గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Wednesday, November 18, 2020

దైవప్రార్థన - "గీతామకరందము"స్వామి విద్యాప్రకాశానందులవారి గ్రంధము నుండి


దైవప్రార్థన - "గీతామకరందము"స్వామి విద్యాప్రకాశానందులవారి గ్రంధము నుండి దైవప్రార్థన కరుణామూర్తియగు దేవా! మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందును నీ పాదారవిందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి యుండునట్లు అనుగ్రమింపుము . పరమ దయానిధీ! ప్రాతఃకాలమున నిద్రలేనిచినది మొదలు మరల పరుండువరకును మనోవాక్కాయములచే మా వలన ఎవరికిని అపకారము కలుగకుండునట్లును, ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగునను సద్బుధ్ధిని దయచేయుము . సచ్చిదానందమూర్తీ ! నిర్మలాత్మా ! మా యంతఃకరణమునందు ఎన్నడును, ఏ విధమైన దుష్టసంకల్పముగాని, విషయవాసనగాని అజ్ఞానవృత్తిగాని, జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము. వేదాంతవేద్యా! అభయస్వరూపా! మా యందు భక్తి,జ్ఞాన,వైరాగ్యబీజము అంకురించి శీఘ్రముగా ప్రవృద్ధము లగునట్లు ఆశీర్వదింపుము. మఱియు ఈ జన్మమునందే కడతేరి నీ సాన్నిధ్యమున కేతెంచుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుము. దేవా! నీవు భక్తవత్సలుడవు దీనులపాలిటి కల్పవృక్ష స్వరూపుడవు. నీవు తప్ప మాకుఇంకెవ్వరు దిక్కు? నిన్ను ఆశ్రయించితిమి . అసత్తు నుండి సత్తునకు గొనిపొమ్ము . తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొనిపొమ్ము . మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము. ఇదే మా వినతి. అనుగ్రహింపుము. నీదరిజేర్చుకొనుము. పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహి. ఓం తత్ సత్ శ్రీ శ్రీ శ్రీ స్వామి విద్యాప్రకాశానందుల వారి "గీతామకరందము" గ్రంధము నుండి సేకరించబడినది ప్రార్థన చేసినవారు బ్రహ్మచారి విజయానంద శ్రీ శుకబ్రహ్మాశ్రమం శ్రీ కాళహస్తి (ఈ ప్రార్ధనను ఎవరు ప్రతిదినము నియమముతప్పక ఉదయము నిద్రలేచునపుడును, రాత్రిపరుండబోవునపుడును మనస్ఫ్ఫూర్తిగా పఠించుదురో, అట్టివారికి జీవితమునందేలాటిదోషములున్ను కలుగకుండుటయేగాక భగవంతుని యొక్క అనుగ్రహమునకున్ను వారు పాత్రులు కాగలరు.) దైవప్రార్థన - "గీతామకరందము"స్వామి విద్యాప్రకాశానందులవారి గ్రంధము నుండి

Tuesday, November 3, 2020

*కరోనా హెచ్చరిక: ప్రజా ప్రయోజనాల రీత్యా జారీ చేయబడింది.

 *కరోనా హెచ్చరిక:

ప్రజా ప్రయోజనాల రీత్యా జారీ చేయబడింది. 

కరోనా వైరస్ వ్యాప్తి  ఇప్పుడు  2 వ దశలో  ఉందని, సోకిన 3 రోజులలోనే   తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

*దయచేసి మీ పనులు అన్ని పక్కన పెట్టి 2 నిముషాలు ఈ అత్యవసర కరోనా మెసేజ్ చదవండి..*

ఇంతకు ముందు కరోనా వైరస్ వేరు. ఇప్పుడు అది మారిన తీరు వేరు.. ఒకప్పుడు కరోనా వైరస్ బారిన పడితే తుమ్ము, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు చూపిస్తూ 14 రోజులు టైం ఇచ్చేది..

