమయ్యారు. మరికొందరు నేతలు పార్టీని వదిలేయాల్సిన పరిస్థితి కల్పించారు. అప్పటి బీజేపీ నాయకత్వం పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి గౌరవిస్తే, మోదీ-షా మాత్రం పార్టీ ఈ స్థాయికి చేరుకోవడానికి కృషిచేసిన వారిని పక్కనపెట్టి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
తల్లి చేలో మేస్తే
బీజేపీకి అనుక్షణం నీడలా ఉంటూ పార్టీని కంటికిరెప్పలా కాపాడుకుంటూ సంఘ్ పరివార్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. కానీ ' తల్లి చేలో మేస్తే పిల్ల గట్టునమేస్తుందా?' అన్నట్టు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో సంఘ్ పరివార్ పాత్రఅడ్డంగా బయట పడింది. కేంద్రంలో బీజేపీ సర్కారక్కు వెనకుండి నడిపించడానికి సంఘ్ పరివార్ తన ప్రతినిధిగా బీఎల్ సంతోషన్ను నియమించింది. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఉదంతంలో బీఎల్ సంతోష్ పాత్ర బయటపడింది. దీంట్లో తన పేరు బయటపడగానే ఇందులో తన ప్రమేయం లేదని ఆయన నిరూపించుకోవాల్సి ఉండే. ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ సంతోష్న నిందితునిగా పేర్కొని నోటీసులు ఇచ్చినా కోర్టు ముందు హాజరు కాకుండా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇందులో తన ప్రమేయం లేకుంటే అదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చే అవకాశం బీఎల్ సంతోష్కు ఉంది. కానీ, కోర్టు ఎదుట హాజరుకాకుండా ముందస్తు స్టేలు తెచ్చుకున్నారంటే. బీజేపీ ఏ స్థాయికి దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు నింద రాగానే అత్యున్నత పదవులు వదులుకున్ననాటి బీజేపీ నాయకులు ఎక్కడ? కోర్టుల చాటున తప్పించుకుంటున్న నేటి బీజేపీ నేతలెక్కడ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment