గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం
Wednesday, May 31, 2023
కరుణా సాగర మొరవినలేవా నావ్యథ కనుగొనిరావా
కరుణా సాగర మొరవినలేవా నావ్యథ కనుగొనిరావా
ఓడు బ్రతుకురా తోడైరారా తీరము ననుచేరనీరా
1.ఆమనితలచే కోయిలపిలిచే నాహృది నిన్నేవలచే
మదినిండా నినుకొలిచే ఆమనిపొంగెను
కోయిలపాడెను క్రుంగెను నామదికుమిలి
2.నింగినేల రెండుగవున్నా నేలనువిడువదు
నింగి కడుపున దాచును ఒంగి
నీవు నేను ఒకటిగ వున్నా యెడబాటే బ్రతుకంతా
3.నిలవదు దేహము ఆగదు ప్రాణము కాలము సాచును
కరము మరణము తీర్చును రుణము రగిలిన మదితో
పగిలిన యెదతో మనగలనా నిను మరచీ
Tuesday, May 30, 2023
ఎందుకునీ దయరాదు క్రిష్ణా పూజలెన్నోచేసి దారులెన్నోకాచి వేచిచూచినకనులుకాయలుకాచే క్రిష్ణా
ఎందుకునీ దయరాదు క్రిష్ణా
పూజలెన్నోచేసి దారులెన్నోకాచి
వేచిచూచినకనులుకాయలుకాచే క్రిష్ణా
పంకమున పుట్టిన పద్మముతగదని
హృదయ కొలనులో వూహించితినినుగని
ప్రేమజలములో పెరిగినభక్తి
సుమము సమర్పించితిని క్రిష్ణా ...
కఠినమైన కొమ్మకు కాచిన ఫలము
పూజకు కాదని మానుకొంటి
నీవేకర్తగసాగిన నాకర్మ
ఫలమేమేలనుకొంటి క్రిష్ణా
వేద్యుడవు ఆరాధ్యుడవైనా నైవేద్యము
ఏదో తెలియక నీమెళకువలో
మెలిగినమనమును
విందుగముందుంచితిని క్రిష్ణా
కప్పురము వెలిగించి
కాంతినితీసిన సాగే కాంతి
సరిగాదనియెంచి
రాగరసములో తడిసినభక్తి
వత్తిని వెలిగించితిని
Monday, May 29, 2023
Sunday, May 28, 2023
Saturday, May 27, 2023
Friday, May 26, 2023
Thursday, May 25, 2023
Chaitanya Bhagavad Gita FULL LINKS
https://archive.org/details/1.CHAITANYABHAGAVADGITAARJUNAVISHADAYOGAMU1stCHAPTERSUNDARACHAITANYANANDA
https://archive.org/details/2.CHAITANYABHAGAVADGITASankhyaYogam2ndCHAPTERSUNDARACHAITANYANANDA
https://archive.org/details/3.CHAITANYABHAGAVADGITAKarmaYogamu3rdCHAPTERSUNDARACHAITANYANANDA
https://archive.org/details/4.CHAITANYABHAGAVADGITAGNANAYOGAMU4thCHAPTERSUNDARACHAITANYANANDA
https://archive.org/details/5.CHAITANYABHAGAVADGITAKARMASANYASAYOGAMU5thCHAPTERSUNDARACHAITANYANANDA
https://archive.org/details/6.CHAITANYABHAGAVADGITAATMASAMYAMAYOGAMU6thCHAPTERSUNDARACHAITANYANANDA
https://archive.org/details/7.CHAITANYABHAGAVADGITAGNANAVIGNANAYOGAMU7thCHAPTERSUNDARACHAITANYANANDA
https://archive.org/details/8.CHAITANYABHAGAVADGITAAKSHARAPARABRAHMAYOGAMU8thCHAPTERSUNDARACHAITANYANANDA
https://archive.org/details/9.CHAITANYABHAGAVADGITARAJAVIDYARAJAGUHYAYOGAMU9thCHAPTERSUNDARACHAITANYANANDA
https://archive.org/details/10.CHAITANYABHAGAVADGITAVIBHUTIYOGAMU10thCHAPTERSUNDARACHAITANYANANDA