మరియు 60 ఏళ్ళు దాటిన వారికి తీవ్రం గాను, యుక్త మధ్య వయస్సు వారికి స్వల్పం గాను ప్రభావాన్ని చూపేది.కానీ world హెల్త్ organisation (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ముందుగానే చెప్పినట్టు ఈ రోజున కరోనా అత్యంత డేంజర్ స్థితి లోకి చేరుకుంది.ఏ మాత్రం లక్షణాలు కనబడకుండానే, వయస్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ళ వారినైనా సరే మూడే మూడు రోజుల్లో  మృత్యువు ముంగిట నిలిపి మరణ మృదంగం వాయిస్తూ  మరలి రాని లోకాలకు తీసుకెళ్లి పోతూ ఉంది..

రోజూ కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు అయిన వాళ్ళని, అందర్నీ  దిగ్భ్రాంతికి గురి చేసి మూడే మూడు రోజుల్లో మృత్యు ఒడి లోకి జరుకుని  తీవ్ర దుఃఖాన్ని మిగుల్చు తున్నారు.. 

కరోనా వెరీ డేంజర్ స్టేజ్ లో ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు వెల్లడించిందంటే..  కరోనా సోకిన 1,2 రోజుల్లోనే ఇది కరోనా అని తెలుసుకునే లోపే  ట్రీట్మెంట్ చేసినా బతకలేని స్థితిలో మనిషి ఊపిరి ఆపి ఉసురు తీసుకుంటూ ఉంది.. 

*ఏముంది కరోనా పోయింది లే.. ఎక్కువ కేసులు లేవు లే.. సి-విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నాం లే.. మన వరకూ రాదులే.. దేవుడున్నాడు లే అని మాస్క్ లు లేకుండా, సామజిక దూరం పాటించకుండా, sanitisation చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే మూడే రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్లి పోవడం గ్యారంటీ..* 

ఎందుకంటే ఇప్పుడు కరోనా ప్రకృతిని తట్టుకుని నిలబడి తనని తాను మరింత ప్రమాదకర వైరస్ గా రూపు దిద్దుకుంది. 

కనుక నిర్లక్ష్యాలు, ఓవర్ కాన్ఫిడెన్స్ లు అన్ని పక్కన పెట్టి   C, D, జింక్ లాంటి మల్టీ విటమిన్ లు తీసుకుంటూ, *మాస్క్ లు, హ్యాండ్ sanitisation లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ..*  అన్నిటికంటే మరీ ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని తాగ వలెను..లేదంటే కరోనా మనల్ని కాటికి పంపే కార్యక్రమాన్ని దేవుడు కూడా కాపాడ లేడు..


కావున ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వీడి,14 రోజుల కరోనా నుండి అత్యంత ప్రమాద కారిగా మారిన ఈ 3 రోజుల కరోనా వైరస్ ని నిశితంగా గమనిస్తూ పై సూచనలు జాగ్రత్తగా కాపాడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకో వలసిందిగా కోరుచున్నాము. 


ఈ మెసేజ్ ని 10 మందికి పంపి మీ పక్క వారు కూడా పాటించేలా జాగ్రత్త పడండి.. 


ఎందుకంటే, ఈ కరోనా వ్యాపించేది పక్క మనిషి నుండే అనే విషయాన్ని మర్చి పోవద్దు.. ఒక్కోసారి పనికి రాని చెత్త విషయాలను షేర్ చేస్తూ సమయం వృధా చేస్తూ ఉంటాం.

ఈ ఒక్కసారికి  ఈ విలువైన msg ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చెయ్యండి.. 


*గుర్తుంచుకోండి.. ఇప్పుడు ఉన్నది 14 రోజుల కరోనా కాదు.. 3 రోజుల కరోనా అనే విషయాన్ని మర్చిపోవద్దు..*🙏

మోహనరాగ తరంగం - మధురమైన లలిత గీతం

 

2

పాల సంద్రమున పవ్వళించావా జాలిలేకనన్ను జారవిడిచావా(Vimeo link description...

జీవితమింతేనా సుఖదుఖాల సమరాంగణమేనా