https://archive.org/details/11.ChaitanyaBhagavadgitaVishwarupasandarshanaYogamu11thChapterSundarachaitanyananda
https://archive.org/details/12.ChaitanyaBhagavadgitaBhaktiYogamu12thChapterSundarachaitanyananda
https://archive.org/details/13.ChaitanyaBhagavadgitaKshetraKshetragnaVibhagaYogamu13thChapterSundarachaitanyananda
https://archive.org/details/14.ChaitanyaBhagavadgitaGunatrayavibhagaYogamu14thChapterSundarachaitanyananda
https://archive.org/details/15.ChaitanyaBhagavadgitaPurushottamapraptiYogamu15thChapterSundarachaitanyananda
https://archive.org/details/16.ChaitanyaBhagavadgitaDaivasurasampadvibhagaYogamu16thChapterSundarachaitanyananda
https://archive.org/details/17.ChaitanyaBhagavadgitaShradhatrayavibhagaYogamu17thChapterSundarachaitanyananda
https://archive.org/details/18.ChaitanyaBhagavadgitaMokshasanyasaYogamu18thChapterSundarachaitanyananda/page/n1/mode/2up
https://archive.org/details/@sudarshan_reddy330?query=%23SWAMI_SUNADARA_CHAITANYANANDA
Chaitanya Bhagavad Gita
Chaitanya Bhagavad Gita
ఓం నమో భగవతే వాసుదేవాయ
Chaitanya Bhagavad Gita
![]() |
Chaitanya Bhagavad Gita |
జీవితంలో ఒక మంచి గ్రంథాన్ని చదవడం ఒక భాగ్యం. కాని జీవితానికి సరిపడే విశిష్ట గ్రంథాన్ని అధ్యయనం
చేయడం మహద్భాగ్యం. వ్యక్తికి పుణ్య ఫలంగా లభించే ప్రసాదం. పరమాత్మ అనుగ్రహంగా ప్రాప్తించే వరం.
అట్టి వర ప్రసాదమే చైతన్య భగవద్గీత
నాలుగు దశాభ్దాలుగా తమ అసమాన ప్రజ్ఞా పాటవాలతో, తపశక్తితో, జనతను, జాతిని అనితర సాధ్యంగా
జాగృతం చేసి, అలుపెరుగని గళంతో అనర్గళంగా ప్రవచిస్తూ ఆంధ్రావనిలో ఆధ్యాత్మిక వెలుగులను విరజిమ్మిన ఋషిపుంగవులు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు
జ్ఞానబ్రహ్మ, ఆర్షవిద్యా వాచస్పతి, పూజ్య గురుదేవులు
శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు
శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు
అనితర సాధ్యంగా రచించిన అపూర్వ అద్భుత వ్యాఖ్యానము చైతన్య భగవద్గీత
నాలుగు సంపుటాలలో, రెండు వేల పుటలను నింపుకుని, సదా మీకు తోడుగా ఉండేందుకు
శ్లోక తాత్పర్యాలతో మూడు వందల పుటల చిన్న సైజు భగవద్గీతను కూడా ఉంచుకొని,
అక్షయ నిధిలా, అమృత కలశంలా భాసిస్తున్న అందమైన చైతన్య భగవద్గీత బ్యాగును అందుకొని, మీ గృహాన్ని ఆనందధామం చేసుకోండి. ఖరీదు రూ. 1500/- మాత్రమే.
ఏది ఉన్నా, ఎన్ని ఉన్నా తృప్తి నెరుగని వారు
చైతన్య భగవద్గీత తోడుందని సంతృప్తి చెందుతారు.
ఇది స్తవం కాదు; వాస్తవం.
అందుకోండి. అధ్యయనం చేయండి. తరించండి. తరింప చేయండి.
లోకా స్సమస్తా సుఖినో భవంతు!
వివరములకు: Sundara Chaitanya Ashram.
మన ఆరాధ్యప్రముఖులు... మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు
మన ఆరాధ్యప్రముఖులు... మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు
మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకులు, పురాలిపి శాస్త్రజ్ఞులు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మగారు పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని మినిమించిలిపాడులో డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ, భద్రయ్య గార్లకు 1891లో జన్మించారు. ఈయన గృహ నామమైన మల్లంపల్లి అనే గ్రామం తెలంగాణలోని "పాలకుర్తి"కి "బమ్మెర"కు సమీపమున నున్న గ్రామం లేదా ములుగు సమీపాన నేటికీ గల మల్లంపల్లి గ్రామం. కాకతీయ పతనానంతరం శర్మ గారి పూర్వీకులు అక్కడ నుంచి గోదావరి మండలానికి తరలి వచ్చారని తెలుస్తుంది. సోమశేఖర శర్మగారు డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి. సాహిత్యరంగంలోను, రాజకీయ రంగంలోను ప్రసిద్ధి గాంచాడు. బిపిన్ చంద్రపాల్ ప్రసంగాల ప్రభావం ఈయన మీద ఉండటం వల్ల రాజమహేంద్రవరంలో విద్యార్థులు వందేమాతర ఉద్యమం చేపట్టాడు.
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. కథలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించాడు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరానికి మారింది. ఆరోజులలో చరిత్ర చతురాననుడుగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి వీరభద్రరావుతో శర్మకు పరిచయమైంది. అతనికి సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశాడు. అనంతరం విజ్ఞాన సర్వస్వం కృషిలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, రాయప్రోలు సుబ్బారావు వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు.
శాసనములను ప్రకతించుటయందు ముఖ్యముగ వారి నిదానము, పాఠనిర్ణయము, సంపూర్ణమైన చక్కని వ్యాఖ్య ప్రతి శాసన పరిశోధకుడును నేర్వవలసియున్నది. తొందరపాటు అనునదే వారెరుగరు. పాఠ నిర్ణయమున తుదకొక్క అక్షర విషయమున చిన్న మార్పును సుచించినవారినైనా పెద్దగా ప్రశంసించుట వారికలవాటు. కేవలము '''భారతి'''లో వారు ప్రకటించిన శాసనములు సుమారు 30; ఎపిగ్రాఫియా ఇండికాలోనివి 4-ఆంధ్రపత్రిక రజితోత్సవ సంపుటములు, తెలంగాణా శాసనములు ప్రకటించియున్నారు. ఆంధ్ర దేశానికి సంబంధించిన ముఖ్య శాసనములు కొన్ని ఆంగ్లములో ఇత్రరత్రా ప్రకటించినప్పుడు వాటిని ఆయా వ్యాసకర్తల పేరనే మరల భారతిలో చక్కగా సంస్కరించి ఆంధ్రావనికంద జేయుచుండెడివారు. శాసన పరిశోధనలో ప్రకటించిన శాసనముల సంఖ్య ముఖ్యముకాదు; వానిపాఠనిర్ణయము, వ్యాఖ్య ముఖ్యముగ గమనించదగినవి. శర్మ గారు వ్యాఖ్యలే అందుకు నిదర్శనములు.
శాసనములను ప్రకతించుటయందు ముఖ్యముగ వారి నిదానము, పాఠనిర్ణయము, సంపూర్ణమైన చక్కని వ్యాఖ్య ప్రతి శాసన పరిశోధకుడును నేర్వవలసియున్నది. తొందరపాటు అనునదే వారెరుగరు. పాఠ నిర్ణయమున తుదకొక్క అక్షర విషయమున చిన్న మార్పును సుచించినవారినైనా పెద్దగా ప్రశంసించుట వారికలవాటు. కేవలము '''భారతి'''లో వారు ప్రకటించిన శాసనములు సుమారు 30; ఎపిగ్రాఫియా ఇండికాలోనివి 4-ఆంధ్రపత్రిక రజితోత్సవ సంపుటములు, తెలంగాణా శాసనములు ప్రకటించియున్నారు. ఆంధ్ర దేశానికి సంబంధించిన ముఖ్య శాసనములు కొన్ని ఆంగ్లములో ఇత్రరత్రా ప్రకటించినప్పుడు వాటిని ఆయా వ్యాసకర్తల పేరనే మరల భారతిలో చక్కగా సంస్కరించి ఆంధ్రావనికంద జేయుచుండెడివారు. శాసన పరిశోధనలో ప్రకటించిన శాసనముల సంఖ్య ముఖ్యముకాదు; వానిపాఠనిర్ణయము, వ్యాఖ్య ముఖ్యముగ గమనించదగినవి. శర్మ గారు వ్యాఖ్యలే అందుకు నిదర్శనము
Wednesday, May 24, 2023
Tuesday, May 23, 2023
Monday, May 22, 2023
Sunday, May 21, 2023
Saturday, May 20, 2023
Subscribe to:
Posts (Atom)